ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
అరుదైన వ్యాధులతో బాధపడేవారి కోసం జాతీయ పోర్టల్
Posted On:
10 AUG 2021 1:39PM by PIB Hyderabad
'అరుదైన వ్యాధుల జాతీయ విధానం-2021' ప్రకారం, అరుదైన వ్యాధులతో బాధపడే రోగుల చికిత్స కోసం క్రౌడ్ ఫండింగ్, స్వచ్ఛంద విరాళాల కోసం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డిజిటల్ పోర్టల్ ప్రారంభించింది. https://rarediseases.nhp.gov.in/ ద్వారా ఈ పోర్టల్‌ను యాక్సెస్ చేయవచ్చు.
కేంద్ర ఔషధ విభాగం, ఔషధాల తయారీ కోసం 'ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకాన్ని' అమలు చేస్తోంది. వివిధ ఔషధ కేటగిరీల దేశీయ తయారీ కోసం, ఎంపిక చేసిన ఉత్పత్తిదారులకు ఆర్థిక ప్రోత్సాహకాలను ఈ పథకం కింద అందిస్తుంది. ఔషధ విభాగం వెబ్‌సైట్‌లో 'పథకాలు' శీర్షిక కింద ఈ పథకం మార్గదర్శకాలు అందుబాటులో ఉన్నాయి.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డా. భారతి ప్రవీణ్ పవార్ ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా ఇవాళ రాజ్యసభకు సమర్పించారు.
***
(Release ID: 1744396)
Visitor Counter : 201