సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
ఎస్సీలలో అంతర్గత రిజర్వేషన్ డిమాండ్
Posted On:
11 AUG 2021 4:03PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు తమ శాసనసభ ఆమోదించిన తీర్మానం కాపీని పంపినప్పుడు షెడ్యూల్డ్ కులాల ఉప-వర్గీకరణ కోసం అభ్యర్థించాయి. జస్టిస్ ఉషా మెహ్రా నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్డ్ కులాల ఉప-వర్గీకరణ సమస్యను పరిశీలించడానికి జాతీయ కమిషన్ ఏర్పాటు చేయబడింది. ఎన్‌సిఎస్సీఎస్సీ 01.05.2008 న సమర్పించిన నివేదికలో షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణ మరియు డి ఉపవర్గీకరణ కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ని సవరించాలని సిఫార్సు చేసింది. ఈ మేరకు ప్రధాన వాటాదారుల అభిప్రాయాలను పొందాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్‌సిఎస్సీఎస్సీ సిఫారసుపై రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్రపాలిత పరిపాలన విభాగాలు వారి అభిప్రాయాలను త్వరగా తెలపాలని చివరిగా 09.12.2019 న గుర్తు చేశారు. అంతేకాకుండా, ఈ విషయం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది.
ఈ సమాచారాన్ని సామాజిక న్యాయం మరియు సాధికారతశాఖ సహాయ మంత్రి శ్రీ. ఎ. నారాయణస్వామి రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో అందించారు.
*****
(Release ID: 1744982)
Visitor Counter : 275