ఆర్థిక మంత్రిత్వ శాఖ

పట్టణ స్థానిక సంస్థలకు రూ.685.80 కోట్లు గ్రాంట్ విడుదల


2021-22లో యుఎల్బి లకు ఆసరాగా ఉండడానికి రూ.2,516.73 కోట్లు విడుదల

Posted On: 05 AUG 2021 4:10PM by PIB Hyderabad

 

ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం అర్బన్ స్థానిక సంస్థలకు (యుఎల్బిలు)  4 రాష్ట్రాలకు  రూ.685.80 కోట్లు  గ్రాంట్లను విడుదల చేసింది. ఇందులో ఉత్తరప్రదేశ్‌కు రూ .494 కోట్లు, గుజరాత్‌కు రూ .110.20 కోట్లు, రూ. జార్ఖండ్‌కు 74.80 కోట్లు మరియు మిజోరాంకు రూ .6.80 కోట్లు ఉన్నాయి. 

15 వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు పట్టణ స్థానిక సంస్థలకు గ్రాంట్లు విడుదల చేశారు. వారు నిర్దిష్ట పౌర సేవలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ గ్రాంట్‌లు కంటోన్మెంట్ బోర్డ్‌లతో సహా చిన్న (మిలియన్ ప్లస్ జనాభా కాని) నగరాల కోసం ఉద్దేశించినవి.

15 వ ఆర్థిక సంఘం పట్టణ స్థానిక సంస్థలను రెండు వర్గాలుగా విభజించింది: (ఏ) మిలియన్-ప్లస్ పట్టణ సముదాయాలు/నగరాలు (ఢిల్లీ మరియు శ్రీనగర్ మినహా), (బి) ఒక మిలియన్ కంటే తక్కువ జనాభా ఉన్న అన్ని ఇతర నగరాలు, పట్టణాలు (నాన్ మిలియన్ ప్లస్ సిటీలు). నాన్ మిలియన్ ప్లస్ సిటీలకు 15 వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు చేసిన గ్రాంట్లలో, 50% బేసిక్ (జత కట్టని) మరియు మిగిలిన 50% జత కట్టే గ్రాంట్‌గా ఉంటుంది.

జీతం లేదా ఇతర స్థాపన వ్యయం మినహా స్థానిక అవసరాల పరంగా ప్రాథమిక గ్రాంట్‌లు (అన్‌టైడ్) ఉపయోగిస్తారు. జత కూడే గ్రాంట్లు (ఎ) తాగునీరు (రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ మరియు రీసైక్లింగ్‌తో సహా)  (బి) ఘన వ్యర్థాల నిర్వహణ కోసం ఉపయోగిస్తారు.

కేంద్ర ప్రాయోజిత పథకాల కింద పారిశుధ్యం, తాగునీటి కోసం కేంద్రం, రాష్ట్రం కేటాయించిన నిధుల కంటే పట్టణ స్థానిక సంస్థలకు అదనపు నిధులను అందించేలా గ్రాంట్‌లు ఉద్దేశించబడ్డాయి.

కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి 10 రోజుల పని దినాల్లో గ్రాంట్లను యుఎల్బీలకు బదిలీ చేయాల్సి ఉంటుంది. 10 పని దినాలకు మించి ఆలస్యం అయితే రాష్ట్ర ప్రభుత్వాలు గ్రాంట్లను వడ్డీతో విడుదల చేయాలి.

         

2021-22 రాష్ట్రాల వారీగా పట్టణ స్థానిక సంస్థలకు విడుదలైన గ్రాంట్లు 

 

వరుస 

సంఖ్య 

రాష్ట్రం 

2021-22 లో  విడుదలైన నిధులు 

(రూ.కోట్లలో)

1

గోవా 

5.40

2

గుజరాత్ 

110.20

3

హర్యానా 

77.40

4

హిమాచల్ ప్రదేశ్ 

51.75

5

ఝార్ఖండ్ 

74.80

6

కర్ణాటక 

150.00

7

మధ్యప్రదేశ్ 

199.60

8

మిజోరాం 

6.80

9

ఒడిశా 

164.40

10

పంజాబ్

74.00

11

రాజస్థాన్ 

196.20

12

తమిళనాడు 

295.25

13

తెలంగాణ 

50.43

14

ఉత్తరప్రదేశ్ 

851.00

15

పశ్చిమ బెంగాల్ 

209.50

 

మొత్తం 

2,516.73

 

***



(Release ID: 1742916) Visitor Counter : 189


Read this release in: English , Bengali , Punjabi