పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

ఒ.ఎ.ఎల్.పి. 6వ రౌండ్ బిడ్ ప్రారంభం!


చమురు, గ్యాస్ అన్వేషణకు వినూత్న విధానం
ప్రారంభించిన పెట్రోలియం మంత్రిత్వ శాఖ
పెట్టుబడిదార్లకు కేటాయింపుకోసం
35,346 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం

Posted On: 06 AUG 2021 1:32PM by PIB Hyderabad

   పెట్రోలియం, ఖనిజవాయువుల తదితర హైడ్రోకార్బన్ల అన్వేషణ, లైసెన్సింగ్ విధానం (హెచ్.ఇ.ఎల్.పి.) అమలులోకి రావడంతో హైడ్రోకార్బన్ల అన్వేషణా క్షేత్రాల వేలం ప్రక్రియలో గణనీయమైన పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. 2016 మార్చిలో జారీ అయిన ఈ విధానంతో ఉత్పాదనను పంచుకునే పద్ధతినుంచి ఆదాయాన్ని పంచుకునే వ్యవస్థకు మారవలసి వచ్చింది.

  చమురు, గ్యాస్.కోసం  తాము అన్వేషణ జరపాల్సిన ప్రాంతాన్ని కంపెనీలే ఎంపిక చేసుకునే స్వేచ్ఛ కల్పించే ఓపెన్ ఏకరేజి లైసెన్సింగ్ ప్రోగ్రామ్ (ఒ.ఎ.ఎల్.పి.)ను ప్రవేశపెట్టడంతో, స్తోమత కలిగిన పెట్టుబడి దారు, తనకు నచ్చిన చమురు, లేదా గ్యాస్ క్షేత్రాన్ని ఆసక్తి వ్యక్తీకరణ (ఇ.ఒ.ఐ.) ద్వారా ఎంచుకునే స్వేచ్ఛ లభించింది. ఇ.ఒ.ఐ.ని పెట్టుబడిదారులు సంవత్సరమంతా ఎప్పుడైనా దాఖలుచేసుకునే స్వేచ్ఛ ఉంటుంది. దీనితో పరిమితకాలంలో ప్రారంభించే బిడ్ రౌండ్లకోసం పెట్టుబడిదారులు వేచి చూడాల్సిన అవసరం ఉండదు. మూడు బిడ్డింగ్ రౌండ్లు పూర్తి కాగానే, ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో హెచ్.ఇ.ఎల్.పి. పరిధిలోనే ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అదనంగా చేపట్టిన విధాన సంస్కరణలను ఆ నోటిఫికేషన్ ద్వారా తెలియజేసింది. ఇపుడు దృష్టి అంతా 'ఆదాయం'నుంచి 'ఉత్పాదనను' గరిష్టస్థాయికి పెంచుకునే దిశగా మళ్లింది. పారదర్శకత, ప్రక్రియ క్రమబద్ధీకరణ వంటి అంశాలపై కూడా దృష్టిని కేంద్రీకరించారు. సంస్కరించిన విధానం, సవరించిన నమూనా బిడ్ పత్రాల పరిధిలో 4వ రౌండ్.నుంచి బిడ్లను నిర్వహించారు.

  చమురు, గ్యాస్ క్షేత్రాలకు సంబంధించి ఒ.ఎ.ఎల్.పి. బిడ్ ఐదవ రౌండును భారత ప్రభుత్వం 2020వ సంవత్సరం జనవరి 14వ తేదీన ప్రారంభించింది. 19,789 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో కూడిన 11 అన్వేషణ, ఉత్పత్తి క్షేత్రాలకోసం చేపట్టిన ఈ బిడ్ రౌండు 2020 నవంబరు 17న ముగిసింది. ఈ రౌండు ద్వారా బిడ్ గెలిచిన వారికి అన్ని బ్లాకులను కేటాయించారు. కోవిడ్ వైరస్ మహమ్మారి వ్యాప్తితో సంక్షోభం నెలకొన్నప్పటికీ బిడ్డింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిసి, బ్లాకుల కేటాయింపు కూడా జరిగింది.

