ప్రధాన మంత్రి కార్యాలయం
మధ్యప్రదేశ్ లో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన లబ్ధిదారుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగం
Posted On:
07 AUG 2021 1:38PM by PIB Hyderabad
నమస్కారమండి,
మధ్య ప్రదేశ్ గవర్నర్, నాకు ఇదివరకే పరిచయం ఉన్నట శ్రీ మంగుభాయి పటేల్, తన జీవనాన్ని అంతటినీ ఆదివాసీ ల సంక్షేమం కోసం, ఆదివాసీ సమాజం అభ్యున్నతి కోసం వెచ్చించారు. ఆయనే మధ్య ప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగుభాయి. ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింహ్, రాష్ట్ర ప్రభుత్వం లోని ఇతర మంత్రులు అందరు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్ఎల్ఎ లు, మధ్య ప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమం లో పాల్గొంటున్న సోదరీమణులు, సోదరులారా.
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన లో భాగం గా నిర్వహిస్తున్నటువంటి ఈ ఆహార పంపిణీ కార్యక్రమానికి హాజరు అయిన మీకు అందరికీ అభినందనలు. ఈ పథకం లో భాగం గా, మధ్య ప్రదేశ్ లో సుమారు 5 కోట్ల మంది లబ్దిదారులకు ఉచితంగా ఆహారాన్ని అందించడానికి ఒక గొప్ప ప్రచార ఉద్యమాన్ని చేపట్టడం జరుగుతున్నది. ఈ పథకం కొత్తది ఏమీ కాదు. ఏడాదిన్నర క్రితం కరోనా చెలరేగింది, మరి అప్పటి నుంచి దేశం లో 80 కోట్ల మందికి పైగా ఈ దేశ పేద ప్రజల కు ఉచిత ఆహార ధాన్యాలను ఉచితం గా ఇవ్వడం జరుగుతోంది. అయితే పేదల మధ్యకు వెళ్లి వారితో మాట్లాడే అవకాశం నాకు ఎప్పుడూ రాలేదు. ఈ రోజు న మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఈ అవకాశాన్ని నాకు ఇచ్చింది. ఈ రోజున, నేను నా పేద సోదరీమణులను, సోదరులను సుదూర ప్రాంతాల నుంచి చూస్తున్నాను, వారి ఆశీర్వాదాలను పొందుతున్నాను, అది పేదల కోసం ఏదైనా చేయడానికి నాకు శక్తిని ఇస్తుంది. మీ ఆశీర్వాదాలు నాకు శక్తి ని ఇస్తాయి. ఈ కార్యక్రమం ఏడాదిన్నరగా జరిగి ఉండవచ్చు, కానీ ఈ రోజు మిమ్మల్ని సందర్శించే అవకాశం నాకు లభించింది. ఈ సంక్షోభ సమయం లో ప్రభుత్వం నుంచి లభించిన ఉచిత ఆహార ధాన్యాలు ప్రతి కుటుంబానికి పెద్ద ఉపశమనం కలిగించాయని ఇటీవల మధ్య ప్రదేశ్ లోని కొంతమంది సోదరీమణులతో, సోదరుల తో నేను మాట్లాడుతూ ఉండగా నాకు తెలిసింది. వారు చెబుతున్నటువంటి మాటల లో సంతృప్తి ఉండింది. ఏమైనా, మధ్య ప్రదేశ్ లోని అనేక జిల్లాల లో ప్రస్తుతం వరద తరహా స్థితి తలెత్తడంతో నా మిత్రుల లో ఎంతో మంది జీవితాలు, బతుకుతెరువు లు ప్రభావితం కావడం బాధాకరం. ఈ క్లిష్ట సమయంలో భారత ప్రభుత్వం, యావత్తు దేశం, మొత్తం దేశం మధ్య ప్రదేశ్ వెన్నంటి నిలుస్తాయి. సహాయక చర్యలను, రక్షణ చర్యల ను వేగవంతం చేయడం కోసం శివరాజ్ గారు, ఆయన మొత్తం బృందం స్వయంగా ప్రభావిత ప్రాంతాల న సందర్శిస్తున్నారు. అది ఎన్ డిఆర్ ఎఫ్ కావచ్చు, కేంద్ర దళాలు కావచ్చు, లేదా మన వైమానిక దళ సిబ్బంది కావచ్చు.. అంతా కూడాను ఈ స్థితి ని చక్కదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వానికి చేతనైన అన్ని రకాల సహాయాన్ని అందజేయడం జరుగుతోంది.
