భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
2021నుంచి 2026 మధ్య 5 సంవత్సరాల కాలానికి 4077 కోట్ల రూపాయల మొత్తం బడ్జెట్‌తో డీప్ ఓషన్ మిషన్‌ను భూ విజ్ఞానశాస్త్ర మంత్రిత్వశాఖ అమలు చేయనున్నట్టు చెప్పిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్.
ఈమిషన్‌కు సంబంధించి సముద్రగర్భంలో మైనింగ్, జీవవైవిధ్యం, ఇంధనం, తాజానీరుతోపాటు మత్స్య ఆర్ధిక వ్యవస్థకు మద్దతుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో ప్రైవేటు సంస్థలను కలుపుకోవడం జరుగుతుందన్న మంత్రి
Posted On:
10 AUG 2021 3:57PM by PIB Hyderabad
2021-2026 సంవత్సరాల మధ్య 5 సంవత్సరాల కాలానికి భూవిజ్ఞాన మంత్రిత్వశాఖ 4077 కోట్ల రూపాయల వ్యయంతో డీప్ ఓషన్ మిషన్ (డిఒఎం)ను అమలు చేసేందుకు అనుమతిచ్చినట్టు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ(స్వతంత్ర) , భూ విజ్ఞానం (స్వతంత్ర )శాఖ సహాయమంత్రి, ప్రధానమంత్రి కార్యాలయంంం, పెన్షన్, ప్రజా ఫిర్యాదులు , పెన్షన్, అణు ఇంధనం, అంతరిక్షశాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర ప్రసాద తెలిపారు.
ఈరోజు రాజ్యసభలో ఒక లిఖిత పూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ మంత్రి, ఈ మిషన్‌కు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు , మైనింగ్, జీవవైవిధ్యం, ఇంధనం, ఫ్రెష్‌వాటర్ తదితరాలకు సంబంధించి సముద్రగర్భంలో కార్యకలాపాలు చేపట్టడానికి, నీలి ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి ప్రైవేటు సంస్థలను కూడా చేర్చనున్నట్టు ఆయన తెలిపారు.
భూ విజ్ఞాన మంత్రిత్వశాఖ, అంతర్జాతీయసీబెడ్ అథారిటీ (ఐఎస్ఎ) తో కాంట్రాక్టు ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా మధ్య హిందూ మహాసముద్ర బేసిన్‌లో పాలీ మెటాలిక్ నోడుల్స్ (పిఎంఎన్), వాయవ్య,మధ్య ఇండియన్ రిడ్జ్ ప్రాంతంలో పాలి మెటాలిక్ సల్ఫైడ్స్ (పిఎంఎస్)అన్వేషణ కార్యకలాపాలను చేపడుతున్నట్టు చెప్పారు.
ప్రాథమిక అంచనాల ప్రకారం, రాగి, నికెల్, కోబాల్ట్, మాంగనీస్‌తో కూడిన పాలిమెటాలిక్ నొడ్యూల్స్ మధ్య హిందూ మహాసముద్ర ప్రాంతంలో కేటాయించిన 75,000 చదరపు కిలోమీటర్ల పరిధిలో అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. ఈ ఖనిజాల విలువ అంచనా సుమారు 110 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంటుంది. పాలి మెటాలిక్ సల్ఫైడ్స్‌లో అరుదైన లోహాలు , బంగారం , వెండి వంటివి కూడా ఉండనున్నాయి.
ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం కలిగిన దేశాలలో అమెరికా , ఫ్రాన్స్, జపాన్, రష్యా, చైనాలు ఉన్నాయి.
(Release ID: 1744712)
Visitor Counter : 183