  చమురు, గ్యాస్ అన్వేషణకు, ఉత్పత్తికి సంబంధించిన పెట్టుబడి దార్ల సమావేశం 2021 జూలై 30న న్యూఢిల్లీలో జరిగింది. త్వరలోనే ఒ.ఎ.ఎల్.పి. బిడ్ ఆరవ రౌండును ప్రారంభించబోతున్నామని కేంద్ర పెట్రోలియం, ఖనిజవాయువు శాఖ మంత్రి ఈ సమావేశంలో ప్రకటించారు. దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడి దారులు ఈ ఆరవ రౌండు బిడ్.లో పాల్గొనాలని, భారతదేశపు ఇంధన ప్రగతి ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

   కొత్త విధానానికి అనుగుణంగా,  అన్వేషణ, ఉత్పాదన కార్యకలాపాలను భారీ స్థాయిలో కొనసాగించే అంశంపై ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించింది. అంతర్జాతీయ కాంపిటీటివ్ బిడ్డింగ్ కోసం ఒ.ఎ.ఎల్.పి. బిడ్ ఆరవ రౌండును ప్రక్రియను 2021 ఆగస్టు 6వ తేదీన ప్రారంభించింది. దాదాపుగా 35,346 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న మొత్తం 21 బ్లాకులను పెట్టుబడి దారులకు కేటాయించడానికి ఈ బిడ్డింగ్ రౌండును చేపట్టారు. బిడ్డర్లు ఆన్ లైన్ ఇ-బిడ్డింగ్ పోర్టల్ ద్వారా బిడ్లను దాఖలు చేయవచ్చు. 2021 అక్టోబరు 6వ తేదీ మధ్యాహ్నం 12గంటల్లోగా బిడ్లను దాఖలు చేయవలసి ఉంటుంది. కోవిడ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితి కారణంగా, బిడ్డర్లు ఎలక్ట్రానిక్ పద్ధతిలో తమ బిడ్ పత్రాలను దాఖలు చేసుకునేందుకు అనుమతించారు. ఈ రౌండులో గెలిచిన బిడ్డర్లకు బ్లాకుల కేటాయింపు 2021 నవంబరు నెలాఖరుకల్లా జరగవచ్చని భావిస్తున్నారు. ఒ.ఎ.ఎల్.పి. ఆరవ రౌండ్ బిడ్డింగ్ జరుగుతున్న 21 బ్లాకులు 11 సెడిమెంటరీ బేసిన్ల పరిధిలో విస్తరించి ఉన్నాయి. వీటిలో భూఉపరితలంపై ఉన్న బ్లాకులు 11, తక్కువ లోతు నీళ్లలో ఉన్న బ్లాకులు 4, పూర్తి లోతైననీళ్ల ప్రాంతంలో ఉన్న బ్లాకులు 2 ఉన్నాయి. ఒకటవ కేటగిరీ బేసిన్ పరిధిలో 12 బ్లాకులు, 2వ కేటగిరీ బేసిన్ పరిధిలో 4 బ్లాకులు, 3వ కేటగిరీ బేసిన్ పరిధిలో 5 బ్లాకులు ఉన్నాయి.

   ఆరవ రౌండ్ బిడ్.తో కేటాయింపు జరిగే క్షేత్రాల్లో వెంటనే అన్వేషణ జరిగే అవకాశం ఉంది. ఇది 30-40 కోట్ల అమెరికన్ డాలర్ల పెట్టుబడితో  కూడుకున్నది భావిస్తున్నారు. ఒకటినుంచి ఐదవ రౌండు వరకు జరిగిన ఒ.ఎ.ఎల్.పి. బిడ్డింగ్.లో ఇప్పటికే 1,56,580 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని బ్లాకుల కేటాయింపు ఇప్పటికే పూర్తయింది. ఆరవ రౌండు బిడ్డింగ్ ప్రక్రియతో అదనంగా 35,346 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చమురు, గ్యాస్ అన్వేషణకోసం కేటాయించవచ్చని భావిస్తున్నారు. దీనితో హెచ్.ఇ.ఎల్.పి. పరిధిలో మొత్తం 1,91,926 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని చమురు, గ్యాస్ అన్వేషణకోసం కేటాయించే అవకాశాలున్నాయి.

 

 హైడ్రోకార్బన్ల అన్వేషణ, లైసెన్సింగ్ విధానం (హెచ్.ఇ.ఎల్.పి.) గురించి...