సోదరీమణులు మరియు సోదరులారా,
ఏ విపత్తు ప్రభావం అయినా చాలా విస్తృతం గా ఉంటుంది. వంద సంవత్సరాల కాలం లో అతి పెద్ద విపత్తు కరోనా రూపం లో యావత్తు మానవ జాతి కి ఎదురైంది. గత సంవత్సరం మొదట్లో ప్రపంచం లోని ఏ దేశం కూడా అంతటి ఒక భయానకమైన అనుభవాన్ని ఎదుర్కోలేదు. కరోనా సంక్రమణ గత ఏడాది ఆరంభం లో వ్యాపించడం మొదలైనప్పుడు, మొత్తం ప్రపంచం దృష్టి వెనువెంటనే ఆరోగ్య సౌకర్యాల వైపు మళ్లింది. ప్రతి ఒక్క దేశం తన వైద్య రంగ సౌకర్యాల ను పటిష్టపరచుకోవడ లో నిమగ్నేం అయింది. అయితే అంత పెద్ద జనాభా నుకలిగి ఉన్న మన దేశం లో, ఈ సవాలు ను ప్రపంచం లోని మిగిలిన ప్రాంతాల కంటే చాలా పెద్దది గా పరిగణించవచ్చును. మనం కరోనా ను నివారించడానికి, కరోనా తాలూకు చికిత్స ను చేయడానికి తగిన వైద్య సంబంధి మౌలిక సదుపాయాలను సిద్ధం చేయవలసి వచ్చింది. కరోనా ను నివారించడానికి ప్రపంచవ్యాప్తం గా ఆర్థిక కార్యకలాపాలు స్తంభించాయి. ప్రయాణాల పైన కూడా ఆంక్షలు విధించడం జరిగింది. ఈ చర్య తో భారతదేశానికి మరిన్ని సంక్షోభాలు ఎదురవక తప్పని స్థితి ఉండింది. కానీ ఈ సవాలు ను ఎదుర్కోవడానికి మనమంతా కలసి పనిచేశాం. పస్తులుండనక్కరలేకుండా చూడటానికి మనం కోట్లాది ప్రజల కు ఉచితంగా ఆహారాన్ని అందించవలసి వచ్చింది. మన సహచరుల లో చాలా మంది పని కోసం గ్రామం నుంచి నగరాల కు వెళ్తారు. వారు తినడానికి, బస చేయడానికి వారు తిరిగి వారి పల్లెల కు వెళ్లినప్పుడు సరి అయిన ఉపాధి లభించేటట్టు చూడడానికి కూడా మనం ఏర్పాట్లను చేయవలసి వచ్చింది. దేశం లో ప్రతి మూల ఈ సవాళ్లు ఉన్నాయి. దీనితో ప్రపంచంలోని ఇతర ప్రాంతాల కంటే భారతదేశం సవాళ్లు, భారతదేశం పోరాటం మరింత కఠినం గా మారాయి.
