మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

వికలాంగ పిల్లలకు డిజిటల్ విద్యా వనరులు

Posted On: 29 JUL 2021 3:06PM by PIB Hyderabad

దివ్యాంగ చిన్నారుల కోసం డిజిటల్ వనరులను ఉత్పత్తి చేయడానికి, ఈ–పాఠ్యాంశాల అభివృద్ధి చేయడానికి తగిన మార్గదర్శకాలను జూన్ 8, 2021 న జారీ చేశారు. వివరాలను ఈ లింకు ద్వారా చూడవచ్చు.  https://www.education.gov.in/sites/upload_files/ mhrd / files / CWSN_E-Content_guidelines.pdf

 

మార్గదర్శకాలు ఈ క్రింది వాటిని సిఫార్సు చేశాయి:

విద్యార్థుల అభ్యాస అవసరాలను తీర్చడానికి యుడిఎల్ సూత్రాల ఆధారంగా యాక్సెస్ చేయగల డిజిటల్ పాఠ్యపుస్తకాలు

 

చెవిటి విద్యార్థుల కోసం సంజ్ఞల వీడియోలు

 

అనుబంధ ఈ–కంటెంట్... -ఇది పైన 1, 2 మినహా ఇతర రకాల ఈ–-కంటెంట్లను కలిగి ఉంటుంది.

 

రోజువారీ జీవితంలో వ్యక్తిగత సమర్ధతకు సంబంధించిన నైపుణ్యాలపై ప్రధాన దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే కమ్యూనికేషన్  భాష, అక్షరాస్యత,  సాధారణ అంకగణిత నైపుణ్యాలు, స్వీయ-అవగాహన, తన  ఇతరుల భావోద్వేగ అవసరాలు తెలుసుకోవడం, స్వీయ-అవగాహన, స్వీయ- క్రమశిక్షణ,  తగిన సామాజిక ప్రవర్తన, శారీరక  సామాజిక వాతావరణం గురించి అవగాహన, సైకో-మోటార్ సమన్వయం, అభిజ్ఞా విధులు, వృత్తి / ఉపాధి సంబంధిత నైపుణ్యాలు, ఆసక్తి / అభిరుచి గల ప్రాంతాల్లో అభివృద్ధి మొదలైనవి విద్యార్థులకు చాలా ముఖ్యం.

 

ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా పీఎమ్ ఈ–వైద్య ప్రోగ్రామ్ ను గత మే17న ప్రారంభించారు.  డిజిటల్ / ఆన్-ఎయిర్ విద్యకు సంబంధించిన ప్రయత్నాలను ఇది ఏకీకృతం చేస్తుంది. బధిరుల కోసం, అంధుల కోసం ఈ–-కంటెంట్ అభివృద్ధి చేస్తారు. రేడియో, కమ్యూనిటీ రేడియో,  పాడ్‌కాస్ట్‌లను వినిపిస్తారు.  దీక్షా పోర్టల్‌లో 1 నుండి 12 తరగతులకు క్యూఆర్ కోడెడ్ ఎనర్జైజ్డ్ డిజిటల్ పాఠ్యపుస్తకాలను అప్‌లోడ్ చేస్తారు. వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఐఎస్ఎల్లో డీటీహెచ్ ఛానెల్ కూడా ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు.ఈ సమాచారాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ గురువారం రాజ్యసభలో లిఖితపూర్వకంగా తెలిపారు. 

 

***

 


(Release ID: 1740351) Visitor Counter : 125


Read this release in: English , Urdu , Marathi , Punjabi