పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
వందే భారత్ మిషన్
Posted On:
04 AUG 2021 3:42PM by PIB Hyderabad
'వందే భారత్ మిషన్' 07వ తేదీ మే 2020న ప్రారంభమైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ మిషన్ కొనసాగుతోంది. మిషన్‌లో భాగంగా 24.07.2021 వరకు 88,000 కంటే ఎక్కువ ఇన్‌బౌండ్ విమానాలు నిర్వహించబడ్డాయి. దాదాపు 100కి పైగా దేశాల నుండి 71 లక్షల మంది ప్రయాణీకులు భారతదేశానికి తిరిగి వచ్చారు. అదే కాలంలో, 87,600 కంటే ఎక్కువ అవుట్ బౌండ్ విమానాలు నిర్వహించబడ్డాయి. 57 లక్షల మంది ప్రయాణీకులు భారతదేశం నుండి విదేశాలకు వెళ్లారు. వందే భారత్ మిషన్ కింద విమానాలు ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్దేశించిన ఆరోగ్య సంబంధిత ప్రోటోకాల్‌లు, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నిర్దేశించిన విధానాల్ని కచ్చితంగా పాటిస్తున్నాయి. దీనికి తోడుగా వివిద దేశాలకు వెళ్లి వచ్చే విమానాలు ఆయా దేశాలకు అనువర్తించే వివిధ మార్గదర్శకాలు/ సూచనలకు కూడా కట్టుబడి సేవలను నిర్వహిస్తున్నాయి. ఈ సమాచారాన్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జనరల్ (రిటైర్డ్) డా.వి.కె.సింగ్ వెల్లడించారు.
****
(Release ID: 1742488)
Visitor Counter : 186