వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

హెచ్ పీఎంసి తో కలసి బహరైన్ కు అయిదు ప్రత్యేక రకాల ఆపిల్ పళ్ళను ఎగుమతి చేసిన ఏపీఈడిఏ


భారతదేశ 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆపిల్ పళ్ళు ప్రదర్శించబడతాయి

Posted On: 13 AUG 2021 11:29AM by PIB Hyderabad

క్రొత్త గమ్యస్థానాలకు వ్యవసాయ మరియు ప్రాసెస్ చేయబడిన ఆహార ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడానికి చేపట్టిన కార్యక్రమంలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ హార్టికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ అండ్ ప్రాసెసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ( హెచ్ పీఎంసి ) తో కలసి  ఏపీఈడిఏ ఈ రోజు  ఐదు ప్రత్యేక రకాల యాపిల్స్ ను తొలిసారిగా  బహరైన్ కు  ఎగుమతి చేసింది.  రాయల్ డెలీషియస్ , డార్క్ బారన్ గాలా  , స్కార్లెట్ స్పర్, రెడ్ వెలాక్స్, గోల్డెన్ డెలీషియస్ రకాల  ఆపిల్ పళ్ళను   తొలిసారిగా  బహ్రెయిన్ కు పంపించారు .

ఆపిల్ పళ్ళను  హిమాచల్ ప్రదేశ్ రైతుల నుంచి సేకరించిన  వీటిని  ఏపీఈడిఏ లో నమోదైన  డీఎం ఎంటర్‌ప్రైజెస్ ఎగుమతి చేసింది. ఆపిల్ ప్రమోషన్ ప్రోగ్రామ్‌లోవీటిని  ప్రముఖ రిటైలర్ - అల్ జాజిరా గ్రూప్ 15 ఆగస్టు 2021 నుంచి ప్రదర్శిస్తుంది. దీనితో పాటు భారతదేశ స్వాతంత్ర్య  75 వ సంవత్సర వేడుకల్లో భాగంగా   భారత్ కి ఆజాదీ కి అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. 

భారతదేశంలో లభిస్తున్న వివిధ రకాల ఆపిల్‌లనుబహ్రెయిన్‌లో వినియోగదారులకు పరిచయం చేయాలన్న లక్ష్యంతో  ఆపిల్ ప్రమోషన్ ప్రోగ్రాంను  నిర్వహిస్తున్నారు.

కోవిడ్-19 రూపంలో రవాణా అంశంలో ఎదురైన సమస్యలను అధిగమిస్తూ దేశంలో ఉత్పత్తి అవుతున్న మామిడిపళ్ళను కొత్త దేశాలకు పరిచయం చేస్తూ నూతన్ మార్కెట్లపై భారతదేశం దృష్టి సారించిన సమయంలో ఆపిల్ ఎగుమతులు ప్రారంభం అయ్యాయి. 

మధ్యప్రాచ్య దేశాలకు మామిడి ఎగుమతులను ఎక్కువ చేయాలన్న లక్ష్యంతో 2021 జూలై నెలలో తూర్పు ప్రాంతంలో పండుతున్న మామిడి  పళ్లను   మధ్యప్రాచ్య దేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభం అయ్యింది. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో భౌగోళిక గుర్తింపు( జీఐ) సర్టిఫికెట్ కలిగివున్న ఫాజిల్ రకం మామిడి  బహ్రెయిన్‌కు ఎగుమతి చేయబడింది. వీటిని  ఏపీఈడిఏ లో నమోదైన కోల్‌కతాకి చెందిన  డీఎం ఎంటర్‌ప్రైజెస్ ఎగుమతి చేసింది. వీటిని   బహ్రెయిన్ కి చెందిన అల్ జజీరా గ్రూప్,ద్వారా దిగుమతి చేసుకుంది.

సాంప్రదాయేతర ప్రాంతాలు మరియు రాష్ట్రాల నుంచి పండ్లు మరియు కూరగాయల ఎగుమతులను పెంచడానికి  ఏపీఈడిఏ   చర్యలు ప్రారంభించింది.   మామిడి ఎగుమతులను ప్రోత్సహించడానికి వర్చువల్ విధానంలో కొనుగోలుదారులు -విక్రేతల మధ్య  సమావేశాలు, ఉత్సవాలను సంస్థ  నిర్వహిస్తోంది.

బహ్రెయిన్‌కు మామిడి రవాణాను ప్రారంభించడానికి ముందు  దోహా, ఖతార్‌లో మామిడి ప్రోత్సాహక కార్యక్రమాన్నిఏపీఈడిఏ  నిర్వహించింది. ఇక్కడ పశ్చిమ బెంగాల్ ,ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉత్పత్తి అవుతూ  జీఐ సర్టిఫికెట్ కలిగివున్న   తొమ్మిది రకాల మామిడి పళ్లను   దిగుమతి దారు నిర్వహిస్తున్న కుటుంబ ఆహార కేంద్రం దుకాణాలలో ప్రదర్శనకు ఉంచారు. (Release ID: 1745437) Visitor Counter : 257