రక్షణ మంత్రిత్వ శాఖ
సాయుధ దళాలకు అత్యాధునిక సాంకేతికత
Posted On:
02 AUG 2021 3:00PM by PIB Hyderabad
దేశంలో డిఆర్ డిఒ అభివృద్ధి చేసిన అత్యాధునిక వేదికలు, ఆయుధ వ్యవస్థలు, సెన్సార్లు అన్నవి సాయుధ దళాల పోరాట సామర్ధ్యాలను మెరుగుపరచడానికి, వారికి సాంకేతికంగా పైచేతిని అందించడానికి తోడ్పడింది.
వివిధ సాంకేతిక విభాగాలలో ఉత్పత్తులు / వ్యవస్థలను అభివృద్ధి చేయడం కోసం డిఆర్ డిఒ ప్రాజెక్టులను చేపట్టింది. దిగువన అందులో కొన్ని ప్రాజెక్టులను పేర్కొనడం జరుగుతోందిః
క్షిపణి వ్యవస్థలు
సత్వర హెచ్చరిక& నిఘా కోసం ఉద్దేశించిన ఎయిర్‌బార్న్ విమానాలు
ఫైటర్ విమానాలు
సాయుధ పోరాట వాహనాలు (ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికిల్స్)
బ్రిడ్జింగ్ - మైనింగ్ వ్యవస్థలు
గైడెడ్ మ్యునిషన్స్
శతఘ్నులు & రాకెట్లు
చిన్న ఆయుధాలు & మందుగుండు సామాగ్రి
అత్యాధునిక టార్పెడోలు & అత్యాధునిక సోనార్ సూట్
ఎలక్ట్రానిక్ వార్ ఫేర్
లాంగ్ రేంజ్ రాడార్లు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థలు తదితరాలు
ఆర్ధిక సంవత్సరం 2021-22 రక్షణ సర్వీసుల మూలధన సముపార్జన అన్న అంశం (ఆధునీకరణ) కింద రూ. 1,11,463.21 కోట్లను కేటాయించడం జరిగింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం 2020-21 కేటాయింపులతో పోలిస్తే ఇది రూ. 21,415.41 కోట్లు (23.78%) ఎక్కువ.
ఆమోదించిన పెట్టుబడి సముపార్జన పథకం ప్రకారం, ప్రస్తుత రక్షణ సేకరణ ప్రక్రియకు అనుగుణంగా ఆధునీకరణ ప్రాజెక్టులు పురోగమిస్తున్నాయి.
ఈ సమాచారాన్ని రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ రాజ్యసభలో శ్రీమతి కాంతా కర్దమ్ అడిగిన ప్రశ్నకు ఇచ్చిన లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో వెల్లడించారు.
***
(Release ID: 1741684)
Visitor Counter : 155