ఆర్థిక మంత్రిత్వ శాఖ

60వ వార్షిక పబ్లిక్ ఎంటర్ప్రైస్ సర్వే 2019-20 విడుదల చేసిన డీపీఈ

Posted On: 11 AUG 2021 3:32PM by PIB Hyderabad

ఆర్థిక మంత్రిత్వ శాఖ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ విభాగం (డీపీఈ),  ఏటా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సిపిఎస్ఈలు) పనితీరుపై ప్రభుత్వ రంగ సంస్థల సర్వేను తెస్తుంది. పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సర్వే 2019-20ని లోక్‌సభకు 6 ఆగష్టు, 2021 న, రాజ్యసభకు 9 ఆగష్టు, 2021న సమర్పించారు. పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ (పీఈ) సర్వే 2019-20 ఈ సిరీస్‌లో అరవయ్యవది. సీపీఎస్ఈ విభాగం మొత్తం 100% గణన అయిన పీఈ సర్వే, వివిధ ఆర్థిక మరియు భౌతిక పారామితులపై అన్ని   సీపీఎస్ఈలకు అవసరమైన గణాంక డేటాను సంగ్రహిస్తుంది. పీఈ సర్వే సీపీఎస్ఈలను వ్యవసాయం, ఖనిజ అన్వేషణ, తయారీ, ప్రాసెసింగ్ & జనరేషన్, సర్వీసెస్, నిర్మాణంలో ఉన్న ఎంటర్‌ప్రైజెస్ అనే ఐదు విభాగాలుగా విభజిస్తుంది. ఇంకా 21 తత్సంబంధిత గ్రూపులుగా విభజించింది. కేంద్ర ప్రభుత్వం 50% కంటే ఎక్కువ ఈక్విటీని కలిగి ఉన్న సీపీఎస్ఈలను సర్వే కవర్ చేస్తుంది. ఈ కంపెనీల అనుబంధ సంస్థలు, భారతదేశంలో నమోదు అయి ఉంటే, దీనిలో సీపీఎస్ఈ(లు) 50% కంటే ఎక్కువ ఈక్విటీ వాటాలు కూడా సీపీఎస్ఈలుగా వర్గీకరిస్తారు. పీఈ  సర్వే 2019-20 ప్రకారం 31 మార్చి, 2020 నాటికి 256 క్రియాశీల సీపీఎస్ఈలు ఉన్నాయి.

ముఖ్యాంశాలు: 

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల 2019-20లో పనితీరు ప్రధాన అంశాలు: 

* 31.3.2020 నాటికి అన్ని సీపీఎస్ఈలలో మొత్తం చెల్లింపు మూలధనం రూ. 3,10,737 కోట్లుగా ఉంది.
* అన్ని సీపీఎస్ఈలలో మొత్తం ఆర్థిక పెట్టుబడులు రూ .21,58,877 కోట్లు.
* అన్ని సీపీఎస్ఈలలో మూలధనం రూ. 31,16,455 కోట్లు.
* 2019-20 ఆర్థిక సంవత్సరంలో 256 ఆపరేటింగ్ సీపీఎస్ఈల కార్యకలాపాల నుండి స్థూల ఆదాయం రూ. 24,61,712 కోట్లు.
* 2019-20 ఆర్థిక సంవత్సరంలో లాభాలను ఆర్జించే 171 సీపీఎస్ఈల లాభం 1,38,112 కోట్ల రూపాయలుగా ఉంది.

* 2019-20 ఆర్థిక సంవత్సరంలో 84 నష్టాల్లో ఉన్న  సీపీఎస్ఈల నష్టం రూ. 44,817 కోట్లు.

* మార్చి 31, 2020 నాటికి అన్ని  సీపీఎస్ఈల నిల్వలు, మిగులు రూ.9,57,579 కోట్లుగా ఉన్నాయి.
* మార్చి 31, 2020 నాటికి అన్ని సీపీఎస్ఈల నికర విలువ రూ .12,35,706 కోట్లు.
* 2019-20 ఆర్థిక సంవత్సరంలో 105  సీపీఎస్ఈల ద్వారా ప్రకటించిన/చెల్లించిన డివిడెండ్ రూ. 72,136 కోట్లు.
* 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ సుంకం, కస్టమ్ డ్యూటీ, జిఎస్టీ, కార్పొరేట్ పన్ను, కేంద్ర ప్రభుత్వ రుణాలపై వడ్డీ, డివిడెండ్, ఇతర సుంకాలు, * పన్నుల ద్వారా అన్ని సీపీఎస్ఈలు కేంద్ర ఖజానాకు అందించింది రూ.3,76,425 కోట్లు.
* వస్తువులు మరియు సేవల ఎగుమతి ద్వారా సీపీఎస్ఈల విదేశీ మారక ఆదాయాలు 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ .1,21,756 కోట్లుగా ఉన్నాయి.

పూర్తి పీఈ సర్వే రిపోర్ట్ 2019-20ని పొందాలంటే క్లిక్ చేయండి  : https://dpe.gov.in/.

 

****



(Release ID: 1744979) Visitor Counter : 190