నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ సభ్యులతో కేంద్ర విద్యుత్ మరియు కొత్త & పునరుత్పాదక ఇంధన మంత్రి సంభాషించారు


2030 నాటికి 450 జీడబ్లూ నిర్దేశిత పునరుత్పాదక ఇంధన లక్ష్యాన్ని సాధించడానికి భారతదేశం ముందుకు సాగుతోంది మరియు విద్యుత్ పంపిణీ సంస్కరణలు మరియు విద్యుత్ గ్రిడ్‌కి ఓపెన్‌ యాక్సిస్‌ను ప్రోత్సహించడం పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచుతుంది: శ్రీ ఆ.ర్‌కె. సింగ్

వాతావరణ మార్పులు, స్వచ్ఛమైన ఇంధనం మరియు సుస్థిరత భారతదేశం-యుఎస్ క్లీన్ ఎనర్జీ ఎజెండా 2030 భాగస్వామ్యానికి సంబంధించి అమెరికా మరియు భారతదేశ భాగస్వామ్య లక్ష్యాలపై నిబద్ధతను మంత్రి పునరుద్ఘాటించారు.

Posted On: 14 AUG 2021 8:47AM by PIB Hyderabad

 

కేంద్ర విద్యుత్ మరియు కొత్త & పునరుత్పాదక ఇంధన మంత్రి వర్చువల్ ఈవెంట్‌లో యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యుఎస్‌ఐబిసి) సభ్యులతో సంభాషించారు. సమావేశం యొక్క ఎజెండా "అడ్వాన్సింగ్‌ క్లీనర్, మరింత స్థిరమైన మరియు సరసమైన శక్తితో ముందుకు సాగుతుంది. వాతావరణ మార్పులను తగ్గించడానికి మరియు భారతదేశ ఆర్థిక వృద్ధికి శక్తినిస్తుంది".

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్లు, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిదారులు, బ్యాంకింగ్, విమానయానంతో సహా వివిధ రంగాలకు చెందిన 50 మందికి పైగా పరిశ్రమల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల 100 జిడబ్లూ ఇన్‌స్టాల్ చేయబడిన పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించినందుకు వ్యాపారనేతలు కేంద్ర మంత్రిని అభినందించారు. ఈ సమావేశం భారతదేశంలోని పునరుత్పాదక ఇంధనం మరియు విద్యుత్ రంగం మరియు సంబంధిత అవకాశాల కోసం వివిధ అంశాలపై కేంద్ర మంత్రితో ప్రపంచ పెట్టుబడిదారులు సంభాషించడానికి వ్యాపార సమాజానికి అవకాశాన్ని అందించింది.

2030 నాటికి 450 జీడబ్లూ  పునరుత్పాదక ఇంధన లక్ష్యాన్ని సాధించడానికి భారతదేశం పయనిస్తోందని, విద్యుత్ పంపిణీ సంస్కరణలు మరియు విద్యుత్ గ్రిడ్‌కి ఓపెన్ యాక్సెస్‌ని ప్రోత్సహించడం ద్వారా పునరుత్పాదక ఇంధన వినియోగం పెరుగుతుందని శ్రీ ఆర్.కె. సింగ్ వ్యాపారవేత్తలకు వివరించారు. పునరుత్పాదక శక్తి, ఇధన సామర్థ్యం, ఉద్గార తీవ్రత తగ్గింపు మరియు భారతదేశం నుండి ఉత్పాదన మరియు ఎగుమతులను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వ ప్రణాళికలను పంచుకున్నారు. సౌర ఘటాలు, మాడ్యూల్స్ మరియు బ్యాటరీల తయారీకి పిఎల్‌ఐ పథకం, మరియు గ్రీన్ హైడ్రోజన్ ప్రమోషన్ వంటి పథకాల వివరాలను తెలిపారు. ప్రతిష్టాత్మకమైన 450 జీడబ్లూ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ రంగాన్ని ప్రోత్సహించడానికి ఆలోచనలు మరియు సూచనలను ఆయన స్వాగతించారు.

వాతావరణ మార్పు, స్వచ్ఛమైన ఇధనం మరియు సుస్థిరత మరియు ఇండియా-యుఎస్ క్లీన్ ఎనర్జీ ఎజెండా 2030 భాగస్వామ్యానికి సంబంధించి అమెరికా మరియు భారతదేశ భాగస్వామ్య లక్ష్యాలపై  తమ నిబద్ధతను మంత్రి పునరుద్ఘాటించారు.


 

***



(Release ID: 1745798) Visitor Counter : 342