శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

సాంప్రదాయ సాంకేతిక పరిజ్ఞానంతో సాధ్యం కానిది, కృత్రిమ మేధ (ఏఐ), కొత్త అవకాశాలను కల్పిస్తోంది: నిపుణులు

Posted On: 02 AUG 2021 11:29AM by PIB Hyderabad

కృత్రిమ మేధ (ఏఐ) కొత్త అవకాశాలను సృష్టిస్తోందని నిపుణులు స్పష్టం చేశారు. ఇది సాంప్రదాయ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సాధ్యం కానిది. ఆరోగ్య సంరక్షణతో పాటు వివిధ రంగాలలోని అనేక ఇతర వర్తమాన, భవిష్యత్తు సవాళ్లకు సమాధానం అని వారు ఒక ఉపన్యాస కార్యక్రమంలో వివరించారు. 

"ఏఐ స్థానాలను భర్తీ చేయదు కానీ వివిధ రంగాలలో కొత్త అవకాశాలను కల్పిస్తుంది. ఇది డేటాపై పనిచేస్తుంది, మనం మన మెషీన్‌లకు శిక్షణ ఇవ్వగలిగితే, అది ఆటోమేటిక్ ప్రక్రియల ద్వారా మిల్లీసెకన్లలో మనకు అద్భుతాలు చేయవచ్చు. ఇది కోవిడ్-19 తో సహా వివిధ వ్యాధులకు రోగనిర్ధారణ ప్రయోజనాల కోసం ఉపయోగించపడుతుంది. తగిన ఆరోగ్య సౌకర్యాలు అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. వివిధ సమస్యలకు ఏఐని ఉపయోగించడంలో విజయానికి కీలకం ఎక్కువ మందికి చేరుకోవడమే ”అని ఆన్‌లైన్ డిఎస్టీ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ డిస్కోర్స్ సిరీస్ న్యూ ఇండియా @ 75 లో సైన్స్ & టెక్నాలజీ ప్రొఫెసర్ అశుతోష్ శర్మ అన్నారు. నేషనల్  కౌన్సిల్ ఫర్  సైన్స్ & టెక్నాలజీ కమ్యూనికేషన్, విజ్ఞాన్ ప్రసార్ ఈ కార్యక్రమం నిర్వహించింది.  "అంతరాయం కలిగించే మరియు ప్రభావవంతమైన టెక్నాలజీల ఆవిర్భావం కొత్త సవాళ్లను మరియు ఏకకాలంలో ఎక్కువ అవకాశాలను కలిగిస్తుంది. దేశ పురోగతి, అభివృద్ధి కోసం యువ ప్రతిభావంతులకు సహాయం చేయడానికి, పెంపొందించడానికి, ఎదగడానికి డిఎస్టీ ఒక సాధనం” అని ఆయన అన్నారు. 

ఆ నీతి ఆయోగ్ సీనియర్ సలహాదారు అన్నా రాయ్, దేశంలోని వివిధ సవాళ్లకు ఏఐ ని సమర్థవంతంగా ఉపయోగించవచ్చని సూచించారు. "భారతదేశానికి అనేక సవాళ్లు ఉన్నాయి, కానీ అదే సమయంలో, చాలా మంది ఐటీ నిపుణులు, విద్యావేత్తలు కలిగిన సుసంపన్నమైన డేటా దేశంగా మనకి ప్రయోజనం ఉంది. దేశ పురోగతి, అభివృద్ధి కోసం వీటిని ఉపయోగించగలిగితే ఇవన్నీ మనకు వరం లాంటివి అని నిరూపించవచ్చు, ”అని రాయ్ అన్నారు.

దేశంలోని వివిధ సమస్యలను గుర్తించి, భవిష్యత్తు మార్గదర్శకాన్ని సూచించడంలో నీతి ఆయోగ్ పోషిస్తున్న పాత్రను ఆమె ప్రధానంగా ప్రస్తావించారు. "ప్రభుత్వం, దేశం కోసం ప్రముఖ సలహా వ్యవస్థ నీతి  ఆయోగ్ సైన్స్ మరియు టెక్నాలజీ పర్యావరణ వ్యవస్థను విస్తృతం చేయడానికి, ప్రతి రంగంలో దేశ పురోగతి, అభివృద్ధి కోసం పరిశ్రమ, విద్యాసంస్థలను తీసుకువెళ్లడానికి విధానాలను రూపొందిస్తోంది" అని ఆమె నొక్కి చెప్పారు.

 

image.png

***



(Release ID: 1741695) Visitor Counter : 176