మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
పాఠశాల విద్యలో భారతీయ విలువల పరిచయం
Posted On:
09 AUG 2021 3:30PM by PIB Hyderabad
జాతీయ విద్య పరిశోధన శిక్షణ మండలి (ఎన్‌సిఇఆర్‌టి) 2005 నేషనల్ కరికులమ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌సిఎఫ్) 2005ను అభివృద్ధి చేసింది. ఇది నైతిక విలువల అభివృద్ధిని ప్రధానంగా ప్రస్తావిస్తుంది. విద్యార్థులు తమకు తాముగా విలువలు నైపుణ్యాలతో తగిన వైఖరులతో మెలగడం, తాను పొందికైన భావాలతో ఉండడంతోపాటు ఇతరులతో సామరస్యపూర్వకంగా ఉండేలా ఇవి ఎంతగానొ దోహదపడతాయి. ఇందుకు సంబంధించి ఎన్.సి.ఇ.ఆర్.టి తగిన పాఠ్యప్రణాళిక, పుస్తకాలు, పాఠ్యప్రణాళికకు సంబంధించిన ఇతర పుస్తకాలు రూపొందించింది. ఎన్.సి.ఇ.ఆర్.టి పుస్తకాలు పర్యావరణం, శాంతితో ముడిపడిన విలువలు, స్త్రీపురుష సమానత్వానికి సంబంధించిన అంశాలు, ఎస్.సి, ఎస్.టి మైనారిటీ లకు సంబంధించిన అంశాలను ప్రాథమిక, సెకండరీస్థాయి పుస్తకాలలో , అనుబంధ పుస్తకాలలో చేర్చింది. అలాగే భారతీయ విలువలను తెలియజెప్పేందుకు ప్రయత్నించింది. సామాజిక శాస్త్రాల బోధన అభ్యసన విధానంలో వీటిని
పరిచయం చేయడానికి ప్రయత్నించడం జరుగుతోంది.
నూతన విద్యా విధానం (ఎన్.ఇ.పి) 2020 నైతిక తార్కికత, సంప్రదాయ భారతీయ విలువలు, అన్ని మౌలిక మానవ, రాజ్యాంగ విలువలు( సేవ, అహింస, స్వచ్ఛత, సత్యము, నిష్కామకర్మ, శాంతి, త్యాగం, సహిష్ణుత, వైవిధ్యం, బహుళత్వం, న్యాయమార్గం,స్త్రీపురుష సమానత్వం,వయోధికుల పట్ల గౌరవభావం, ప్రజలందరి పట్ల గౌరవభావం )వంటి వాటిని పాఠ్యప్రణాళికలో చేర్చేందుకు వీలు కల్పిస్తున్నది.
ఎన్.ఇ.పి 2020 ఇందుకు సంబంధించిన పాఠ్య ప్రణాళిక, బోధనఅంతా పునాది విద్యాస్థాయినుంచే అందించనుంది. ఇది కూడా భారతీయ మూలాలు, స్థానిక నేపథ్యం, సందర్భం, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, ఘన వారసత్వం, భాష, తాత్వికత, భౌగోళిక నేపథ్యం, ప్రాచీన,సమకాలీన విజ్ఞానం, సామాజిక, శాస్త్రీయ అవసరాలకు అనుగుణంగా దీనిని ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా, విద్యార్ధులకు అత్యంత ఆసక్తిదాయకంగా ఉండే విధంగా మరింత ప్రయోజనకరంగా ఉండే రీతిలో అందించడం జరుగుతుంది.
.విద్యామంత్రిత్వశాఖ ఎన్.సి.ఇ.ఆర్.టి ద్వారా ప్రతి సంవత్సరం కళా ఉత్సవాలను నిర్వహిస్తుంది.దీని ద్వారా దేశీయ కళలు, సంస్కృతిని విద్యలో ప్రోత్సహించడం దీని ఉద్దేశం. ఈ కార్యక్రమం కింద దేశంలోని విద్యార్ధులలోగల కళాత్మక ప్రతిభను వెలికితీసి అందరికి తెలియజేయడం దీని ఉద్దేశం. ఫలితంగా విద్యార్ధులు పాఠశాల, జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయిలో దేశంలోగల సాంస్కృతిక వైవిధ్యతను గొప్పగా అర్థం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. ఇది మన ప్రాంతీయ సాంస్కృతిక ఘన వారసత్వాన్ని తెలియజెబుతుంది. కళా ఉత్సవ్‌లో భాగంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన పాఠశాలల విద్యార్ధులు పాల్గొంటారు.ఏక్ భారత్ , శ్రేష్ఠ్ భారత్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి 2015 అక్టోబర్ 31న , సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ని పురస్కరించుకుని రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా ప్రారంభించారు. మన దేశానికి గల భిన్నత్వంలో ఏకత్వాన్ని సగర్వంగా చాటుకునేందుకు, అలాగే జాతీయ సమగ్రతా స్ఫూర్తిని ప్రోత్సహించేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్యబలమైన, జాతీయ సమగ్రతా భావన విలసిల్లేందుకు దీనిని చేపట్టారు. అలాగే భాష, సంస్కృతి, సంగీతం, పర్యాటకం, వంటలు, క్రీడలు, సంప్రదాయాలను పరస్పరం ప్రజలు తెలుసుకునేందుకు అవగాహన చేసుకునేందుకు దీనిద్వారా వీలు కలుగుతుంది. మధ్యప్రదేశ్‌ను ఈ కార్యక్రమం కింద మణిపూర్, నాగాలాండ్ తో జత చేయడం జరిగింది. ఈ రాష్ట్రాలు పరస్పరం ఒక రాష్ట్ర ఆచారాలు,వ్యవహారాలు సంస్కృతి సంప్రదాయాలను మరో రాష్ట్రం విద్యార్ధులు అవగాహన చేసుకోవడానికి వీలు కలుగుతుంది. ఇందుకు సంబంధించి ఆయా కార్యక్రమాలకు మార్గదర్శకాలను రూపొందించింది.
ఈ సమాచారాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు ఒక లిఖితపూర్వక సమాధానంలో లోక్‌సభకు తెలియజేశారు.
***
(Release ID: 1744315)
Visitor Counter : 454