భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

49 నగరాల్లోని 160 కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు 1,590 విద్యుత్ వాహనాలను సమకూర్చిన / సమకూర్చనున్న - ఈ.ఈ.ఎస్.ఎల్. / సి.ఈ.ఎస్.ఎల్.

Posted On: 09 AUG 2021 3:56PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని, కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సి.ఈ.ఎస్.ఎల్.-100 శాతం ఈ.ఈ.ఎస్.ఎల్. యాజమాన్యంలోని అనుబంధ సంస్థ) ద్వారా ఈ-మొబిలిటీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు, ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈ.ఈ.ఎస్.ఎల్) తెలియజేసింది.  చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, దేశీయ విద్యుత్ వాహన తయారీదారులు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కంపెనీలు, ఫ్లీట్ ఆపరేటర్లు, సర్వీస్ ప్రొవైడర్లు మొదలైన వాటికి ప్రోత్సాహాన్ని అందించే లక్ష్యంతో ఈ-మొబిలిటీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.  భారతదేశంలో విద్యుత్ వాహన (ఈ.వి) పరిశ్రమ దీర్ఘకాల వృద్ధికి, సామర్థ్యాలను పెంపొందించుకోవడం తో పాటు ఖర్చులను తగ్గించడం, స్థానిక తయారీ సౌకర్యాలను సృష్టించడం, సాంకేతిక సామర్థ్యాలను పెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. తద్వారా, భారతీయ విద్యుత్ వాహనాల తయారీదారులు ప్రధాన అంతర్జాతీయ పోటీదారులుగా ఎదగడానికి అవకాశం ఏర్పడుతుంది.

ఈ కార్యక్రమం కింద, ఈ.ఈ.ఎస్.ఎల్. / సి.ఈ.ఎస్.ఎల్.  అంతర్జాతీయ పోటీ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా వివిధ రకాల విద్యుత్ కార్లు సేకరించింది.   ఈ.ఈ.ఎస్.ఎల్. / సి.ఈ.ఎస్.ఎల్. ఇప్పటి వరకు, 49 నగరాల్లో 160 కి పైగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ విభాగాలలో 1,590 విద్యుత్ వాహనాలను మోహరించింది / త్వరలో మోహరించనుంది.  ఇంతకు ముందు లీజుకు తీసుకున్న పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల స్థానంలో  ఇప్పుడు ఈ విద్యుత్ కార్ల ను లీజు / పూర్తి కొనుగోలు ఆధారంగా అందజేస్తున్నారు. 

విద్యుత్ వాహనాల ఛార్జింగ్ కోసం మౌలిక సదుపాయాలను కూడా ఈ.ఈ.ఎస్.ఎల్. / సి.ఈ.ఎస్.ఎల్. అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా, వారి వారి పరిధిలోని స్థలాల సేకరణకు అంచనా అధ్యయనం చేసి, వారి అధికార ప్రదేశంలో ఛార్జింగ్ మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం, మునిసిపాలిటీలు, డిస్కమ్ లకు చెందిన అనేక మంది భాగస్వాములతో,  ఈ.ఈ.ఎస్.ఎల్. / సి.ఈ.ఎస్.ఎల్. అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేయడం జరిగింది.  ఈ.ఈ.ఎస్.ఎల్. / సి.ఈ.ఎస్.ఎల్.  ఈ రోజు వరకు, దేశవ్యాప్తంగా,  విద్యుత్ వాహనాల కోసం, 301 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. 

విద్యుత్ వాహనాలను స్వీకరించడాన్ని ప్రోత్సహించడం కోసం ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, మేఘాలయ, గుజరాత్, పశ్చిమ బెంగాల్ వంటి 13 రాష్ట్రాలు ప్రత్యేకంగా విద్యుత్ వాహనాల (ఈ.వి) విధానాలను ఆమోదించారు / ప్రకటించారు. 

నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ (ఎన్.ఈ.ఎం.ఎం.పి) 2020 అనేది ఒక జాతీయ మిషన్ డాక్యుమెంట్. ఇది దేశంలో విద్యుత్ వాహనాలు మరియు వాటి తయారీని వేగంగా స్వీకరించడానికి అవసరమైన విధానాన్నీ, కార్యాచరణ ప్రణాళికను అందిస్తుంది.  జాతీయ ఇంధన భద్రతను మెరుగుపరచి, సరసమైన, పర్యావరణ అనుకూలమైన రవాణాను అందించడంతో పాటు, భారత ఆటోమోటివ్ పరిశ్రమ ప్రపంచ తయారీ నాయకత్వాన్ని సాధించడం కోసం, ఈ ప్రణాళిక, రూపొందించబడింది.

