పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

విమానాశ్రయాల విస్తరణకు తీసుకున్న చర్యలు

Posted On: 11 AUG 2021 11:55AM by PIB Hyderabad

మెట్రో నగరాల్లోని విమానాశ్రయాలతో సహా విమానాశ్రయాల విస్తరణ, అభివృద్ధి నిరంతర ప్రక్రియ. వాణిజ్య సాధ్యత, ట్రాఫిక్‌ డిమాండ్, భూమి లభ్యత మొదలైన అంశాల ఆధారంగా, 'ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా' (ఏఏఐ) లేదా సంబంధిత విమానాశ్రయ నిర్వాహక సంస్థ ఎప్పటికప్పుడు వీటిని చేపడతాయి. విమానాశ్రయాల విస్తరణ, అభివృద్ధి కోసం భూమి అందుబాటు సంబంధిత సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాలు సహా సంబంధిత వర్గాలతో మాట్లాడతాయి. డిమాండ్ ఆధారంగా దిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌ విమానాశ్రయాల్లో సంబంధిత విమానాశ్రయ నిర్వాహక సంస్థలు ఈ క్రింది విస్తరణ పనులు చేపట్టాయి:

 

విమానాశ్రయం

పని

దిల్లీ

టెర్మినల్స్‌ 1, 3 విస్తరణ, 4వ రన్‌వే నిర్మాణం

 

చెన్నై

సమీకృత టెర్మినల్‌ భవనం పునఃనిర్మాణం, అనుబంధ పనులు

 

కోల్‌కతా

టెక్నికల్ బ్లాక్/ఏటీసీ టవర్ నిర్మాణం, హ్యాంగర్ల నిర్మాణం, వాయు మార్గ సామర్థ్యం పెంపు

 

బెంగళూరు

టెర్మినల్ 2 నిర్మాణం

హైదరాబాద్‌

ప్రయాణీకుల టెర్మినల్ భవనం, వాయు మార్గ మౌలిక సదుపాయాల విస్తరణ

 

పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి శ్రీ వి.కె. సింగ్ ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా ఇవాళ రాజ్యసభకు సమర్పించారు.

***


(Release ID: 1744729) Visitor Counter : 151


Read this release in: English , Urdu , Bengali