భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
మొత్తం రూ. 4077 కోట్ల బడ్జెట్ తో ఐదేళ్ళ పాటు డీప్ ఓషన్ మిషన్‌ను అమలు చేయనున్నభూశాస్త్రాల శాఖ - కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
2021లో ప్రారంభం కానున్న డీప్ ఓషన్ మిషన్‌కు సంబంధించిన అన్నిఅంగాలూ
సముద్ర గర్భ ఖనిజ వనరులు, సముద్ర జీవ వైవిధ్యం అన్వేషణకు సముద్ర జలాలలో 6000 మీటర్ల లోతుకు ముగ్గురు వ్యక్తులను తీసుకువెళ్లగల మానవ చోదిత సబ్ మెర్సిబుల్ అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం
Posted On:
03 AUG 2021 1:30PM by PIB Hyderabad
భూశాస్త్రాల (ఎర్త్ సైన్సెస్) మంత్రిత్వ శాఖ రూ. 4077 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఐదేళ్లపాటు అమలు చేయనున్న సముద్ర గర్భ మిషన్ (డీప్ ఓషన్ మిషన్)ను ప్రభుత్వం ఆమోదించనున్నట్టు కేంద్ర శాస్త్ర& సాంకేతిక శాఖ (ఇండిపెండెంట్ చార్జి), భూశాస్త్రాల శాఖ (ఇండిపెండెంట్ ఛార్జి), ప్రధాన మంత్రి కార్యాలయం, ప్రజా సమస్యలు, పింఛన్లు, అణు విద్యుత్తు, అంతరిక్షశాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మంగళవారం తెలిపారు.
రాజ్యసభలో మంగళవారం అడిగిన ఒక ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇస్తూ, సముద్ర గర్భ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, సముద్ర నీటిలో 6000 మీటర్ల లొతులో మానవ చోదిత సబమెర్సిబుల్ (సబ్‌మెరైన్ వలె నీటిలోపల ప్రయాణించగల వాహనం కానీ సబ్‌మెరైన్ కాదు) అభివృద్ధితో పాటుగా సముద్రగర్భంలో మైనింగ్, సముద్ర లోతుల్లో ఖనిజ వనరుల, సముద్ర జీవవైవిధ్యం కోసం అన్వేషణ, సముద్ర అన్వేషణ కోసం పరిశోధన నౌక సముపార్జన, సముద్ర గర్భంలో పరిశీలనలు, సముద్ర జీవశాస్త్ర సామర్ధ్యం పెంపు వంటి అంశాలతో కూడిన సముద్ర గర్భ మిషన్ బహుళ మంత్రిత్వశాఖ, బహు శాస్త్ర సంబంధిత కార్యక్రమమని మంత్రి వివరించారు. సముద్ర జలాలలో 6000 మీటర్ల లోతుకు ముగ్గురు వ్యక్తులను తీసుకువెళ్లగల మానవ చోదిత సబ్ మెర్సిబుల్ ను తగిన శాస్త్రీయ సెన్సార్లు, పరికరాలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను రూపొందించారు. ఈ మిషన్‌కు సంబంధించిన అన్ని అంశాలు 2021లో ప్రారంభం కానున్నాయి.
***
(Release ID: 1741872)
Visitor Counter : 200