కానీ సహచరులారా ,
ఎంత పెద్ద సవాలు ఉన్నప్పటికీ, దేశమంతా కలిసికట్టుగా దానిని ఎదుర్కొంది అంటే అప్పుడు మార్గాలు కూడా దొరుకుతాయి. సమస్య సైతం తీరుతుంది. కరోనా వల్ల ఉత్పన్నం అయ్యే సంక్షోభం తో తలపడడం కోసం భారతదేశం తన వ్యూహం లో పేదల కు అగ్ర ప్రాధాన్యాన్ని ఇచ్చింది. అది ‘ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’ అయినా, ‘ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ యోజన’ అయినా, పేదల కు ఆహారం అందించడం, ఉపాధి కల్పించడం పై ఒకటో రోజు నుంచే శ్రద్ధ తీసుకోవడం జరిగింది. ఈ కాలం అంతటా, దేశం లో 80 కోట్ల కు పైగా ప్రజల కు ఉచిత ఆహార పదార్థాల ను అందించడమైంది. లాక్ డౌన్ కాలం లో 8 కోట్లకు పైగా పేద కుటుంబాలకు గోధుమలకు తోడు, బియ్యం, పప్పుధాన్యాలను, గ్యాస్ సిలిండర్ లను కూడా ఉచితం గా ఇవ్వడమైంది. అంటే 80 కోట్ల మంది కి ఆహార ధాన్యాలు, 8 కోట్ల మంది కి గ్యాస్ సిలిండర్ లు అన్నమాట. అంతకు మించి, సుమారు 20 కోట్ల మందికి పైగా సోదరీమణుల జన్ ధన్ బ్యాంక్ ఖాతాల లోకి 30,000 కోట్ల రూపాయల ను నేరు గా బదలాయించడమైంది. వేల కోట్ల కొద్దీ రూపాయలు కార్మికుల, రైతుల బ్యాంకు ఖాతా లలో జమ అయ్యాయి. రెండు రోజుల తరువాత, ఆగస్టు 9న, దాదాపు గా 10 కోట్ల నుంచి 11 కోట్ల రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల లోకి నేరు గా వేల కోట్ల కొద్దీ రూపాయలు బదిలీ కానున్నాయి.
మిత్రులారా,
ఈ ఏర్పాట్లన్నింటితో పాటు, మేడ్ ఇన్ ఇండియా టీకాల కు కూడా భారతదేశం చాలా ప్రాధాన్యాన్ని ఇచ్చింది. ఈ కారణం గానే భారతదేశం ప్రస్తుతం తన సొంత వ్యాక్సీన్ లను తయారు చేసుకోగలిగింది. ఈ టీకామందు లు ప్రభావశీలమైనవే కాదు సురక్షితమైనవి కూడాను. నిన్ననే, భారతదేశం 50 కోట్ల వ్యాక్సీన్ మోతాదు లను ఇప్పించిన ముఖ్యమైన మైలురాయి ని అధిగమించింది. భారతదేశం లో ఒక వారం రోజుల వ్యవధి లో ఇప్పిస్తున్న టీకా లు ప్రపంచం లో అనేక దేశాల మొత్తం జనాభా కంటే కూడా ఎక్కువే. ఇది న్యూ ఇండియా తాలూకు సరికొత్త బలంగా ఉంది. ఇంతకు ముందు, మనం ప్రపంచం లోని మిగతా దేశాల కంటే వెనుకబడి ఉండే వాళ్లం. ప్రస్తుతం మనం ప్రపంచం కంటే ఎన్నో అడుగులు ముందున్నాం. రాబోయే కాలం లో ఈ వ్యాక్సినేశన్ వేగాన్ని మనం మరింత వేగవంతం చేయాలి.
మిత్రులారా,
కరోనా వల్ల ఎదురైన అనేక పరిస్థితుల కు భారతదేశం ఏక కాలం లో ఎదురొడ్డి నిలుస్తున్నది అంటే అది భారతదేశం బలాన్ని చాటిచెప్తోంది. నేడు, ఒక దేశం, ఇతర రాష్ట్రాల్లో పనిచేసే కార్మికుల సౌకర్యానికి ఒక రేషన్ కార్డు సదుపాయం కల్పించబడుతోంది. పెద్ద నగర కార్మికులు గుడిసెల లో నివసించకుండా నిరోధించడానికి సహేతుకమైన అద్దె పథకం అమలు చేయబడింది. మన లారీల ను లేదా బండ్లను నడిపే సోదరులు, సోదరీమణులు, మన ఈ సహచరులు తిరిగి పని పాటులను మొదలుపెట్టుకోవడానికి వీలుగా పిఎమ్ స్వనిధి యోజన లో భాగం గా బ్యాంకు నుంచి చౌకయినటువంటి, సులభమైనటువంటి రుణాలను అందించడం జరుగుతున్నది. మన నిర్మాణ రంగం, మన మౌలిక సదుపాయాల కల్పన రంగం, ఉపాధి కి ఒక అతి పెద్ద మాధ్యమం గా ఉంది. అందుకే యావత్తు దేశం లో మౌలిక సదుపాయాల కల్పన పథకాల పైన నిరంతరాయం గా పనులు త్వరిత గతి న జరుగుతున్నాయి.
