సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

సామాజిక సాధికారత శిబిరంలో దివ్యాంగులకు ఏడీఐపీ పథకం కింద పరికరాలు మరియు సహాయక పరికరాలు అందజేసిన వికలాంగ వ్యక్తుల సాధికారత శాఖ

గత ఏడు సంవత్సరాలలో 10428 శిబిరాలను నిర్వహించి 20.01 లక్షల రూపాయల విలువ చేసే పరికరాలను పంపిణీ చేసిన విభాగం

ఏడీఐపీ పథకం కింద శిబిరాల నిర్వహణ, పరికరాల పంపిణీలో 10 10 గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించిన మంత్రిత్వ శాఖ

Posted On: 01 AUG 2021 6:08PM by PIB Hyderabad

రాష్ట్రీయ వయోశ్రీ యోజన కార్యక్రమంలో భాగంగా అమలవుతున్న  ఏడీఐపీ పథకం కింద దివ్యాంగులు,సీనియర్ సిటిజన్లకు అవసరమైన సహాయ పరికరాలు, సహాయాన్ని అందించడానికి అలిమ్కో, ఔరంగాబాద్ (బీహార్)  జిల్లా యంత్రాంగం సహకారంతో ఈ రోజు కేంద్ర సామజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ సామాజిక సాధికారత శిబిరాన్ని నిర్వహించింది. 

కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న  కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖల మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ శిబిరాన్నిన్యూఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు.  కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖల సహాయ మంత్రి సుశ్రీ ప్రతిమా భౌమిక్‌ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.  కార్యక్రమానికి  కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత సహాయ మంత్రి శ్రీ ఎ. నారాయణస్వామి కూడా హాజరయ్యారు . ఔరంగాబాద్ లో జరిగిన ప్రధాన కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యుడు శ్రీ సుశీల్ కుమార్ సింగ్ హాజరయ్యారు.  అయితే కరాకట్ పార్లమెంటు సభ్యుడు శ్రీ మహాబలి సింగ్ ఇతర ప్రముఖులు  వర్చువల్   విధానంలో కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ శిబిరంలో 5102 సహాయ సామాగ్రిని  మరియు 2.43 కోట్ల రూపాయల విలువ చేసే  సహాయక పరికరాలు 1521 దివ్యాంగులకు మరియు 546 సీనియర్ సిటిజన్లకు బ్లాక్/పంచాయితీ స్థాయిలలో ఉచితంగా అందజేశారు. కోవిడ్-19 ని దృష్టిలో ఉంచుకుని శాఖ రూపొందించిన ప్రణాళిక ప్రకారం శిబిరాన్ని నిర్వహించారు. 

సమావేశంలో ప్రసంగించిన శ్రీ వీరేంద్ర సింగ్ ఇటువంటి శిబిరాలను నిర్వహించడం వల్ల ప్రభుత్వ ప్రయోజనాలు నేరుగా అర్హులైన లబ్ధిదారులకు చేరుతాయని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పట్ల ప్రజలకు అవగాహన కలుగుతుందని అన్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖ గత ఏడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను మంత్రి వివరించారు. 2014 లో ప్రారంభమైన కోక్లియర్ ఇంప్లాంటేషన్ పథకం కింద  వినికిడి లోపం ఉన్న  3555 మంది  పిల్లలకు పరికరాలను అందించామని అన్నారు.  బీహార్ రాష్ట్రంలో 50 కోక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు నిర్వహించారని చెప్పారు. బీహార్‌లో ప్రభుత్వ పథకం కింద ఇటువంటి శస్త్రచికిత్సలు నిర్వహించడం కోసం ఏడు ఆసుపత్రులను గుర్తించామని తెలిపారు. బీహార్ రాష్ట్రంలో 5855 దివ్యాంగ విద్యార్థులకు 22.83 కోట్ల రూపాయలను స్కాలర్‌షిప్ విడుదల చేసారు.    బీహార్‌లోని 21 ప్రభుత్వ భవనాలను దివ్యాంగులకు  అందుబాటులోకి తీసుకురావడానికి  సుగమ్య భారత్ అభియాన్ కింద  కేంద్ర ప్రభుత్వం  9.25 కోట్ల రూపాయలను  విడుదల చేసింది. 

దేశంలో దివ్యాంగ క్రీడాకారులకు ప్రపంచ స్థాయి శిక్షణ ఇవ్వడానికి మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో కేంద్రం 171 కోట్ల రూపాయల ఖర్చుతో వికలాంగ క్రీడల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇంతేకాకుండా బీహార్ రాష్ట్రంలో 59 లక్షల గుర్తింపు కార్డులు మంజూరు చేసింది. వీటిలో బీహార్ రాష్ట్రంలో 1.39 లక్షల కార్డులను అందించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో గత ఏడు సంవత్సరాల కాలంలో పథకాల అమలులో విప్లవాత్మక మార్పులు వచ్చాయని మంత్రి అన్నారు.  గత ఏడు సంవత్సరాలలో మరియు ప్రస్తుత సంవత్సరంలో 20.01 లక్షల మంది  దివ్యాంగులకు 10428 క్యాంపుల ద్వారా 1210.67 కోట్ల రూపాయల విలువ చేసే   సహాయాలు మరియు సహాయక పరికరాలను అందించామని మంత్రి తెలిపారు.  ఏడీఐపీ పథకం కింద మంత్రిత్వ శాఖ నిర్వహించిన పంపిణీ శిబిరాల నిర్వహణలో 10 గిన్నిస్ ప్రపంచ రికార్డులను సృష్టించామని అన్నారు. 