   రెవెన్యూను పంచుకునే కాంట్రాక్ట్ నమూనాను అనుసరిస్తూ రూపొందిన హైడ్రోకార్బన్ల అన్వేషణ, లైసెన్సింగ్ విధానం (హెచ్.ఇ.ఎల్.పి.) ఒక వినూత్న ప్రయత్నం. భారతీయ చమురు, గ్యాస్ అన్వేషణ, ఉత్పాదన (ఇ&పి) రంగానికి సంబంధించి  ‘సులభతర వాణిజ్య నిర్వహణ’లో ఈ విధానం ఒక గొప్ప ముందడుగని పేర్కొనవచ్చు. పలు ఆకర్షణీయమైన సరళీకృత అంశాలతో ఈ విధానం ముందుకు వచ్చింది. తగ్గించిన రాయల్టీ రేట్లు, ఆయిల్ సుంకం లేకపోవడం, మార్కెటింగ్.కు ధరల నిర్ణయానికి సంబంధించి స్వేచ్ఛ, సంవత్సర కాలమంతా బిడ్డింగ్ నిర్వహణ, పెట్టుబడి దారులు తమకు ప్రయోజనకరమైన బ్లాకును ఎంపిక చేసుకునే స్వేచ్ఛ, సంప్రదాయ, సంప్రదాయేతర హైడ్రోకార్బన్ వనరులకు వర్తించేలా ఒకే లైసెన్సు పద్ధతి, కాంట్రాక్ట్ గడవు అంతా అన్వేషణ జరిపేందుకు అనుమతి, బిడ్డింగ్.కు, కేటాయింపునకు సులభమైన, పారదర్శకమైన, వేగవంతమైన ప్రక్రియ వంటి సరళీకృత విధానాలను ముందుకు తెచ్చారు. ఇక ఆరవ రౌండ్ బిడ్డింగ్ నుంచి ఈ ప్రక్రియను మరింత సరళతరమైన నిబంధనలతో చేపడతారు. గరిష్ట  స్థాయి ఉత్పాదనపైనే దృష్టిని కేంద్రీకరిస్తారు.   

  పదవ రౌండ్ ఆసక్తి వ్యక్తీకరణ (ఇ.ఒ.ఐ.) పత్రాల సమర్పణ ప్రక్రియ 2021వ సంవత్సరం జూలై 31వ తేదీన ముగిసింది. పెట్టుబడి దారులు ఎంతో క్రియాశీలంగా పాల్గొన్నారు. ఇక 11వ రౌండ్.కు ఇపుడు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇ.ఒ.ఐ. బిడ్లను 2021 నవంబరు 30 వరకూ దాఖలు చేయవచ్చు.

 

 

బిడ్డింగ్ కోసం కేటాయింపు జరిగిన బ్లాకుల వివరాలు (ఒ.ఎ.ఎల్.పి. బిడ్ రౌండ్-VI)

(ఇ.ఒ.ఐ. సైకిల్-VIIIకి సంబంధించి...)

క్రమ సంఖ్య.

క్షేత్రం పేరు

విస్తీర్ణం (చదరపు కిలోమీటర్లు)

రాష్ట్రం పేరు

బేసిన్

ఆన్.ల్యాండ్/

 ఆఫ్ షోర్

1

సిబి-ఒఎన్.హెచ్.పి-2020/1

44.13

గుజరాత్

కాంబే

ఆన్.ల్యాండ్

2

ఎఎ-ఒఎన్.హెచ్.పి.-2020/1

557.33

త్రిపుర

అస్సాం అరకాన్ ఫోల్డ్ బెల్ట్

ఆన్.ల్యాండ్

3

ఎఎ-ఒఎన్.హెచ్.పి.-2020/2

50.41

త్రిపుర

అస్సాం అరకాన్ ఫోల్డ్ బెల్ట్

ఆన్.ల్యాండ్

4

ఎఎ-ఒఎన్.హెచ్.పి.-2020/3

219.37

త్రిపుర

అస్సాం అరకాన్ ఫోల్డ్ బెల్ట్

ఆన్.ల్యాండ్

5

సిడి-ఒఎన్.హెచ్.పి.-2020/1

3,305.89

ఆంధ్రప్రదేశ్

కడప

ఆన్.ల్యాండ్

6

ఎన్.ఎం.-ఒఎన్.హెచ్.పి.-2020/1

2,999.15

మధ్యప్రదేశ్, మహారాష్ట్ర

నర్మద

ఆన్.ల్యాండ్

7

ఎం.బి-ఒ.ఎస్.హెచ్.పి.-2020/1

956.1

పశ్చిమ తీరం

ముంబై ఆఫ్.షోర్

ఆఫ్.షోర్

8

ఎం.బి-ఒ.ఎస్.హెచ్.పి.-2020/2

427.17

పశ్చిమ తీరం

ముంబై ఆఫ్.షోర్

ఆఫ్.షోర్

9

ఎఎన్-యుడిడబ్ల్యుహెచ్.పి-2020/1

3,995.25

తూర్పు తీరం

అండమాన్ నికోబార్

ఆఫ్.షోర్

10

ఎఎన్-యుడిడబ్ల్యుహెచ్.పి-2020/2

9,650.12

తూర్పు తీరం

అండమాన్ నికోబార్

ఆఫ్.షోర్

 

