ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 అప్‌డేట్‌

Posted On: 10 AUG 2021 9:57AM by PIB Hyderabad

ఇండియాలో గ‌త 24 గంట‌ల‌లో 28,204 కొత్త కోవిడ్ కేసులు న‌మోద‌య్యాయి. గ‌త 147 రోజుల‌లో క‌నిష్ఠ కేసులు న‌మోదు
ఇండియాలో క్రియాశీల కేస్‌లోడ్ ప్రస్తుతం 3,88,508, ఇది 139 రోజుల క‌నిష్ఠం
క్రియాశీల కేసులు మొత్తం కేసుల‌లో 1.21 శాతం. మార్చి 2020 నుంచి చూసిన‌పుడే క‌నిష్ఠం స్థాయి.
గ‌రిష్ఠ‌స్థాయిలో రిక‌వ‌రీ రేటుకు చేరడం జ‌రిగింది. ప్ర‌స్తుతం ఇది 97.45 శాతం
దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు 3,11,80,968 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
గ‌త 24 గంట‌ల‌లో 41,511 మంది పేషెంట్లు కోవిడ్ నుంచి కోలుకున్నారు.
ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్త  కోవిడ్ వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా 51.45 కోట్ల వాక్సిన్ డోస్‌లు వేయ‌డం జ‌రిగింది.
వార‌పు పాజిటివిటి రేటు 5 శాతం కంటే త‌క్కువ‌గా ఉంటున్న‌ది.ప్ర‌స్తుతం ఇది 2.36 శాతం.
రోజువారి పాజిటివిటి రేటు 1.87 శాతం. ఇది గ‌త 15 రోజులుగా 3 శాతం కంటే త‌క్కువ‌గా ఉంటున్న‌ది.
దేశంలో కోవిడ్ ప‌రీక్ష‌ల నిర్ధార‌ణ‌ను గ‌ణ‌నీయంగా పెంచ‌డం జ‌రిగింది. ఇప్ప‌టివ‌ర‌ర‌కు 48.32 కోట్ల కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం జ‌రిగింది.


 

****


(Release ID: 1744331) Visitor Counter : 177