ఆయుష్

ఆయుర్వేద వైద్యానికి ప్రామాణిక చిహ్నాలు

प्रविष्टि तिथि: 30 JUL 2021 4:58PM by PIB Hyderabad

ఆయుర్వేదం, సిద్ధ మరియు యునానిల‌ అధికారిక సూత్రీకరణ, నియంత్రణ సంకలనాలను ప్రచురించడం, సవరించడం కూడా ఫార్మాకోపోయియా కమిషన్ బాధ్య‌త‌. ఈ ప్రచురించిన ప్రమాణాలు డ్రగ్స్ అండ్ కాస్మటిక్స్ యాక్ట్, 1940 మరియు రూల్స్, 1945లో భాగంగా మారాయి ఆయుర్వేదపు ముడి పదార్థాలు / ఆయా ఔషధాల నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించడం మరియు భారతదేశం అంతటా ఒకే విధంగా అమల‌వుతాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం ఆయుర్వేద ఫార్మాకోపోయియాను 645 సింగిల్ డ్రగ్స్ మరియు 203 మోనోగ్రాఫ్‌ల సమ్మేళన సూత్రీకరణలను కలిగి ఉంది దీనికి తోడు భారతదేశంలోని 986 ఆయుర్వేద ఫార్ములా సూత్రీకరణలను కలిగి ఉంది. ఆయుర్వేద ఫార్మాకోపియా ఆఫ్ ఇండియా (ఏపీఐ), సిద్ధ ఫార్మాకోపియా ఆఫ్ ఇండియా (ఎస్‌పీఐ), యునాని ఫార్మాకోపోయియా ఆఫ్ ఇండియా (యుపీఐ) మరియు హోమియోపతిక్ ఫార్మాకోపోయియా ఆఫ్ ఇండియా (హెచ్‌పీఐ)ల‌ను ప్రచురించడం మరియు సవరించడం కమిషన్ యొక్క ప్రధానమైన త‌ప్ప‌నిస‌రి అంశం. మ‌న ఆయుర్వేద, సిద్ధ, యునాని మరియు హోమియోపతిక్ ఔషధాల నాణ్యత, భద్రత మరియు సమర్థతను నిర్ధారించడానికి ఫార్మాకోపోయియల్ ప్రమాణాలు ప్రాథమికంగా ఎంతో అవసరం. ఈ సమాచారాన్ని ఆయుష్ శాఖ సహాయ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈ రోజు లోక్ సభకు ఇచ్చిన ఒక‌ లిఖితపూర్వక స‌మాధానంలో తెలిపారు.

***


(रिलीज़ आईडी: 1740906) आगंतुक पटल : 181
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , Punjabi , Tamil