ఫేమ్ ఇండియా పధకం మొదటి దశ సమయంలో పొందిన ఫలితం, అనుభవం ఆధారంగా మరియు పరిశ్రమలు, పరిశ్రమల సంఘాలతో సహా భాగస్వాములందరితో సంప్రదింపులు జరిపిన తరువాత, ఫేమ్ ఇండియా పథకం రెండవ దశను మొత్తం 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ మద్దతుతో,  ప్రభుత్వం,  2019 ఏప్రిల్, 1వ తేదీ నుండి ప్రారంభించి మూడేళ్ల పాటు అమలు చేయనుంది. 

ఫేమ్ ఇండియా పథకం రెండవ దేశ కింద ఛార్జింగ్ స్టేషన్ల అభివృద్ధి కోసం, 1000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది.  దీనితో పాటు, ఫేమ్ ఇండియా (భారతదేశంలో హైబ్రిడ్ & ఎలక్ట్రిక్ వాహనాల వేగవంతమైన స్వీకరణ మరియు తయారీ) పథకం-II కింద 25 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలోని 68 నగరాల్లో సుమారు 500 కోట్ల రూపాయల విలువైన 2,877 విద్యుత్ వాహనాల (ఈ.వి. ల) ఛార్జింగ్ స్టేషన్ల ను మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది. 

ఎఫ్.ఏ.ఎం.ఈ. ఇండియా పథకం కింద విద్యుత్ వాహనాల కోసం దేశంలో పనిచేస్తున్న ఛార్జింగ్ స్టేషన్ల వివరాలు అనుబంధం -1 లో పొందుపరచడం జరిగింది.

రాష్ట్రాల వారీగా, ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈ.ఈ.ఎస్.ఎల్), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ (పి.జి.సి.ఐ.ఎల్) మరియు ఎన్.టి.పి.సి. లిమిటెడ్ ద్వారా ఏర్పాటు చేసిన పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల వివరాలు అనుబంధంలో -II లో పొందుపరచడం జరిగింది.

అనుబంధం-I

ఏర్పాటు చేసిన మొత్తం ఛార్జింగ్ స్టేషన్ల వివరాలు (06-07-2021 తేదీ వరకు)

 

రాష్ట్రం  

ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య

జాతీయ రహదారులు 

ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య

చండీగఢ్ 

48

ఢిల్లీ - చండీగఢ్

24

ఢిల్లీ 

94

ముంబాయి - పూణే

15

రాజస్థాన్ 

49

ఢిల్లీ-జైపూర్-ఆగ్రా 

29

కర్ణాటక 

45

జైపూర్-ఢిల్లీ రహదారి  

9

ఝార్ఖండ్ 

29

 

 

గోవా 

19

 

 

తెలంగాణ 

50

 

 

ఉత్తర ప్రదేశ్ 

11

 

 

హిమాచల్ ప్రదేశ్ 

7

 

 

మొత్తం 

352

 

77

 

అనుబంధం-II

విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధీనంలోని కేంద్ర ప్రభుత్వ రంగంలోని సి.పి.ఎస్.యు. లు ఏర్పాటు చేసిన పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల వివరాలు

 ఈ.ఈ.ఎస్.ఎల్. 

ఎన్.టి.పి.సి. 

పి.జి.సి.ఐ.ఎల్. 

రాష్ట్రం 

ఏర్పాటు చేసిన పి.సి.ఎస్.ల సంఖ్య 

రాష్ట్రం 

ఏర్పాటు చేసిన పి.సి.ఎస్.ల సంఖ్య

రాష్ట్రం 

ఏర్పాటు చేసిన పి.సి.ఎస్.ల సంఖ్య

ఛత్తీస్ గఢ్ 

2

హర్యానా 

4

గుజరాత్ 

2

ఢిల్లీ 

73

ఉత్తర ప్రదేశ్ 

16

కర్ణాటక 

2

గోవా 

1

ఢిల్లీ 

42

ఢిల్లీ 

4

గుజరాత్ 

0

మధ్యప్రదేశ్ 

12

హర్యానా 

1

హర్యానా 

2

ఆంధ్రప్రదేశ్ 

2

తెలంగాణ 

6

కర్ణాటక 

1

తెలంగాణ 

2

కేరళ 

2

కేరళ 

7

తమిళనాడు 

8

-

-
 

మహారాష్ట్ర 

 

2

కేరళ 

2

-

-

తమిళనాడు 

20

గుజరాత్ 

4

-

-

ఉత్తర ప్రదేశ్ 

21

కర్ణాటక 

8

-

-

పశ్చిమ బెంగాల్ 

18

-

-

-

-

మొత్తం 

147

 

100

 

17

 

కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ క్రిషన్ పాల్ గుర్జర్, ఈ రోజు రాజ్యసభకు లిఖిత పూర్వకంగా సమర్పించిన సమాధానంలో ఈ సమాచారాన్ని పొందుపరిచారు. 

 

*****


(Release ID: 1744284) Visitor Counter : 244