ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

విదేశీ పౌరులు ఇప్పుడు భారతదేశంలో టీకాలు వేసుకోవడానికి అర్హులు


భారతదేశంలో నివసిస్తున్న విదేశీ పౌరులు కోవిన్ పోర్టల్‌లో నమోదు కోసం పాస్‌పోర్టును ఉపయోగించవచ్చు

Posted On: 09 AUG 2021 6:36PM by PIB Hyderabad

కొవిడ్‌-19 నుండి భద్రతను సాధించడంలో ఒక మైలురాయి లాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. భారతదేశంలో నివసిస్తున్న విదేశీ పౌరులు కోవిన్ -19 టీకా తీసుకోవడానికి కోవిన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడానికి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. వారు కోవిన్ పోర్టల్‌లో నమోదు కోసం వారి పాస్‌పోర్ట్‌ను గుర్తింపు పత్రంగా ఉపయోగించవచ్చు. వారు ఈ పోర్టల్‌లో నమోదు చేసుకున్న తర్వాత, వారికి టీకా కోసం స్లాట్ లభిస్తుంది.

గణనీయమైన సంఖ్యలో విదేశీ పౌరులు భారతదేశంలో ముఖ్యంగా పెద్ద మహానగరాలలో నివసిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో అధిక జనాభా సాంద్రత కారణంగా కోవిడ్ -19 వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంది. అటువంటి విపత్తును ఎదుర్కోవటానికి అర్హులైన వ్యక్తులందరికీ టీకాలు వేయడం ముఖ్యం.

ఈ చొరవ భారతదేశంలో నివసిస్తున్న విదేశీ పౌరుల భద్రతకు భరోసా ఇస్తుంది. ఇది భారతదేశంలో నివసిస్తున్న టీకాలు వేయని వ్యక్తుల నుండి వైరస్‌ సక్రమించే అవకాశాలను కూడా తగ్గిస్తుంది. ఇది కొవిడ్-19 వైరస్ విస్తరణ నుండి మరింత భద్రతను కూడా నిర్ధారిస్తుంది.

జాతీయ కోవిడ్ -19 టీకా కార్యక్రమం 16 జనవరి 2021 నుండి అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో అమలు చేయబడుతోంది. ప్రస్తుత దశలో టీకా కార్యక్రమం 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పౌరులందరికీ వర్తిస్తుంది. 9 ఆగష్టు, 2021 నాటికి దేశవ్యాప్తంగా 51 కోట్లకు పైగా వ్యాక్సిన్ మోతాదులను భారత ప్రభుత్వం అందించింది.


 

****



(Release ID: 1744238) Visitor Counter : 215


Read this release in: English , Marathi , Hindi , Punjabi