మొత్తం

22,204.92

 

 

 

 

(ఇ.ఒ.ఐ. రౌండ్–IXకు సంబంధించి..)

క్రమ

సంఖ్య.

క్షేత్రం పేరు

విస్తీర్ణం(చదరపు కిలోమీటర్లు)

రాష్ట్రం పేరు

బేసిన్

ఆన్.ల్యాండ్/ ఆఫ్.షోర్.

1

సిబి-ఒ.ఎన్.హెచ్.పి.-2021/1

113.74

గుజరాత్

కాంబే

ఆన్.ల్యాండ్

2

సిబి-ఒ.ఎన్.హెచ్.పి.-2021/2

28.59

గుజరాత్

కాంబే

ఆన్.ల్యాండ్

3

జికె- ఒ.ఎన్.హెచ్.పి.-2021/1

313.64

గుజరాత్

కచ్

ఆన్.ల్యాండ్

4

జిఎస్- ఒ.ఎన్.హెచ్.పి.--2021/1

2,483.64

గుజరాత్

సౌరాష్ట్ర

ఆన్.ల్యాండ్

5

జివి-ఒ.ఎన్.హెచ్.పి.-2021/1

308.32

బీహార్

గంగా పంజాబ్

ఆన్.ల్యాండ్

6

జివి-ఒ.ఎస్.హెచ్.పి.-2021/2

302.57

ఉత్తరప్రదేశ్,

బీహార్

గంగా పంజాబ్

ఆన్.ల్యాండ్

7

బిపి-ఒ.ఎన్.హెచ్.పి.-2021/1

2,872.56

పశ్చిమ బెంగాల్

బెంగాల్ పూర్ణియా

ఆన్.ల్యాండ్

8

ఎఎ-ఒ.ఎస్.హెచ్.పి.-2021/1

37.68

త్రిపుర

అస్సాం అరకాన్ ఫోల్డ్ బెల్ట్

ఆన్.ల్యాండ్

9

ఎఎస్- ఒ.ఎన్.హెచ్.పి.-2021/1

24.64

అస్సాం

అస్సాం షెల్ఫ్

ఆన్.ల్యాండ్

10

సిబి- ఒ.ఎస్.హెచ్.పి.-2021/1

472.56

పశ్చిమ తీరం, గుజరాత్

కాంబే

ఆఫ్.షోర్

11

ఎంబి- ఒ.ఎస్.హెచ్.పి.-2021/1

6,183.17

పశ్చిమ తీరం

ముంబై తీరం

ఆఫ్.షోర్

 

మొత్తం

13,141.11

 

 

 

 

ఒ.ఎ.ఎల్.పి. బిడ్ రౌండ్లు-I, II, III, IV,Vలో కేటాయించిన బ్లాకుల వివరాలు

 1,56,580 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, 17కు పైగా సెడిమెంటరీ బేసిన్ల పరిధిలోని 105 బ్లాకులను కేంద్ర పెట్రోలియం, ఖనిజవాయువుల మంత్రిత్వ శాఖ పెట్టుబడిదార్లకు కేటాయించింది. వీటిలో దాదాపు 237.8కోట్ల అమెరికన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది.

S. No.

కేటాయింపు జరిగిన కంపెనీ పేరు

బ్లాకుల నంబర్లు

విస్తీర్ణం (చదరపు కిలోమీటర్లలో)

1

వేదాంత లిమిటెడ్

51

58,584.95

2

ఆయిల్ ఇండియా లిమిటెడ్

25

49,160.95

3

ఒ.ఎన్.జి.సి. లిమిటెడ్.

24

46,380.69

4

బి.పి.+ఆర్.ఐ.ఎల్.

1

1,513.90

       

...

[సందేశం జతపరచ బడింది]
పూర్తి సందేశం చూడండి.

 

***


(Release ID: 1743666) Visitor Counter : 302


Read this release in: English , Marathi , Hindi , Bengali