వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
జాతీయ వర్తకుల దినోత్సవం సందర్భంగా వర్తకులను ఉద్దేశించి ప్రసంగించిన శ్రీ పీయూష్ గోయల్
దేశాభివృద్ధిలో ప్రతి వర్తకుడి పాత్ర ఉంది... శ్రీ పీయూష్ గోయల్
Posted On:
09 AUG 2021 7:12PM by PIB Hyderabad
దేశ ఆర్థికాభివృద్ధిలో వర్తకులు వర్తకులు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, జౌళి శాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. దేశ ఆర్థిక రంగానికి, ఆర్థిక వనరులకు వర్తకులు వెన్నుముకగా నిలిచారని అన్నారు. జాతీయ వర్తకుల దినోత్సవం సందర్భంగా ఈరోజు వర్తకులను ఉద్దేశించి వర్చువల్ విధానంలో శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు వర్తకులు ' వోకల్ ఫర్ లోకల్ గా వ్యవహరిస్తూ బ్రాండ్ ఇండియా అంబాసిడర్లుగా వర్తకులు మారాలని మంత్రి కోరారు.
వస్తు సేవల రంగంలో భారతదేశం ప్రపంచ వేదికగా నిలుస్తున్నదని పేర్కొన్న మంత్రి వాణిజ్య వర్తక రంగాల్లో స్వయం సమృద్ధి సాధించాలని కోరారు. వ్యాపారం అనేది వస్తు మార్పిడి మాత్రమే కాదని దీనిలో సంస్కృతి,విశ్వాసం,సద్భావనకు వేదిక అని ఆయన అన్నారు. నాణ్యత, ఉత్పాదకతకు ప్రాధాన్యత ఇస్తూ రంగంలో రాణించాలని మంత్రి కోరారు. లక్ష్యాలను సాధించడానికి నాణ్యమైన వస్తువులను విక్రయించాలని అన్నారు.
వర్కులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చిన మంత్రి చట్ట ఉల్లంఘనలను ప్రభుత్వ దృష్టికి తీసుకుని రావాలని వర్తకులకు విజ్ఞప్తి చేశారు. వర్తకులు, చిన్న పారిశ్రామికుల ప్రయోజనాలు, హక్కులను రక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ గోయల్ అన్నారు. వ్యాపారులను వేధింపుల నుంచి రక్షించడానికి లీగల్ మెట్రాలజీని సరళీకృతం చేసి సింగిల్ విండో ఆన్‌లైన్ వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు. స్వయం ఉపాధి అవకాశంగా వ్యాపార రంగాన్ని పరిగణిస్తూ గౌరవం తృప్తితో కార్యకలాపాలను సాగించాలని వ్యాపారులను శ్రీ పీయూష్ గోయల్ కోరారు.
కోవిడ్ మహమ్మారి సమయంలో వ్యాపారుల పాత్రను శ్రీ గోయల్ ప్రశంసించారు. కోవిడ్ -19 మహమ్మారి 15-16 నెలల్లో దేశంలోని అన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులను అంతరాయం లేకుండా సరఫరా చేసి ప్రజల అవసరాలను తీర్చారని అన్నారు. వ్యాపారులు కోవిడ్ 19 నిబంధనలను పాటిస్తూ తమ కార్యకలాపాలను నిర్వహించాలని అన్న మంత్రి ప్రతి వ్యాపారి రెండు డోసుల టీకాలను తీసుకోవాలని కోరారు.
***
(Release ID: 1744244)
Visitor Counter : 145