ఆర్థిక మంత్రిత్వ శాఖ
నిర్వహణ ఉన్న 171 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు 2019-20 ఆర్థిక సంవత్సరంలో నికర లాభాలను ఆర్జించాయి
Posted On:
09 AUG 2021 6:15PM by PIB Hyderabad
అందుబాటులో ఉన్న తాజా సమాచారం మేరకు 2019-20 ఆర్థిక సంవత్సరంలో 171 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్ఈలు) లాభాలను ఆర్జించాయి. ఇందులో మహారత్న, నవ రత్న, మినీరత్న సంస్థలు కూడా ఉన్నాయి. ఈరోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిసన్‌రావు ఖరాద్ ఈ విషయాన్ని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ రంగంలో మొత్తం 10 మహారత్నాలు, 14 నవరత్న, 73 మినీరత్న సంస్థలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. బడ్జెట్ 2021-22, ఇంటర్ ఆలియాగా ఒక మహారత్న సీపీఎస్ఈ.. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్),
, రెండు నవరత్న సీపీఎస్ఈలు.. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మరియు కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐ), రెండు మినీరత్న సీపీఎస్ఈ సంస్థలైన
బీఈఎంఎల్, పవన్‌హన్స్ లిమిటెడ్ సంస్థలలో తగినంత వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ
నిర్ణయించినట్టుగా మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు.
****
(Release ID: 1744285)
Visitor Counter : 177