నౌకారవాణా మంత్రిత్వ శాఖ
ఇ-కార్లను ప్రారంభించిన తొలి ప్రధాన ఓడరేవు- విఒసి పోర్టు
Posted On:
05 AUG 2021 12:53PM by PIB Hyderabad
విఒ చిదంబరనార్ పోర్ట్ ట్రస్టు నుంచి బుధవారం సాయంత్రం తొలి బ్యాచ్ ఇ-కార్లు మూడింటికి జెండా ఊపి ప్రారంభించారు. విద్యత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ ఉమ్మడి వెంచర్ అయిన ఎం/ఎఎస్ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఇఇఎస్ఎల్) ఈ టాటాఎక్స్‌ప్రెస్- టి ఎలక్ట్రిక్ వాహనాలను వెట్ లీజ్ కింద ఆరేళ్ళ కాలానికి సరఫరా చేసింది. సమీప భవిష్యత్తులో మరొక మూడు ఇ-కార్లను రంగంలోకి దించనున్నారు.
వెట్ లీజ్ ఒప్పందంలో భాగంగా, ఇఇఎస్ఎల్ పోర్ట్ వద్ద చార్జింగ్ పాయింట్లను, బీమాను, రిజిస్ట్రేషన్ ను, డ్రైవర్లను, వాహనాల నిర్వహణను అందిస్తుంది. విఒసి పోర్టు నెలవారీ పునరావృతవ్యయాన్ని (రికరింగ్ కాస్ట్) ఇఇఎస్ ఎల్‌కు చెల్లిస్తుంది.
రంగంలోకి దించిన ఈ విద్యుత్ వాహనాలు ఒక్కసారి చార్జి చేస్తే 231 కిలోమీటర్లు నిరాటంకంగా వాహనానికి శక్తిని అందించగల 21.50కె డబ్ల్యుహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటాయి. ఈ బ్యాటరీ ప్యాక్ ఏకకాలంలో కారుకు 3.3కిలోవాట్ల శక్తిని అందిస్తూ, మూడు కార్లను (3 ఔట్‌పుట్లు)చార్జి చేయగల ఒక ఎసి (ఏకాంతర ప్రవాహ) చార్జర్ ఏర్పాటును కలిగి ఉంటుంది. ఈ చార్జర్ సెటప్ అన్నది 8 గంటలలో బ్యాటరీని 0 నుంచి 100% చార్జి చేయగలదు. వాహనం వెనుక ఉండే గొట్టాల ద్వారా ఎటువంటి ఉద్గారం ఉండని ప్రతి ఎలక్ట్రిక్ వాహనం ఏడాదికి 1.5 టన్నుల కార్బన్ డయాక్సైడ్‌ను తగ్గించడం ద్వారా హరితవాయు ఉద్గారాలను ఉనికిని తగ్గిస్తుంది.
మారిటైమ్ ఇండియా విజన్ 2030లో భాగంగా, అంతర్జాతీయ గుర్తించిన పర్యావరణ నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి సురక్షితమైన, నిలకడైన, కాలుష్యరహిత సముద్ర రంగంలోకి ప్రపంచాన్ని నడిపించేందుకు షిప్పింగ్, పోర్ట్‌లు, వాటర్‌వేస్ మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది.
(Release ID: 1742871)
Visitor Counter : 187