పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

పౌర‌విమాన‌యాన రంగంలో నైపుణ్యాభివృద్ధికి చ‌ర్య‌లు


బ‌హుళ నైపుణ్యాల అభివృద్ధి కేంద్రం (ఎంఎస్‌డిసి), విమాన‌యాన నైపుణ్యాల అభివృద్ధి కేంద్రం ఏర్పాటు
3589 మంది అభ్య‌ర్ధులు, సిబ్బందిని అంచ‌నా వేసి , వివిధ ఎఎఎస్ఎస్ సి ఉద్యోగాల‌కు స‌ర్టిఫై చేయ‌డం జ‌రిగింది
ఇప్ప‌టివ‌ర‌కు 84 శిక్ష‌ణ‌కేంద్రాలకు అక్రిడిటెష‌న్‌

Posted On: 11 AUG 2021 11:38AM by PIB Hyderabad

 ఎయిరోస్పేస్‌,ఏవియేష‌న్ సెక్ట‌ర్ స్కిల్‌కౌన్సిల్ ( ఎ ఎ ఎస్ ఎస్ సి) తీసుకున్న‌కీల‌క చ‌ర్య‌లు కింది విధంగా ఉ న్నాయి.
ఎయిర్‌పోర్ట్స్ అథారిటిఆఫ్ ఇండియా(ఎఎఐ) కార్పొరేట్ సామాజిక బాధ్య‌తా నిధుల‌తో చండీఘ‌డ్‌లో విమాన‌యాన రంగ నైపుణ్యాల‌కు బ‌హుళ నైపుణ్యాల అభివృద్ధి కేంద్రం (ఎం.ఎస్‌.డి.సి) ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది.
అలాగే ఎఎఐ కార్పొరేట్ సామాజిక బాధ్య‌తా నిధుల కింద శిక్ష‌ణ అమ‌లు భాగ‌స్వామిగ లెర‌న్ నెట్‌స్కిల్స్‌సంస్థ  ముంబాయిలో, ఏవియేష‌న్ స్కిల్ డ‌వ‌ల‌ప్‌మెంట్‌సెంట‌ర్‌ను ఏర్పాటుచేసింది.
ఈ సంస్థ ఇప్ప‌టివ‌ర‌కు అన్ని ఏయిరో ఇండియా షోల‌లో 2017 నుంచి పాల్గొంటూవ‌స్తున్న‌ది. అలాగే ఏవియేష‌న్ నైపుణ్యాలు, ఏయిరో స్పేస్ ప్రోత్సాహానికి సంబంధించి ల‌క్నోలో 2019లో జ‌రిగిన డిఫెక్స్‌పోలో కూడా పాల్గొనింది.
ఏయిరోస్పేస్ త‌యారీ, అసెంబ్లీ, డిజైన్‌కు సంబంధించి సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్‌ను బెంగ‌ళూరులోని సిఎస్ఐఆర్‌- ఎన్ ఎ ఎల్ ప్రాంగ‌ణంలో 2019 జూన్‌లో ఏర్పాటుచేయ‌డం జ‌రిగింది.
 అప్రెంటిస్ షిప్‌పై నేష‌న‌ల్ స్కిల్‌డ‌వ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (ఎన్ ఎస్‌డిసి) , బెంగళూరు ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్‌(బిఐఎఎల్‌) కొలాబ‌రేష‌న్‌తో ఇంట‌రాక్టివ్ డిస్క‌ష‌న్‌లు నిర్వ‌హించ‌డం జ‌రిగింది.
ఎఐ-ఎస్‌.ఎ.టి.ఎస్ , హిందూస్థాన్ ఎయిరో నాటిక్ లిమిటెడ్‌(హెచ్‌.ఎ.ఎల్‌), భార‌త నౌకాద‌ళానికి చెందిన వివిధ ఎఎఎస్ ఎస్ సి ఉద్యోగాల‌కు సంబంధించి  3589మంది అభ్య‌ర్ధులు, ఉద్యోగుల నైపుణ్యాల‌ను అంచ‌నా వేసి స‌ర్టిఫై చేయ‌డంజ‌రిగింది.
ఎఎఎస్ ఎస్‌సిద్వారా ఇప్ప‌టివ‌ర‌కు 84 శిక్ష‌ణ కేంద్రాల‌కు గుర్తింపు నివ్వ‌డం జ‌రిగింది. ఎన్ఎస్ డిసి, ఎఎఎస్ ఎస్‌సి ఏర్పాటుచేసిన శిక్ష‌ణ‌కేంద్రాల అక్రిడిష‌న్‌కు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాలు https://smart.nsdcindia.org/user_manuals.aspx పై అందుబాటులో ఉన్నాయి.


విమాన‌యాన‌రంగానికి నైపుణ్యంక‌లిగిన మాన‌వ వ‌న‌రులు అందుబాటులో ఉంచేందుకు ఎఎఎస్ఎస్‌సి కృషి చేస్తోంది.ఈఉద్యోగాల‌ను ప‌రిశ్ర‌మ క‌ల్పిస్తున్న‌ది. ఎఎఎస్ ఎస్ సి ఏరోస్పేస్‌, ఏవియేష‌న్ రంగాల‌కుసంబంధించిన ఐదు ఉప‌రంగాలు ఎయిర్‌లైన్‌లు,ఎయిర్‌పోర్టులు,ఎంఆర్ ఒ ,డిజైన్‌,డ‌వ‌ల‌ప్‌మెంట్ మాన్యుఫాక్చ‌రింగ్ అసెంబ్లీ ల‌కు వివిధ అర్హ‌తా ప్ర‌మాణాలు- నేష‌న‌ల్ ఆక్యుపేష‌న‌ల్ స్టాండ‌ర్డ్స్ ను 72ఉద్యోగాల‌కు రూపొందించింది.స్వ‌ల్ప‌కాలిక నైపుణ్యాల స‌ర్టిఫికేష‌న్‌కు దీనిని వాడుతారు.
శిక్ష‌ణ కేంద్రాలు(టిసి), శిక్ష‌ణ అందించే సంస్థ‌ల(టిపి) వివ‌రాల‌ను అనుబంధం -1, అనుబంధం -2 ల‌లో జ‌త‌చేయ‌డం జ‌రిగింది.
ఈ స‌మాచారాన్ని పౌర విమాన‌యాన‌శాఖ స‌హాయ‌మంత్రి జ‌న‌ర‌ల్ (రిటైర్డ్‌) డాక్ట‌ర్ వి.కె. సింగ్ ఈరోజు రాజ్య‌స‌భ‌లో డాక్ట‌ర్ విన‌య్ పి స‌హ‌స్ర‌బుద్ధే కు ఒక లిఖిత‌పూర్వ‌క స‌మాధానంలో తెలిపారు.

***



(Release ID: 1745054) Visitor Counter : 190


Read this release in: English , Urdu , Bengali , Punjabi