రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
కోవాగ్జిన్ ఉత్పత్తిని ఎక్కువ చేయడానికి భారత్ బయోటెక్,మరో మూడు పిఎస్‌ఇల విస్తరణకు సహకారం
త్వరితగతిన కోవిడ్-19 వ్యాక్సిన్ దరఖాస్తులు,క్లినికల్ పరీక్షలు, ఆమోదం కోసం ఫాస్ట్ ట్రాక్ వ్యవస్థను అమలు చేస్తున్న సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ అండ్ కంట్రోల్ ఆర్గనైజేషన్
నాడు పోస్టు చేయడమైనది:
06 AUG 2021 12:26PM by PIB Hyderabad
అభివృద్ధి వ్యయం, మేధో సంపత్తి హక్కులు ఖర్చు, సాంకేతికత, వ్యాక్సిన్ వేదిక, వివిధ కంపెనీలలో ఉత్పత్తి జరుగుతున్న స్థాయి వంటి అంశాలపై ఔషధం /వ్యాక్సిన్ తయారీ వ్యయం ఆధారపడి ఉంటుంది.
బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ ద్వారా అమలు జరుగుతున్న "మిషన్ కోవిడ్ సురక్ష- ఇండియన్ కోవిడ్ -19 వ్యాక్సిన్ డెవలప్‌మెంట్ మిషన్" కింద భారత్ బయోటెక్, మరో మూడు ప్రభుత్వ రంగ సంస్థలు- హాఫ్‌కిన్ బయోఫార్మాస్యూటికల్ కార్పొరేషన్ లిమిటెడ్, ముంబై, ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ హైదరాబాద్; భారత్ ఇమ్యునలాజికల్స్ బయోలాజికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్, బులంద్‌షహర్ లలో కోవాగ్జిన్ ఉత్పత్తిని ఎక్కువ చేయడానికి చేపట్టిన విస్తరణ కార్యక్రమాలకు సహకరిస్తున్నట్లు బయోటెక్నాలజీ విభాగం తెలియజేసింది. రానున్న నెలల్లో కోవాగ్జిన్ ఉత్పత్తిని పెంచాలనే ఉద్దేశ్యంతో హెస్టర్ బయోసైన్సెస్, ఓమ్నిబిఆర్ఎక్స్ బయోటెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ (జిబిఆర్‌సి), గుజరాత్ రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కలసి ఏర్పాటైన గుజరాత్ కోవిడ్ వ్యాక్సిన్ కన్సార్టియం (జిసివిసి) కి కోవాగ్జిన్ ఉత్పత్తి సాంకేతికతను బదిలీ చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలకు బయోటెక్నాలజీ విభాగం అవసరమైన సహకారాన్ని అందిస్తున్నది.
స్వదేశీ వ్యాక్సిన్ తయారీదారుల కు వ్యాక్సిన్ కొనుగోలు కోసం ఇచ్చిన ఆర్డర్ల పూర్తి విలువను ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అడ్వాన్స్ గా చెల్లించింది. ఈ నిధులను తయారీదారులు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం కోసం ఉపయోగించవచ్చు. కోవిడ్ -19 వ్యాక్సిన్ తయారీలో 'ఎట్-రిస్క్ మాన్యుఫాక్చరింగ్' కోసం ప్రభుత్వం టీకా తయారీదారులలో ఒకటైన మెస్సర్స్ బయోలాజికల్ ఈ సంస్థకు ఆర్థిక సహాయాన్ని అందించింది.
ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ అండ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ క్లినికల్ పరీక్షలు, కోవిడ్ -19 టీకాల కోసం ఆమోదం కోసం అందిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించడానికి ఫాస్ట్ ట్రాక్ వ్యవస్థను ఏర్పాటు చేసింది.
సామాజిక-ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అర్హులైన లబ్ధిదారులకు సురక్షితమైన కోవిడ్ -19 టీకా అందుబాటులో ఉండేలా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ చర్యలను తీసుకుంటున్నది. టీకా కేంద్రాల సంఖ్యను పెంచడం, కోవిడ్ -19, వ్యాక్సిన్ పై సాధారణ ప్రజల సందేహాలను పరిష్కరించడానికి 24x7 నేషనల్ కాల్ సెంటర్ హెల్ప్‌లైన్ కో-విన్ ఏర్పాటు చేయడం లాంటి కార్యక్రమాలను మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్నది.
కోవిడ్ -19 టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు 15 రోజుల ముందుగానే వాటికి సరఫరా చేయనున్న వ్యాక్సిన్ పరిమాణాన్ని తెలియజేస్తున్నది. దీనితో జిల్లాల వారీగా వ్యాక్సినేషన్ కేంద్రాల వారీగా (సివిసి) ప్రణాళికను సిద్ధం చేసి ప్రచారం నిర్వహించడానికి ఈ వ్యూహం అమలు జరుగుతుంది. అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో టీకాల కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి ఇది సహకరిస్తుంది. వ్యాక్సిన్ పై విశ్వాసాన్ని పెంపొందించడానికి అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రచార కార్యక్రమం అమలు జరుగుతున్నది. జాతీయ కోవిడ్ -19 టీకా కార్యక్రమం పురోగతిని అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో కేంద్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా సమీక్షిస్తుంది.
అర్హులైన లబ్ధిదారులకు కోవిడ్ -19 వ్యాక్సిన్‌లను అందించడానికి దేశంలో ఉత్పత్తి మరియు కోవిడ్ -19 వ్యాక్సిన్ల లభ్యత ను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. . 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న అర్హులైన లబ్ధిదారులకు టీకాలు వేయడానికి జనవరి 2021 నుండి డిసెంబర్ 2021 మధ్య తగినంత పరిమాణంలో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.
ఈ సమాచారాన్ని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు రసాయనాలు,ఎరువుల శాఖ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవీయ రాజ్యసభలో ఈరోజు లిఖితపూర్వకంగా ఇచ్చారు.
***
(రిలీజ్ ఐడి: 1743241)
సందర్శకుల సూచీ సంఖ్య : : 163