ఆయుష్
హోమియోపతి, సంప్రదాయ వైద్య విధానంలో అంతర్జాతీయ సహకారం
Posted On:
10 AUG 2021 5:28PM by PIB Hyderabad
భారతప్రభుత్వానికి చెందిన ఆయుష్ మంత్రిత్వశాఖ, 11 విదేశీ భాగస్వామ్య సంస్థలతో ఎం.ఒ.యులు కుదుర్చుకునేందుకు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ హోమియోపతి సంస్థ(సిసిఆర్‌హెచ్)కు అనుమతి ఇచ్చింది. అవి షారె జెడెక్ మెడికల్ సెంటర్ (ఇజ్రాయిల్), యూనివర్సెడిడాడ్ మైమోనైడ్స్(అర్జెంటీనా), కాలేజ్ ఆఫ్ హోమియోపత్స్ ఆఫ్ ఒనటారియో(కెనడా), విస్ హామ్-సైంటిఫిక్ సొసైటీ ఫర్ హోమియోపతి (జర్మని), ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ రియో డి జెనీరియో (బ్రెజిల్), నేషనల్ సెంటర్ ఫర్ నాచురల్ ప్రాడక్ట్స్ రిసెర్చ్ (యుఎస్ఎ), హోమియోపథిక్ ఫార్మకోపియా కన్వెన్షన్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ (యుఎస్ఎ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ (ఆస్ట్రేలియా), ఇన్‌స్టిట్యూట్ ఫర్ ద హిస్టరీ ఆఫ్ మెడిసిన్ - రాబర్ట్ బాచ్ ఫౌండేషన్ (జర్మని), రాయల్ లండన్ హాస్పిటల్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్(యుకె),నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అండ్ హోమియోపతి (మెక్సికో) ఉన్నాయి. హోమియో పతి వైద్యాన్ని అంతర్జాతీయంగా ప్రోత్సహించడానికి, ప్రచారం చేయడానికి ఈ సంస్థలతో ఎం.ఒ.యులు కుదర్చుకుంది.
ఆయుష్ మంత్రిత్వశాఖ సంప్రదాయ వైద్యం, హోమియో కు సంబంధించి పరస్పర సహకారానికి అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంటున్నది. భారత ప్రభుత్వం దేశం నుంచి దేశంతో సంప్రదాయ వైద్యంలో పరస్పర సహకారానికి 25 అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇలా ఒప్పందాలు కుదుర్చుకున్న దేశాల జాబితాలో నేపాల్, బంగ్లాదేశ్, హంగరీ, ట్రినిడాడ్ ,టొబాగో, మలేసియా, మారిషస్, మంగొలియా, తుర్క్‌మెనిస్తాన్, మయన్మార్, జర్మని, ఇరాన్, సావో టోమ్ అండ్ ప్రిన్స్, ఈక్వెటోరియల్ గినియా , క్యూబా, కొలంబియా, జపాన్ , బొలీవియా, గాంబియా, రిపబ్లిక్ ఆఫ్ గునియా, చైనా ,సెంట్ విన్సెంట్ అండ్ ది గ్రెనాడినెస్, సూరినామ్, బ్రెజిల్, జింబాబ్వే ఉన్నాయి.
సమష్టి పరిశోధన,సంప్రదాయ వైద్యం అభివృద్ధికి సంబంధించి 31 విదేశీ సంస్థలతో అవగాహనా ఒప్పందాలపై సంతకాలు రిగాయి. వీటిలో అమెరికా, జర్మనీ, యుకె, కెనడా, అర్జెంటీనా, ఇజ్రాయిల్, మలేసియా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, తజకిస్తాన్, సౌదీ అరేబియా, ఈక్వెడార్, జపాన్, ఇండొనేసియా, రియూనియన్ ఐలండ్, మెక్సికో, హంగరీ ఉన్నాయి. విదేశీ సంస్థలు, విశ్వవిద్యాలయాలలో ఆయుష్ అకడమిక్ పీఠాలను ఏర్పాటు చేసేందుకు 13 ఎం.ఒ.యులు కుదిరాయి. ఇందులో హంగరీ, లాత్వియా, మారిషస్, బంగ్లాదేశ్, రష్యా, వెస్ట్ ఇండీస్ థాయిలాండ్, ,ఇండొనేసియా, స్లొవేనియా, అర్మీనియా, అర్జెంటీనా, మలేసియా, దక్షిణాఫ్రికా ఉన్నాయి.
ఈ సమాచారాన్ని ఆయుష్ శాఖ మంత్రి శ్రీ శర్వానంద్ సోనోవాల్ రాజ్యసభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 1744718)
Visitor Counter : 190