సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

న్యూస్ఆన్ఎయిర్ రేడియో లైవ్-ప్రసారాలు ఇండియా ర్యాంకింగ్ లు భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమం - భూలే భిస్రే గీత్

Posted On: 16 AUG 2021 11:39AM by PIB Hyderabad

న్యూస్ఆన్ఎయిర్ ర్యాంకింగ్ ల పరంపరలో వివిధ భారతిలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమాల ర్యాంకింగ్ కూడా చేరాయి. వివిధ భారతి జాతీయ ఛానెల్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన 3 రేడియో షోలు భూలే బిస్రే గీత్, కుచ్ బాతే కుచ్ గీత్, వివిధ భారతి కి రంగోలి. 

న్యూస్‌ఆన్‌ఎయిర్ యాప్‌లో ఆల్ ఇండియా రేడియో లైవ్-స్ట్రీమ్‌లు అత్యంత ప్రాచుర్యం పొందిన భారతదేశంలోని అగ్ర నగరాల తాజా ర్యాంకింగ్స్‌లో  పాట్నా స్థానంలో లక్నో జాబితాలో చోటు సంపాదించింది. మొదటిసారిగా టాప్ 10 లో ప్రవేశించింది.

భారతదేశంలోని అగ్రశ్రేణి అల్ ఇండియా రేడియో ప్రసారాల ర్యాంకింగ్‌లలో ప్రధాన మార్పులలో, ఎఫ్ఎం గోల్డ్ ఢిల్లీ 9 నుండి 6 వ ర్యాంక్ వరకు గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది, రెయిన్బో కన్నడ కమాన్బిలు  4 నుండి 7 వ స్థానానికి,  ఎఫ్ఎం రెయిన్‌బో ఢిల్లీ 7 నుండి 10 వ స్థానానికి పడిపోయాయి.

ఆల్ ఇండియా రేడియో 240 కంటే ఎక్కువ రేడియో సేవలు ప్రసార భారతి అధికారిక యాప్ అయిన న్యూస్‌ఆన్ఎయిర్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయి. న్యూస్‌ఆన్‌ఎయిర్ యాప్‌లోని ఈ ఆల్ ఇండియా రేడియో స్ట్రీమ్‌లు భారతదేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా, 85 కి పైగా దేశాలలో మరియు ప్రపంచవ్యాప్తంగా 8000 నగరాల్లో పెద్ద సంఖ్యలో శ్రోతలను కలిగి ఉన్నాయి. ఆల్ ఇండియా రేడియో లైవ్-స్ట్రీమ్‌లు  భారతదేశంలోని అగ్ర నగరాలో అత్యంత ప్రాచుర్యం పొందాయి. ఈ ర్యాంకింగ్‌లు జూలై 16 నుండి జూలై 31, 2021 వరకు పక్షం రోజుల డేటా ఆధారంగా నిర్ధారించినవి.

                                                                                                                                     

*****


(Release ID: 1746362) Visitor Counter : 191