యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

ఒలింపిక్స్ మరియు ఆసియా క్రీడలు లాంటి అంతర్జాతీయ క్రీడల పోటీల్లో భారత ప్రదర్శన మెరుగుపడేలా చూడడానికి ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది: శ్రీ అనురాగ్ ఠాకూర్

Posted On: 29 JUL 2021 4:25PM by PIB Hyderabad

ప్రధాన ముఖ్య అంశాలు : 

దేశం వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే 24 ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభం అయ్యాయి. 

* అంతర్జాతీయ పోటీలలో పాల్గొడానికి క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడానికి మరియు పోటీతత్వాన్ని అలవర్చడానికి జాతీయ క్రీడల సమాఖ్యకు సహకారం అందించడానికి ప్రత్యేక పథకం 

* టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (TOPS) కింద ఒలింపిక్ క్రీడలు మరియు ఆసియా క్రీడల్లో పతకాలను సాధించే అవకాశాలు ఉన్నవారికి ప్రత్యేక శిక్షణ 

*పేదరికంలో నివసిస్తున్న క్రీడాకారులకుమరణించిన క్రీడాకారుల కుటుంబాలకు  పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ నేషనల్ వెల్ఫేర్ ఫండ్ నుంచి లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. 

ఒలింపిక్స్ మరియు ఆసియా క్రీడలు లాంటి  అంతర్జాతీయ క్రీడా  కార్యక్రమాల సన్నాహాక కార్యక్రమాలు నిరంతర ప్రక్రియగా సాగుతుంటాయి.  ఒలింపిక్స్‌తో సహా అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలకు సిద్ధమవుతున్న క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి వారిలో పోటీతత్వాన్ని నింపడానికి   జాతీయ క్రీడా సమాఖ్య లకు సహాయం అందించే కార్యక్రమం ద్వారా అమలు జరుగుతుంది.   పథకం  ఈ  కింది కార్యక్రమాలు వస్తాయి. 

 - భారతదేశం మరియు విదేశాల్లో శిక్షణా శిబిరాలు 

 -అంతర్జాతీయ పోటీలకు  సిద్ధం చేయడం 

 - భారత మరియు విదేశీ కోచ్‌లు, సహాయక సిబ్బందిని నియమించడం

 - శిక్షణ పరికరాలు  - భారతదేశంలో జాతీయ మరియు అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌ పోటీలను నిర్వహించడం 

 - గాయాలకు వైద్య బీమా

 ఒలింపిక్ క్రీడలు మరియు ఆసియా క్రీడలతో సహా అన్ని అంతర్జాతీయ పోటీలలో పతకాలను సాధించే అవకాశాలు ఉన్న క్రీడాకారులకు టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (TOPS) కింద శిక్షణ ఇవ్వడానికి జాతీయ టోర్నమెంట్ డెవలప్‌మెంట్ ఫండ్  కింద సహాయం  అందించబడుతుంది.

టోక్యో 2020 ఒలింపిక్ క్రీడలకు భారత బృంద సన్నాహాలను పర్యవేక్షించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కోవిడ్ -19 రెండవ దశ  సమయంలో క్రీడాకారులు కోవిడ్ బారిన పడకుండా శిక్షణ కొనసాగించడానికి అనేక మంది అథ్లెట్లను శిక్షణ కోసం విదేశాలకు పంపడం జరిగింది.  టోక్యో   ఒలింపిక్ క్రీడలకు ఎంపిక అయిన వారు  సామాజిక దూరం పాటిస్తూ    శిక్షణా శిబిరాల్లో శిక్షణ పొందారు.

'క్రీడలురాష్ట్రాల పరిధిలోకి వచ్చే అంశం.   అంతర్జాతీయ ప్రమాణాలతో  క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి చేసి అందుబాటులోకి తేవడం  రాష్ట్ర ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత.  అయితే,  ముఖ్యమైన  క్రీడా మౌలిక సదుపాయాలు మరియు ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు  ‘ఖేలో ఇండియా’ పథకం కింద కేంద్ర ప్రభుత్వం  ఆర్థిక సహాయం అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు/ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అందిన ప్రతిపాదనల మేరకు ఈ సౌకర్యాన్ని అందించడం జరుగుతుంది. 

 

 ప్రధాన అంతర్జాతీయ పోటీల్లో  పాల్గొనడానికి సిద్ధమవుతున్న క్రీడాకారుల శిక్షణ  తగిన సౌకర్యాలు ఉన్నభారత క్రీడల సమాఖ్య కేంద్రాల్లో జరుగుతుంది. అంతేకాకుండా, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణలో ఉన్న కేంద్రాల్లో సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఒక కేంద్రాన్ని  ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా ప్రకటించటానికి ప్రతి రాష్ట్రానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇలా గుర్తించిన కేంద్రంలో సిబ్బంది నియామకం, క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సహాయం అందించబడుతుంది.   ఇటువంటి 24 కేంద్రాలు ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి.

 

ప్రతిభ  కనబరిచిన క్రీడాకారులకు  ఆర్థిక భద్రత కల్పించడం కోసం యువజన  వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ  పెన్షన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఒలింపిక్ క్రీడలు మరియు ఆసియా క్రీడలలో నిర్వహించే అంశాలలో   ఒలింపిక్ క్రీడలు, పారా-ఒలింపిక్ క్రీడలు, ఆసియా క్రీడలు, పారా ఆసియా ఆటలు, కామన్వెల్త్ క్రీడలు మరియు ప్రపంచ కప్ / ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో పతకాలను సాధించిన క్రీడాకారులకు ఇస్తున్న  జీవితకాల పింఛను నెలకు   12,000 రూపాయల  నుంచి  20,000 పెంచడం జరిగింది. వారు క్రియాశీల క్రీడల నుంచి తప్పుకున్న  తర్వాత లేదా 30 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత ఏది అంతకు ముందు నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. 

క్రీడాకారుల కోసం పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ జాతీయ సంక్షేమ నిధి పథకాన్ని కూడా మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది.  దీని కింద పేదరికంలో  నివసిస్తున్న క్రీడాకారులకుమరణించిన క్రీడాకారుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం  అందించబడుతుంది.  ఇంకా శిక్షణ మరియు క్రీడా పోటీలలో పాల్గొన్నప్పుడు గాయపడిన  క్రీడాకారులకు లేదా కుటుంబ సభ్యుల వైద్య చికిత్స కోసం 10 లక్షల రూపాయల వరకు ఆర్ధిక సహకారం అందించడం జరుగుతుంది. శిక్షణ, పరికరాల సేకరణ మరియు జాతీయ మరియు అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలలో పాల్గొనడం కోసం  2.5 లక్షల రూపాయలు,కోచ్‌లు మరియు సహాయక సిబ్బందికి రెండు లక్షల రూపాయలు.  కోచ్‌లు, సహాయక సిబ్బంది వైద్య చికిత్స కోసం నాలుగు లక్షల రూపాయలను  పైన పేర్కొన్న ఫండ్ నుంచి అందించబడుతుంది.

 

 ఈ సమాచారాన్ని యువజన వ్యవహారాలు మరియు క్రీడా శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ఈ రోజు లోక్ సభలో లిఖితపూర్వక సమాధానంలో ఇచ్చారు.

***



(Release ID: 1740460) Visitor Counter : 265