మిత్రులారా,
ఉపాధి విషయం లో ప్రపంచం అంతటా వచ్చిపడ్డ ఈ సంకట కాలం లో, భారతదేశం లో తక్కువ లో తక్కువ నష్టం వాటిల్లే విధం గా నిరంతరం పూచీపడడం జరుగుతోంది. దీని కోసం గత సంవత్సరం లో అనేక చర్యల ను తీసుకోవడమైంది, అంతే కాదు ఆ చర్యలు నిరంతరం తీసుకోవడం జరుగుతున్నది. చిన్న, లఘు, సూక్ష్మ వ్యాపార సంస్థల కు వాటి కార్యకలాపాల ను కొనసాగించేందుకు లక్షల కోట్ల రూపాయల సాయాన్ని అందుబాటు లోకి తీసుకురావడమైంది. వ్యవసాయ క్షేత్రం, సంబంధిత పనులు చక్కగా జరిగేటట్టు ప్రభుత్వం దృష్టి ని సారించింది. రైతుల కు సహాయం చేయడానికి మేం కొత్త పరిష్కారాల ను తీసుకు వచ్చాం. ఈ విషయం లో మధ్య ప్రదేశ్ ప్రశంసనీయమైన పని ని చేసింది. మధ్య ప్రదేశ్ రైతులు కూడా రికార్డు స్థాయి లో ఉత్పాదనలు చేశారు. ప్రభుత్వం కూడా రికార్డు స్థాయి లో కనీస మద్దతు ధర (ఎమ్ఎస్ పి) కి కొనుగోళ్లు జరిగేలా జాగ్రత వహించింది. ఈ ఏడాది గోధుమ సేకరణ కోసం మధ్య ప్రదేశ్ లో అత్యధిక సంఖ్య లో సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు నాతో చెప్పారు. మధ్య ప్రదేశ్ తన 17 లక్షల కు పైగా రైతుల వద్ద నుంచి గోధుమల ను కొనుగోలు చేసింది. మరి వారి వద్ద కు 25 వేల కోట్ల రూపాయల కు పైచిలుకు మొత్తాన్ని నేరు గా అందజేసింది.
సోదరీమణులు మరియు సోదరులారా,
డబుల్ ఇంజిన్ ప్రభుత్వం యొక్క అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం మెరుగ్గా నిర్వహిస్తుంది. దాని బలాన్ని పెంచుతుంది. మధ్యప్రదేశ్ యువతలో నైపుణ్యాలను పెంపొందించడానికి, అది ఆరోగ్య మౌలిక సదుపాయాలు లేదా డిజిటల్ మౌలిక సదుపాయాలు, రైల్వే మరియు రహదారి కనెక్టివిటీని ఏర్పాటు చేస్తున్నప్పటికీ, అన్ని పథకాలు వేగంగా జరుగుతున్నాయి. శివరాజ్ జీ నాయకత్వంలో మధ్య ప్రదేశ్ బిమారు రాష్ట్రం గా తన గుర్తింపు ను అధిగమించింది. మధ్య ప్రదేశ్ లోని రోడ్ల పరిస్థితి, ఇక్కడి నుంచి వస్తున్న పెద్ద గందరగోళం గురించి వార్తలు రావడం నాకు జ్ఞాపకం ఉంది. ఇవాళ, మధ్య ప్రదేశ్ లోని నగరాలు పరిశుభ్రత కు, అభివృద్ధి కి సంబంధించిన కొత్త పరామితుల ను రూపొందిస్తున్నాయి.
