ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం పనితీరు
Posted On:
03 AUG 2021 3:24PM by PIB Hyderabad
నీతి ఆయోగ్ సలహా మేరకు, 2020 లో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాం (ఎన్ఏసిపి) పనితీరుపై అంచనా వేసింది. 'కార్యక్రమం ప్రశంసనీయంగా, చాలా బాగా పనిచేసింది' అని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. ఎన్ఏసిపి-IV, దాని పొడిగింపు దశ (2012-21) ప్రారంభంలో నిర్దేశించిన లక్ష్యాలు సాధించాయి. పనితీరు అంచనా వేసిన క్రమంలో కార్యక్రమం నిధుల దుర్వినియోగం గురించి ప్రస్తావన చేయలేదు, ఇంకా అలాంటి సందర్భం ఏదీ ప్రభుత్వం దృష్టికి రాలేదు.
గత మూడు ఆర్థిక సంవత్సరాలలో, అంటే, 2018-19, 2019-20 మరియు 2020-21, ఎన్ఏసిపి కింద నిధుల వినియోగం వరుసగా 93.7%, 94.9%, 97.1%గా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం కింద నిరంతర ప్రయత్నాల వల్ల, దేశంలో హెచ్ఐవి మహమ్మారి జాతీయ స్థాయిలో తక్కువగా కొనసాగుతోంది, 2020 లో 0.22% మంది వయోజనుల(15-49 సంవత్సరాలు)పై ప్రభావం పడినట్టు అంచనా వేశారు. ఏటా కొత్త హెచ్ఐవి సంక్రమణలు క్షీణత ప్రపంచ సగటు 31% తో పోలిస్తే దేశంలో 48% (2010 మరియు 2020 మధ్య) నమోదైంది. ప్రపంచ సగటు 42% తో పోలిస్తే అంచనా వేసిన వార్షిక ఎయిడ్స్ సంబంధిత మరణాలు 82% (2010 మరియు 2020 మధ్య) తగ్గాయి.కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవర్ ఈ రోజు రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
*****
(Release ID: 1742100)
Visitor Counter : 116