ఆయుష్
azadi ka amrit mahotsav

మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా (MDNIY).. భారతదేశంలో యోగాకు హార్వర్డ్లాంటి విశ్వవిద్యాలయం అవుతుంది: సర్బానంద సోనోవాల్


మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా (MDNIY) యూనివర్సిటీని ఆయుష్ మంత్రి సర్బానంద్ సోనోవాల్ సందర్శించారు.

Posted On: 16 AUG 2021 7:11PM by PIB Hyderabad

మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా (MDNIY) యుఎస్ హార్వర్డ్ యూనివర్సిటీతో సమానంగా యోగా రంగంలో ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా అవతరించే అవకాశం ఉందని ఆయుష్ మంత్రి  సర్బానంద సోనోవాల్ సోమవారం అన్నారు.  ఆయుష్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా (MDNIY) యూనివర్సిటీని తొలిసారి సందర్శించిన సందర్భంగా వర్సిటీ అధ్యాపకులనుద్దేశించి ప్రసంగించారు.

"MDNIY ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు నంబర్ వన్ ఇన్స్టిట్యూట్ అవుతుంది. దీని కోసం మనం ప్రపంచస్థాయిలో ప్రయత్నాలు చేయాలి. అమెరికా దేశం హార్వర్డ్ లాంటి సంస్థను ఏర్పాటు చేయగలిగినప్పుడు.. మనం ఎందుకు చేయలేము? యోగాలో విద్య మరియు పరిశోధన కోసం ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు భారతదేశాన్ని సందర్శించడానికి ఈ యూనివర్సిటీ  దారులు తెరుస్తుందని సోనోవాల్ అన్నారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కల నెరవేర్చడానికి ప్రపంచ విధానం అవసరం అని మంత్రి నొక్కిచెప్పారు. "అందమైన మరియు ఆరోగ్యకరమైన శరీరాల కోసం ప్రజలు భారతదేశపు గుమ్మం వద్ద నిలబడి ఉన్నారు. ప్రస్తుతం, మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా (MDNIY) యోగా విద్య, శిక్షణ, మెడిసిన్ మరియు పరిశోధనతో సహా అన్ని సౌకర్యాలను కలిగిఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన  విద్యార్థులకు యూనివర్సిటీలో హాస్టల్ ఏర్పాట్లు ఉండాలి. మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా (MDNIY) లో అద్భుతమైన హాస్టల్ సౌకర్యాలు సంస్థకు విలువను జోడిస్తాయి "అని  సోనోవాల్ చెప్పారు.

ఆయుష్ మంత్రి విశ్వవిద్యాలయం యొక్క అన్ని తరగతులను సందర్శించారు.  ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ.. తాను ప్రతి ఉదయం సుమారు 30 నిమిషాల పాటు యోగాను అభ్యసిస్తానని చెప్పారు.  లైబ్రరీతోపాటు ధ్యాన కేంద్రం, వర్సిటీ  క్యాంపస్‌ని కూడా సోనోవాల్ సందర్శించారు. యోగాకు సంబంధించి విద్యార్థుల ప్రదర్శనలను కూడా తిలకించారు.

 మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా (MDNIY)లో ఇప్పటివరకు 18,000 మంది పారామిలిటరీ సైనికులకు యోగా శిక్షణ ఇచ్చారని మిడ్నీ డైరెక్టర్ డాక్టర్ ఈశ్వర్ వి. బసవరాది అన్నారు. తీహార్ జైలులోని ఖైదీలకు  యోగాను పరిచయం చేసే ప్రయత్నం కూడా చేశామన్నారు. . "యోగా వ్యవస్థ మన జీవితానికి కొత్త కోణాలను ఇస్తుంది. ఇది మీ దినచర్యలో భాగం కావాలి ”అని విద్యార్థునుద్దేశించి చెప్పారు. 

***


(Release ID: 1746578) Visitor Counter : 234