సోదరీమణులు మరియు సోదరులారా,
ఈ రోజు ప్రభుత్వ పథకాలు క్షేత్ర స్థాయి కి వేగం గా చేరుకొంటూ, అమలు అవుతున్నాయి అంటే దీని వెనుక ప్రభుత్వం పనితీరు లో వచ్చిన మార్పు కారణం అవుతోంది. గత ప్రభుత్వ వ్యవస్థ లో ఒక వక్రీకరణ జరిగింది. పేదల ను గురించి వారు స్వయం గా ప్రశ్న లు అడిగే వారు, సమాధానాల ను కూడా వారే ఇచ్చే వారు. ఎవరి వరకు అయితే లాభాలను అందించవలసి ఉందో, ఆ సంగతి ని ముందు ఆలోచన చేయడమే జరిగేది కాదు. పేదల కు మొదట రహదారులు అవసరం అని కొందరు భావించే వారు. పేదల కు రహదారుల తో ఏమిటి అవసరం?, వారికి అయితే ముందుగా రొట్టె లు కావాలి. కొంతమంది ఇలా కూడా అనే వారు.. పేదల కు గ్యాస్ తో అవసరం ఏముంటుంది ? అని. ఆహారం అయితే పొయ్యి తో సైతం వండేసుకొంటారు కదా అని అనే వారు. ఎవరి దగ్గర దాయడానికి డబ్బు లేదో, వారు బ్యాంకు ఖాతా ను ఏం చేసుకొంటారు ? అని కూడా ఒక ఆలోచన ఉండింది. బ్యాంకు ఖాతా ల వెనుక మీరు ఎందుకు పడ్డారు?, పేదల కు రుణాలు ఇస్తే ఆ రుణాల ను వారు ఎలాగ తిరిగి చెల్లిస్తారు? అనే ప్రశ్న ను కూడా అడిగారు. దశాబ్దాల పాటు ఇటువంటి ప్రశ్నలే పేదవారి ని సౌకర్యాల కు దూరం గా ఉంచేశాయి. ఒక విధం గా ఇది ఏమీ చేయకపోవడానికి ఒక సాకు గా మిగిలింది. పేదల కు గ్యాస్ లభించలేదు, పేదల కు విద్యుత్తు రాలేదు, లేదంటే పేదలకు నివసించడానికి ఇళ్లు అందలేదు. బ్యాంకు ఖాతాలు పేదల కోసం తెరవడం జరగలేదు, లేదా పేదల చెంతకు నీరు చేరలేదు. ఫలితం గా పేద ప్రజలు దశాబ్దాలు గా ప్రాథమిక సౌకర్యాల కు నోచుకోలేకపోయారు. వారు చిన్న చిన్న అవసరాల కోసం రోజుల తరబడి కష్టాలు పడ్డారు. వారు రోజు కు 100 సార్లు 'పేద' అనే పదాన్ని వల్లె వేస్తారు, మరి పేదల ను గురించిన పాటలు పాడుతారు. అయితే ఆచరణ లో ఇటువంటి వాటిని కపటులు అని అంటూ ఉంటారు. వీరు సౌకర్యాల ను ఇచ్చే వారే కాదు, కానీ పేదల పట్ల బూటకపు సానుభూతి ని తప్పక చూపించేవారు. అయితే భూమి నుంచి మీ మధ్య కు వచ్చిన మేం, మీలో నుంచి వచ్చిన మేం, మీ సుఖ దు:ఖాల ను దగ్గర గా అనుభవించిన మేం మీ మధ్య లో నుంచి వచ్చాం మరి అందుకే మేం మీ వంటి వ్యక్తుల తో కలసి పని చేసే విధానాన్ని వేరే విధం గా ఉంచాం. మేం ఇలాంటి వ్యవస్థ తో పెరిగాం. అందుకే గత సంవత్సరాల లో ఈ పదం తాలూకు నిజమైన అర్థం లో పేదల కు సాధికారిత ను కల్పించడానికి ప్రయత్నాలు జరిగాయి. ప్రస్తుతం దేశం లో