సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

వెనుకబడిన తరగతులను గుర్తింపు మ‌రియు జాబితా త‌యారీ హక్కు

प्रविष्टि तिथि: 28 JUL 2021 3:44PM by PIB Hyderabad

రాజ్యాంగ (వంద మరియు రెండవ) సవరణ చట్టం 2018 భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 342-ఎ సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన ఆయా తరగతుల కేంద్ర జాబితాకు సంబంధించిన.. (ఎస్ఈబీసీలు - సాధారణంగా ఇతర వెనుకబడిన తరగతులు - ఓబీసీలు) అధికారాన్ని ఇచ్చింది. ఒక నిర్దిష్ట రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి ఎస్ఈబీసీల కేంద్ర జాబితాను పేర్కొనడానికి రాష్ట్రపతికి అధికారాన్ని ఇచ్చింది. దీనికి తోడు ఎస్ఈబీసీల‌ (ఓబీసీ) కేంద్ర జాబితాలో ఏదైనా సవరణ ఉంటే దానిని పార్లమెంటు ద్వారా మాత్రమే చేయవచ్చు. గౌరవ సుప్రీంకోర్టు డ‌బ్ల్యు.పి. 938/2020, 5° మే 2021న, రాజ్యాంగం (వంద మరియు రెండవ) సవరణ చట్టం 2018ను వ్యాఖ్యానించింది మరియు రాష్ట్రపతి పేర్కొన్న జాబితా రాజ్యాంగంలోని అన్ని ప్రయోజనాల కోసం ఎస్ఈబీసీల (ఓబీసీలు) యొక్క ఒకే జాబితాగా మాత్ర‌మే ఉండాలని ఆదేశించింది. ప్రతి రాష్ట్ర మరియు కేంద్రపాలిత ప్రాంతానికి వారి ఎస్ఈబీసీల‌ జాబితాను ప్రచురించే అధికారం రాష్ట్రాలకు లేదు. సవరణ అమలుకు ముందు పార్లమెంటులో జరిగిన చర్చ ప్రతిబింబించే విధంగా గౌరవనీయమైన సుప్రీంకోర్టు యొక్క పై తీర్పు.. శాసన ఉద్దేశాన్ని త‌న‌ పరిగణనలోకి తీసుకోలేదు, ఇక్కడ ఈ సవరణ గుర్తించడానికి మరియు రాష్ట్రాల అధికారాలకు ఆటంకం కలిగించదని నిస్సందేహంగా ప్రకటించబడింది. అందువల్ల తీర్పును పునఃపరిశీలించాల‌ని ఒక సమీక్ష పిటిషన్ కూడా దాఖలైంది, కాని అది కొట్టివేయబడింది. ప్రభుత్వం న్యాయ నిపుణులు, న్యాయ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతోంది మరియు ఆయా రాష్ట్రాల కొరకు ఓబీసీల యొక్క రాష్ట్ర జాబితాను నిర్ణయించడంలో రాష్ట్రాల శక్తిని కాపాడే మార్గాలను పరిశీలిస్తోంది. ఈ సమాచారాన్ని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ ఈ రోజు రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

***


(रिलीज़ आईडी: 1740120) आगंतुक पटल : 232
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , Bengali