ఈ సందర్భంగా ప్రసంగించిన కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ సహాయ మంత్రి సుశ్రీ ప్రతిమా భూమిక్  దివ్యాంగులకు   సాధికారత కల్పించడానికి  నైపుణ్య శిక్షణా కార్యక్రమంపై దృష్టి సారించాలని సూచించారు. దేశ సమగ్ర అభివృద్ధికి  దివ్యాంగులను  సమాజంలో ప్రధాన స్రవంతిలోకి తీసుకు రావాలని అన్నారు .  దివ్యాంగుల సంక్షేమానికి తమ శాఖ కట్టుబడి ఉందని పేర్కొన్న మంత్రి  దివ్యాంగుల సంక్షేమానికి అవసరమైన అన్ని రకాల సహాయాలను అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని అన్నారు.  వికలాంగుల సాధికారతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్దేశించిన లక్ష్యాల సాధనకు కృషి చేస్తామని   ఆమె అన్నారు.   సీనియర్ సిటిజన్లను గౌరవించడం మన  సంస్కృతిలో భాగమని అన్నారు. వీరి సంక్షేమానికి అన్ని చర్యలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 

   దివ్యాంగులు   మరియు సీనియర్ సిటిజన్ల సాధికారత కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలపై  కేంద్ర మంత్రికి శ్రీ మహాబలి సింగ్ కరతాత్ పార్లమెంటు సభ్యుడు కృతజ్ఞతలు తెలిపారు.

ఔరంగాబాద్ పార్లమెంటు సభ్యుడు శ్రీ సుశీల్ కుమార్ సింగ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల వల్ల  వికలాంగులకు మరియు సీనియర్లకు ప్రయోజనం కలుగుతున్నదని అన్నారు. 

సామాజిక న్యాయం  సాధికారత మంత్రిత్వ దివ్యాంగుల కోసం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను శాఖ కార్యదర్శి శ్రీమతి.  అంజలి భవ్రావివరించారు. దివ్యాంగులు   మానవ వనరులలో అంతర్భాగమనిదివ్యాంగులకు సమాజంలో ప్రధాన స్రవంతిని తీసుకువచ్చేందుకు అన్ని విధాలా సమర్థవంతమైన వాతావరణాన్ని నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె అన్నారు.

సామాజిక న్యాయం  సాధికారత మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి  డా. ప్రబోధ్ సేథ్ స్వాగతం పలికారు. 

 కోవిడ్ 19 దృష్ట్యా, గుర్తించబడిన లబ్ధిదారులకు వారి నిర్దేశిత సహాయక పరికరాలను వారి సమీపంలోని వారి బ్లాక్స్ వద్ద ఔరంగాబాద్, జిల్లాలోని తదుపరి పంపిణీ శిబిరాలలో అందిస్తారు.

బ్లాక్ స్థాయిలో గుర్తించిన లబ్ద్ధిదారులకు  1062 ట్రైసైకిల్385 వీల్‌చైర్లు936 క్రచెస్417 వాకింగ్ స్టిక్స్43 రోలేటర్లు07 స్మార్ట్ ఫోన్40 స్మార్ట్ కేన్8  బ్రెయిలీ కిట్06 సి పి  చైర్,  10 ఎడిఎల్  కిట్06 సెల్ ఫోన్873 హియరింగ్ ఎయిడ్332 కృత్రిమ అవయవాలు మరియు కాలిపర్స్505 టెట్రాపోడ్02 వాకర్62 కళ్లజోళ్లు392 డెంచర్లు మొదలైనవి అందజేయడం జరిగింది. 

దివ్యాంగులు,  సీనియర్ సిటిజన్లకు రోజువారీ జీవన విధానంలో సహాయ పడే ఉపకరణాలు మరియు ఉపకరణాలను అందించడానికి  అంగవైకల్యం కలిగిన వ్యక్తుల సహాయ పథకం  ఈ శిబిరాలు నిర్వహిస్తారు.ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా  ద్వారా ఈ శిబిరాలు నిర్వహించబడుతున్నాయి.  సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు/జిల్లాల అధికారులతో కలిసి పథకాన్ని అమలు చేస్తున్నది. 

 కోవిడ్ -19ని దృష్టిలో ఉంచుకుని  సామాజిక దూరం మరియు పరిశుభ్రత ప్రోటోకాల్‌లకు అనుగుణంగా ఈ శిబిరాన్ని నిర్వహించారు. .

అలిమ్కో సిఎండి  శ్రీ డి ఆర్ సరిన్ఔరంగాబాద్  కలెక్టర్  శ్రీ సౌరవ్ సుమన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. (Release ID: 1741359) Visitor Counter : 73