ఆయుష్

కొవిడ్-19 చికిత్స ప్రోటోకాల్ పై ఎన్ఐసిఈ అనే నెట్‌వర్క్ చేసిన నిరాధార ప్రస్తావనలను తీవ్రంగా ఖండించిన ఆయుష్ మంత్రిత్వ శాఖ

Posted On: 29 JUL 2021 10:56AM by PIB Hyderabad

నేచురోపతికి సంబంధించిన  నెట్‌వర్క్  ఎన్ఐసిఈ  (ఇన్ఫ్లుఎంజా కేర్ నిపుణుల నెట్ వర్క్) కొన్ని తప్పుదారి పట్టించే ప్రస్తావనలు చేసింది. వాటిని కొన్ని మీడియాల్లో ధ్రువీకరణ చేసుకోకుండానే ప్రచురించారు. వీటిలో ప్రధానమైనది కోవిడ్-19 చికిత్స ప్రోటోకాల్ ని రూపొందించే విషయం, దానిని ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆమోదించడానికి సంబంధించినది. అనైతికంగా, తప్పుదోవ పట్టించేలా ఈ అంశాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖకు ఆపాదించారు. ఎన్ఐసిఈ చేసిన ప్రస్తావనలను ఆయుష్ తీవ్రంగా ఖండిస్తోంది. అలాగే వాటిని పూర్తిగా నిరాధారంగా, తప్పుదోవ పట్టించేలా వార్తలు ప్రచురించారని ఆయుష్ మంత్రిత్వ శాఖ భావిస్తుంది.   

ఆ ఏజెన్సీ,  ఎన్ఐసిఈ,  ప్రోటోకాల్ అని పిలవబడే దరఖాస్తును తమకు సమర్పించలేదని ఆయుష్ మంత్రిత్వ శాఖ మరింత స్పష్టం చేసింది. కోవిడ్-19 చికిత్స / నిర్వహణకు సంబంధించిన ఏదైనా ప్రతిపాదనను  ఎన్ఐసిఈ  ద్వారా మంత్రిత్వ శాఖకు సమర్పించినట్లయితే, దానిని ఇంటర్ డిసిప్లినరీ టెక్నికల్ రివ్యూ కమిటీ (ఐటిఆర్సి) పూర్తిగా పరిశీలిస్తుంది .ఇటువంటి ధ్రువీకరణ కోసం కమిటీ బాగా సువ్యవస్థిత, కఠినమైన శాస్త్రీయ స్క్రీనింగ్ ప్రక్రియను కలిగి ఉంది. ఈ కమిటీ ఆమోదం లేకుండా, ఆయుష్ స్ట్రీమ్స్ సంబంధిత ఏజెన్సీ ప్రోటోకాల్‌ను అభివృద్ధి చేసినట్లు చెప్పలేము. కోవిడ్-19 చికిత్స కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆమోదించిన ప్రకృతివైద్య-ఆధారిత ప్రోటోకాల్‌ను అభివృద్ధి చేసినట్లు పేర్కొనడంలో  ఎన్ఐసిఈ చాలా అనైతికమైన, చట్టవిరుద్ధమైన మరియు నిరాధారమైన చర్యలకు పాల్పడింది.  మంత్రిత్వ శాఖ స్పష్టమైన అనుమతి లేకుండా మంత్రిత్వ శాఖ పేరును ఉపయోగించడం కూడా అంతే తీవ్రమైనది.

తప్పుడు వాదనలకు పాల్పడిన ఎన్ఐసిఈ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2020 మార్చి 24 నాటి ఆర్డర్ నంబర్- 40-3 / 2020-DM-II (A), మార్చి 24, 2020 నాటి 1-29 / 2020-pp (Pt II), జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్డీఎంఏ) ఆదేశాల ప్రకారం శిక్షార్హమైన నేరానికి ఒడిగట్టింది.  తప్పుడు వాదనలు శిక్షార్హమైనవని సూచించే ఈ ఉత్తర్వులు దేశంలో వ్యాప్తి చెందుతున్న కోవిడ్-19 ని కట్టడి చేస్తాయి. కొన్ని మీడియా సంస్థలు ఆయుష్ మంత్రిత్వ శాఖ నుండి వాస్తవాలను ధృవీకరించకుండా ఎన్ఐసిఈ  చేసిన తప్పుడు వాదనను ప్రచురించాయి.

నెట్‌వర్క్ ఆఫ్ ఇన్‌ఫ్లుఎంజా కేర్ ఎక్స్‌పర్ట్ (ఎన్ఐసిఈ) పెద్ద ఎత్తున తప్పుదోవ పట్టించే కొన్ని వాదనలు చేసిందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి (ఎన్ఐఎన్) పూణే స్పష్టంగా తెలిపింది. కోవిడ్-19 నిర్వహణ / చికిత్సకు సంబంధించిన దావా ఇది. ఆయుష్ మంత్రిత్వ శాఖ, తన ప్రోటోకాల్ ఆమోదాన్ని ఎన్ఐసిఈ తప్పుగా పేర్కొంది.

నిర్వహణ, చికిత్స మరియు నివారణ కోసం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటమే కాదు, కోవిడ్-19 ఐఇసి, వివిధ కార్యకలాపాల ద్వారా ఈ మార్గదర్శకాలను ప్రోత్సహిస్తుందని ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎన్ఐఎన్, పూణే, స్థానిక మీడియాలో ఇప్పటికే స్పష్టం చేసింది. 

****



(Release ID: 1740235) Visitor Counter : 179