సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

కొత్తగా విజ్ఞానశాస్త్ర కేంద్రాలు, సైన్స్ సెంటర్ల ఏర్పాటు!


దేశవ్యాప్తంగా ఎన్.సి.ఎస్.ఎం. ఆధ్వర్యంలో 14 ప్రాజెక్టులు

మరో 4 సైన్స్ సెంటర్ల ఏర్పాటుకు
ఆమోదం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Posted On: 02 AUG 2021 3:17PM by PIB Hyderabad

ముఖ్యాంశాలు:

-దేశవ్యాప్తంగా విజ్ఞాన శాస్త్ర మ్యూజియమ్.లు, విజ్ఞాన శాస్త్ర కేంద్రాల (సైన్స్ సెంటర్ల) వ్యవస్థకు కేంద్ర సాంస్కతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపకల్పన చేసింది. జాతీయ విజ్ఞాన శాస్త్ర మ్యూజియంల మండలి (ఎన్.సి.ఎస్.ఎం.) ద్వారా ఈ వ్యవస్థ రూపొందిందింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా సైన్స్ సిటీల ఏర్పాటుకు కూడా రూపకల్పన చేశారు.

-ఎన్.సి.ఎస్.ఎం. పరిధిలో దేశ వ్యాప్తంగా 25 విజ్ఞాన శాస్త్ర మ్యూజియంలు/విజ్ఞాన శాస్త్ర కేంద్రాలు ప్రస్తుతం పనిచేస్తున్నాయి.

-మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో 4 విజ్ఞాన శాస్త్ర కేంద్రాల ప్రాజెక్టులకు కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.

జాతీయ విజ్ఞాన శాస్త్ర మ్యూజియంల మండలి లేదా ఎన్.సి.ఎస్.ఎం. అనేది కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వతంత్ర సంస్థ. దేశవ్యాప్తంగా పలు సైన్స్ సిటీలతో పాటుగా, అనేక విజ్ఞాన శాస్త్రాల మ్యూజియంలు, విజ్ఞాన శాస్త్ర కేంద్రాల వ్యవస్థకు ఎన్.సి.ఎస్.ఎం. రూపకల్పన చేసింది. శాస్త్ర విజ్ఞాన సంస్కృతి ప్రోత్సాహక పథకం (ఎస్.పి.ఒ.సి.ఎస్.) కింద వీటి ఏర్పాటుకు సంకల్పించారు. విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన ప్రగతిని, పారిశ్రామిక రంగంలో, ప్రజా సంక్షేమంలో వాటి ఆవశ్యకతను తెలియజెప్పడమే లక్ష్యంగా ఈ వ్యవస్థను రూపొందించారు. దేశంలో వైజ్ఞానిక స్పృహను, శాస్త్రీయ దృక్పథకాన్ని పెంపొందించడం, ఎన్..ఎస్.ఎం. పరిధిలోని అంశాలకు సంబంధించి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో పరిశోధన నిర్వహించడం వంటి లక్ష్యాలను కూడా నిర్దేశించుకున్నారు.

    భారత ప్రభుత్వం అమలు చేస్తున్న శాస్త్ర విజ్ఞాన సంస్కృతి ప్రోత్సాహక పథకం (ఎస్.పి.ఒ.సి.ఎస్.) కింద కొత్త విజ్ఞాన శాస్త్ర కేంద్రాల ప్రాజెక్టులన్నింటినీ ఎన్.సి.ఎస్.ఎం. చేపట్టింది.

   ఎన్.సి.ఎస్.ఎం. పరిపాలనా పర్యవేక్షణా పరిధిలో ప్రస్తుతం 25 విజ్ఞాన శాస్త్ర మ్యూజియంలు/విజ్ఞాన శాస్త్ర కేంద్రాలు పనిచేస్తున్నాయి.

  ఇక, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సహకారంతో 22 విజ్ఞాన శాస్త్ర కేంద్రాలను ఎన్.సి.ఎస్.ఎం. ఏర్పాటు చేసింది. అనంతరం వాటి నిర్వహణా, పర్యవేక్షణ కోసం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది.

 

***



(Release ID: 1741687) Visitor Counter : 166


Read this release in: English , Urdu , Punjabi