ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

2.27 లక్షల మంది గర్భిణీ స్త్రీలు కోవిడ్ -19 టీకాలను ఒక నెలలోపు పొందారు


ఎన్‌టిఎజిఐ సిఫారసుల తర్వాత 2 జూలై నుండి కోవిడ్ -19 టీకా కోసం గర్భిణీ స్త్రీలు అర్హులయ్యారు

గర్భిణీ స్త్రీలకు టీకాలు వేయడం గురించి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో ఆరోగ్య కార్యకర్తలందరికీ శిక్షణలు పూర్తయ్యాయి

Posted On: 30 JUL 2021 5:44PM by PIB Hyderabad

ముమ్మరంగా కొనసాగుతున్న జాతీయ కొవిడ్ టీకా డ్రైవ్ కింద 2.27 లక్షల మంది గర్భిణీ స్త్రీలు కొవిడ్-19 వ్యాక్సిన్ మొదటి మోతాదును పొందారు. గర్భిణీ స్త్రీలకు కొవిడ్-19 సంక్రమణ ప్రమాదాలు మరియు కొవిడ్-19 టీకాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆరోగ్య కార్యకర్తలు మరియు వైద్య అధికారుల ద్వారా గర్భిణీ స్త్రీలకు క్రమం తప్పకుండా కౌన్సెలింగ్ ఇచ్చిన ఫలితంగా ఈ మార్పును గమనించవచ్చు. ఈ నిరంతర ప్రచారం గర్భిణీ స్త్రీలకు కొవిడ్ టీకా తీసుకోవడంపై సమాచారం ఇవ్వడానికి అధికారం ఇచ్చింది.

78,838 మంది గర్భిణీ స్త్రీలకు టీకాలు వేయడం ద్వారా తమిళనాడు రాష్ట్రం ముందుంది. ఆ తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ 34,228, ఒడిశా 29,821, మధ్యప్రదేశ్ 21,842, కేరళ 18,423, కర్ణాటక రాష్ట్రాలు 16,673 మంది గర్భిణీ స్త్రీలకు టీకాలు వేశాయి.

భయాలు, అపోహలు, తప్పుడు సమాచారం మరియు కొన్ని సామాజిక నిషేధాలు మరియు సమస్యలను తొలగించే ప్రచారంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు కోవిడ్ టీకా కార్యక్రమాన్ని నిర్వహించడానికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సహాయపడే మార్గదర్శకాలను 2 జూలై 2021 న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గర్భధారణ సమయంలో కొవిడ్-19 టీకా యొక్క ప్రాముఖ్యత గురించి ప్రసూతి సంరక్షణ సమయంలో గర్భిణీ స్త్రీలు మరియు వారి కుటుంబ సభ్యులకు సలహా ఇవ్వడానికి ప్రోగ్రాం మేనేజర్లు, సర్వీసు ప్రొవైడర్లు మరియు ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఇది జరిగింది. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు గర్భిణీ స్త్రీలకు కోవిడ్ టీకాకు సంబంధించి ప్రభుత్వ మరియు ప్రైవేట్ కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలలో (సివిసిలు) తమ టీకా బృందాలను మరింత చైతన్యపరిచాయి.

గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక టీకా సెషన్ల వంటి గర్భిణీ స్త్రీలను టీకా కోసం ప్రోత్సహించడానికి రాష్ట్రాలు అనేక కార్యక్రమాలు చేపట్టాయి. యాంటెనాటల్ క్లినిక్‌లలో ఫ్రంట్‌లైన్ కార్మికులు మరియు కౌన్సిలర్లచే అర్హత పొందిన లబ్ధిదారులకు కౌన్సెలింగ్ ఇవ్వడం టీకాల కోసం ఆశాలను సమీకరించడం మరియు గర్భిణీలకు డిప్యూటీ కమిషనర్ సర్టిఫికేట్ జారీ చేయడం వంటి వినూత్న పద్ధతులు మరియు తమను తాము టీకాలు వేసుకున్న చనుబాలివ్వడం మహిళలకు విశ్వాసం మరియు అంగీకారం పెంపొందించడానికి కారణమయ్యాయి.

గర్భధారణ సమయంలో కొవిడ్-19 సంక్రమణ వలన గర్భిణీ స్త్రీల ఆరోగ్యం వేగంగా క్షీణిస్తుంది. తీవ్రమైన వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇది పిండంపై కూడా ప్రభావం చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కొవిడ్-19 సోకిన గర్భిణీ స్త్రీలకు ముందస్తుగా కాన్పు అవడం మరియు ఇతర ప్రతికూల గర్భధారణ ఫలితాలకు ఎక్కువ అవకాశం ఉంది. ఇందులో నియోనాటల్ అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు గర్భంలో తీవ్రమైన సమస్యలకు కొవిడ్-19 కి కారకాలుగా అప్పటికే ఉన్న అనారోగ్యాలు,  తల్లి వయస్సు మరియు అధిక బరువు వంటివి కూడా హైలైట్ చేసారు.

గర్భిణీ స్త్రీలకు టీకా వేయాలని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టిఎజిఐ) సిఫారసు చేసింది. ఇది గర్భిణీ స్త్రీలను భారతదేశంలోని కోవిడ్ టీకా డ్రైవ్‌లో చేర్చడానికి దారితీసింది. నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ కోవిడ్ -19 (ఎన్‌ఇజివిఎసి) దీనిని ముందుగా ఏకగ్రీవంగా సిఫార్సు చేసింది. అదనంగా, గర్భిణీ స్త్రీలకు కొవిడ్ టీకాపై జాతీయ స్థాయి సంప్రదింపులు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సమావేశమై గర్భిణీ స్త్రీలకు కొవిడ్ టీకాపై ఏకాభిప్రాయం తీసుకుంది. పాగ్సి, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, సిఎస్‌ఓలు, ఎన్జీవోలు, డెవలప్‌మెంట్ పార్ట్‌నర్ ఏజెన్సీలు, సాంకేతిక నిపుణులు మొదలైన ప్రొఫెషనల్ సంస్థలు ఈ సంప్రదింపులలో పాల్గొన్నాయి. గర్భిణీ స్త్రీలకు టీకాలు వేయాలని ఎన్‌టిజిఐ చేసిన సిఫారసును ఏకగ్రీవంగా స్వాగతించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు /కేంద్రపాలిత ప్రాంతాలు మరియు ఇతర వాటాదారుల సమిష్టి కృషి గర్భిణీ స్త్రీలు మరియు వారి కుటుంబాలపై విశ్వాసం పెంపొందించడానికి కొవిడ్-19 టీకాలు ఎక్కువగా తీసుకోవడంలో సహాయపడుతుంది.  తద్వారా కొవిడ్-19 సంక్రమణ ప్రమాదం నుండి తల్లీబిడ్డలను
 రక్షించడంలో సహాయపడుతుంది.


 

***


(Release ID: 1740901) Visitor Counter : 476