గ్రామాల లో రహదారుల నిర్మాణం జరుగుతోంది, కొత్త ఉద్యోగాలు కల్పించబడుతున్నాయి, రైతుల కు బజారు అందుబాటు లో ఉంటోంది. అనారోగ్యం బారిన పడ్డప్పుడు, పేదలు సకాలం లో ఆసుపత్రి కి చేరుకోవచ్చు. దేశం లో పేదల కు జన్ ధన్ ఖాతా లు తెరవడమైంది మరి ఈ ఖాతాల ను తెరవడం వల్ల పేదలు బ్యాంకింగ్ వ్యవస్థ లో చేరడానికి సహాయం లభించింది. ఇవాళ వారు ప్రత్యక్ష ప్రయోజనాన్ని పొందుతున్నారు, మధ్యవర్తుల బారి నుంచి విముక్తి ని పొందడం ద్వారా సులభమైన క్రెడిట్ ను అందుకోగలుగుతున్నారు. పక్కా ఇల్లు, విద్యుత్తు, నీరు, గ్యాస్, మరుగుదొడ్డి సౌకర్యం తో పేదల కు గౌరవం ప్రాప్తమైంది. వారికి విశ్వాసం లభించింది. వారు అవమానం నుంచి, పీడన నుంచి విముక్తి ని పొందారు. ఈ విధం గా ముద్ర రుణం తో ఇవాళ కోట్ల కొద్దీ స్వతంత్రోపాధి పొందడమొక్కటే కాకుండా వారు ఇతరులకు కూడా ఉపాధి ని కల్పిస్తున్నారు.
మిత్రులారా,
పేదల కు డిజిటల్ ఇండియా అన్నా , చౌక డేటా అన్నా,
ఇంటర్ నెట్ అన్నా పెద్ద గా పట్టదు అని మాట్లాడిన వారు, వారు ఇవాళ డిజిటల్ ఇండియా తాలూకు బలాన్ని గురించి తెలుసుకొంటూ ఉన్నారు.
సోదరీమణులు మరియు సోదరులారా,
గ్రామాల కు, పేదల కు, గిరిజన వర్గాల కు సాధికారిత ను కల్పించడానికి దేశం లో మరో భారీ ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించడమైంది. ఈ ప్రచార ఉద్యమం మన హస్తకళల ను, చేనేతల ను, వస్త్రం తాలూకు మన పనితనాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ ప్రచార ఉద్యమం స్థానిక ఉత్పత్తుల కు మన సమర్ధన ఆవశ్యకత ను గురించి చాటి చెప్తుంది. ఈ స్ఫూర్తి తో దేశం నేడు జాతీయ చేనేత దినాన్ని జరుపుకొంటున్నది. మనం 75 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని పాటించుకొంటున్న సందర్భం లో, స్వాతంత్ర్యం తాలూకు అమృత్ మహోత్సవం, ఈ రోజైన ఆగస్టు 7 తాలూకు ప్రాముఖ్యం మరింత ప్రాధాన్యాన్ని కలిగివుంటాయి. 1905 ఆగస్టు 7న స్వదేశీ ఉద్యమం మొదలైంది అనే సంగతి ని మనం అందరం గుర్తు పెట్టుకొందాం. ఈ చరిత్రాత్మక దినం నుంచి ప్రేరణ ను పొంది, ఆగస్టు 7 ను చేనేత కు అంకితం ఇవ్వడమైంది. ఇది అద్భుతమైనటువంటి మన చేతివృత్తుల వారికి, గ్రామాల లోని కళాకారుల కు, ఆదివాసీ ప్రాంతాల కు గౌరవాన్ని కట్టబెట్టడానికి, వారి ఉత్పత్తుల కు ఒక ప్రపంచ వేదిక ను ఇచ్చేటటువంటి ఒక రోజు గా ఉన్నది.
