సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

డాక్టర్ వీరేంద్ర కుమార్ 'పిఎం-దక్ష్‌' పోర్టల్ మరియు 'పిఎం-దక్ష్‌' మొబైల్ యాప్‌ను ప్రారంభించారు

'PM-DAKSH' పోర్టల్ ద్వారా నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన మొత్తం సమాచారం షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు మరియు సఫాయ్ కరంచారిలకు ఒకే చోట లభిస్తుంది.

గత ఐదు సంవత్సరాలలో లక్ష్య సమూహాలకు చెందిన 2,73,152 మందికి నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇవ్వబడింది

2021-22 సంవత్సరంలో లక్ష్యం మేరకు సుమారు 50,000 మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు

Posted On: 07 AUG 2021 5:44PM by PIB Hyderabad

కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నైపుణ్యాభివృద్ధి పథకాలను అందుబాటులోకి తెచ్చేందుకు సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన 'PM-DAKSH' పోర్టల్ మరియు 'PM-DAKSH' మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. ఈ పోర్టల్ మరియు యాప్ ద్వారా లక్ష్య సమూహాల యువత ఇప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ల ప్రయోజనాలను మరింత సులభంగా పొందగలుగుతారు.

ప్రధాన మంత్రి దక్ష్తా ఔర్ కుశాల్తా సంపన్న హిత్‌గ్రాహి (PM-DAKSH) యోజన 2020-21 సంవత్సరం నుండి సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేయబడుతోంది. ఈ యోజన కింద అర్హత కలిగిన లక్ష్య సమూహానికి (i) అప్-స్కిలింగ్/రీ-స్కిలింగ్ (ii) షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ (iii) లాంగ్ టర్మ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మరియు (iv) ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఈడిపి) పై నైపుణ్య అభివృద్ధి శిక్షణా కార్యక్రమాలు అందించబడుతున్నాయి. ఈ శిక్షణా కార్యక్రమాలు ప్రభుత్వ శిక్షణా సంస్థలు, నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్ మరియు ఇతర విశ్వసనీయ సంస్థల ద్వారా అమలు చేయబడుతున్నాయి.

ఇప్పుడు ఏ వ్యక్తి అయినా 'PM-DAKSH' పోర్టల్‌ను సందర్శించడం ద్వారా ఒకే చోట నైపుణ్య అభివృద్ధి శిక్షణకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని పొందవచ్చు. అలాగే, ఒక్క క్లిక్‌తో, అతని/ఆమె దగ్గర జరుగుతున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణల గురించి సమాచారాన్ని పొందవచ్చు మరియు నైపుణ్య శిక్షణ కోసం అతను/ఆమె సులభంగా నమోదు చేసుకోవచ్చు. PM- DAKSH పోర్టల్ http://pmdaksh.dosje.gov.in లో అందుబాటులో ఉండగా, 'PM-DAKSH' మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది.

"ఈ రోజు ఈ పోర్టల్ మరియు మొబైల్ యాప్‌ను ప్రజల ఉపయోగం కోసం ప్రారంభించినందుకు నేను గర్వపడుతున్నాను. ఈ పోర్టల్ అమలుకు సంబంధించిన ఏవైనా సలహాలు మరియు అమలునుదృష్టిలో ఉంచుకుని మంత్రిత్వ శాఖ అవసరమైన మార్పులు చేస్తుంది, తద్వారా ఈ పోర్టల్ మరింత ఉపయోగకరంగా మరియు లక్ష్య సమూహాలకు  స్వయం ఉపాధి లేదా వేతన-ఉపాధికి సంబంధించిన అవకాశాలను పొందడానికి మరింత  ప్రయోజనకరంగా మారుతుంది."అని కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అన్నారు.

ఈ పోర్టల్ యొక్క కొన్ని లక్షణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

 * షెడ్యూల్డు కులాలు, వెనుకబడిన తరగతులు మరియు సఫాయి కరంచారిల కోసం ఒకే చోట నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన మొత్తం సమాచారం లభిస్తుంది.
 *శిక్షణ సంస్థ మరియు వారి ఆసక్తి కార్యక్రమం కోసం నమోదు చేసుకునే సౌకర్యం.
 *వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన కావలసిన పత్రాలను అప్‌లోడ్ చేసే సౌకర్యం.
 *శిక్షణ కాలంలో ముఖం మరియు కంటి స్కానింగ్ ద్వారా ట్రైనీల హాజరు నమోదు చేసుకునే సౌకర్యం.
 *శిక్షణ మొదలైన సమయంలో ఫోటో మరియు వీడియో క్లిప్ ద్వారా పర్యవేక్షణ సౌకర్యం.

సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ కింద మూడు అపెక్స్ కార్పొరేషన్లు - జాతీయ షెడ్యూల్డ్ కులాల ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, జాతీయ వెనుకబడిన తరగతుల ఫైనాన్స్ మరియు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మరియు నేషనల్ సఫాయ్ కరంచారిస్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్  పనిచేస్తున్నాయి. ఈ కార్పొరేషన్‌లు స్వయం ఉపాధి కోసం వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు మరియు సఫాయి కరంచారీల లక్ష్య సమూహాలకు రాయితీ వడ్డీ రేట్లపై రుణాలను అందిస్తున్నాయి. అంతేకాకుండా  లక్ష్య సమూహాల నైపుణ్య అభివృద్ధి కోసం ఉచిత శిక్షణను కూడా అందిస్తున్నారు.

రుణాలు మరియు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ద్వారా లక్ష్యంగా ఉన్న సమూహాలను ఆర్థికంగా మరియు సామాజికంగా స్వావలంబన కల్పించడానికి ఈ కార్పొరేషన్‌లు నిరంతరం శ్రమిస్తున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ మూడు అపెక్స్ కార్పొరేషన్ల ద్వారా గత ఐదు సంవత్సరాలలో లక్ష్య సమూహాలకు చెందిన 2,73,152 మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వబడింది. తద్వారా వారు స్వయం ఉపాధి మరియు వేతన ఉపాధి ద్వారా తమను మరియు వారి కుటుంబాలను పోషించుకునే వీలు కల్పించారు. 2021-22 సంవత్సరంలో పైన పేర్కొన్న మూడు అపెక్స్ కార్పొరేషన్ల ద్వారా లక్ష్య సమూహాలకు చెందిన సుమారు 50,000 మంది వ్యక్తులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు.


 

***



(Release ID: 1743769) Visitor Counter : 228