సోదరీమణులు మరియు సోదరులారా,
మన స్వాతంత్ర్య పోరాటం లో మన చరఖా, ఖాదీ ల గొప్ప తోడ్పాటు ను గురించి మనకు అందరికీ తెలుసు. కొన్నేళ్లు గా దేశం ఖాదీ కి ఎంతో గౌరవాన్ని ఇచ్చింది. ఒకప్పుడు మరచిపోయిన ఖాదీ ఇప్పుడు కొత్త బ్రాండ్ గా మారింది. ఇప్పుడు మనం 100 సంవత్సరాల స్వాతంత్ర్యం దిశ గా కొత్త ప్రయాణం లో ఉన్నందున, స్వాతంత్ర్య ఉద్యమ కాలం లో ప్రబలం గా ఉన్న ఖాదీ స్ఫూర్తి ని మనం బలోపేతం చేయాలి. ఆత్మనిర్భర్ భారత్ కోసం, స్వదేశీ ఉత్పత్తుల కోసం మద్దతు ను అందించాలి. ఖాదీ మొదలుకొని పట్టు వరకు హస్తకళ ల ఘనమైనటువంటి సంప్రదాయం మధ్య ప్రదేశ్ కు ఉంది. రాబోయే పండుగల లో కొన్ని స్థానిక హస్తకళ ల ఉత్పత్తులను తప్పకుండా కొనుగోలు చేసి, మన హస్తకళల ను ప్రోత్సహించవలసింది గా మీ అందరితో పాటు దేశ ప్రజల కు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
మరి మిత్రులారా,
ఉత్సవాల ఉత్సాహం మధ్య కరోనా ను మరచిపోవద్దని కూడా నేను మీతో చెబుతాను. కరోనా థర్డ్ వేవ్ ను అడ్డుకోవాల్సింది మనమే. దీనిని ఆపే తీరాలి. దీని కోసం మనం అందరం కలిసి పనిచేయవలసి ఉంది. మాస్క్, టీకా, ఒక మనిషి కి మరొక మనిషి కి మధ్యన రెండు గజాల దూరాన్ని పాటించడం.. ఇవి చాలా ముఖ్యమైన అంశాలు. ఆరోగ్యకరమైనటువంటి, సంపన్నమైనటువంటి భారతదేశం కోసం మనం ప్రతిన ను పూనాలి. మరో సారి మీ అందరికీ ఇవే నా అనేకానేక శుభాకాంక్షలు. మరి ఈ రోజు న మధ్య ప్రదేశ్ లో 25,000 కు మించిన ఉచిత రేశన్ దుకాణాల వద్ద కోట్ల కొద్దీ పౌరులు గుమికూడుతున్నారు. వారికి కూడా నేను శిరస్సు ను వంచి నమస్కరిస్తున్నాను. యావత్తు మానవ జాతి ని సంక్షోభం పాల్జేసిన ఈ సంకటం బారి నుంచి మనం బయటపడతామని వారికి భరోసా ను ఇవ్వదలుస్తున్నాను. మనమంతా కలిసికట్టుగా ఈ వ్యాధి నుంచి బయటపడుతాం. అందరి ని కాపాడుదాం, మనం కలసి రక్షించుదాం, అన్ని అన్ని నియమాల ను పాటిస్తూ ఈ విజయాన్ని సునిశ్చితం చేద్దాం. మీకు అందరికీ నా తరఫు నుంచి చాలా చాలా శుభాకాంక్షలు. ధన్యవాదాలు.
అస్వీకరణ: ఇది ప్రధాన మంత్రి ప్రసంగానికి రమారమి అనువాదం. సిసలు ఉపన్యాసం హిందీ భాష లో సాగింది.
***
(Release ID: 1743848)
Visitor Counter : 252
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam