గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
కొత్త నగరాల పొదుగుదల కోసం రాష్ట్రాలకు రూ.8,000 కోట్ల మేర పనితీరు ఆధారిత ఛాలెంజ్ ఫండ్‌ను సిఫారసు చేసిన ఆర్థిక కమిషన్
प्रविष्टि तिथि:
28 JUL 2021 3:03PM by PIB Hyderabad
15వ ఆర్థిక కమిషన్ భారత ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో కొత్త నగరాల పొదుగుదలకు గాను రాష్ట్రాలకు రూ.8000 కోట్ల పనితీరు ఆధారిత ఛాలెంజ్ ఫండ్‌ను సిఫారసు చేసింది. దీంతో ప్రతి ప్రతిపాదిత కొత్త నగరానికి మొత్తంగా.. రూ.1,000 కోట్లు అందుబాటుకి వస్తాయి. ఈ కొత్త ప్రతిపాదిత పథకం కింద ఒక రాష్ట్రానికి ఒకే ఒక కొత్త నగరంను మాత్రమే పరిగణనలోకి తీసుకోంటారు. ఈ విధంగా కమిషన్ అవార్డు వ్యవధిలో ఎనిమిది కొత్త నగరాలకు.. గరిష్టంగా ఎనిమిది రాష్ట్రాలు ఈ మంజూరును పొందవచ్చు. అంతే కాకుండా జూన్ 25, 2015న ప్రారంభించిన స్మార్ట్ సిటీస్ మిషన్‌లో ఏరియా బేస్డ్ డెవలప్‌మెంట్ కీలకమైన వ్యూహాత్మక భాగంగా నిలుస్తుంది. ప్రాంత ఆధారిత అభివృద్ధి మోడళ్లలో నగరం మెరుగుదల (రెట్రోఫిటింగ్), నగరం పునరుద్ధరణ (పునరాభివృద్ధి) మరియు / లేదా నగర పొడిగింపు (గ్రీన్‌ఫీల్డ్ అభివృద్ధి) ఉన్నాయి. జనవరి 2016 నుండి జూన్ 2018 మధ్య నిర్వహించిన 4 రౌండ్ల పోటీలలో మొత్తం 100 నగరాలు స్మార్ట్ సిటీలుగా అభివృద్ధికి ఎంపిక చేయబడ్డాయి. గ్రీన్ ఫీల్డ్ అభివృద్ధి లేదా ఎంపిక చేసుకున్ననమూనాల కలయికల కోసం ఎంచుకున్న స్మార్ట్ సిటీల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
|
రాష్ట్రం
|
స్మార్ట్‌సిటీ
|
ఏబీడీ కాంపొనెంన్ట్
|
|
జార్ఖండ్
|
రాంచి
|
గ్రీన్‌ఫీల్డ్
|
|
మహారాష్ట్ర
|
ఔరంగాబాద్
|
గ్రీన్‌ఫీల్డ్
|
|
గుజరాత్
|
రాజ్‌కోట్
|
గ్రీన్‌ఫీల్డ్
|
|
ఆంధ్రప్రదేశ్
|
అమరావతి
|
గ్రీన్‌ఫీల్డ్
|
|
మధ్యప్రదేశ్
|
సతనా
|
గ్రీన్‌ఫీల్డ్
|
|
పశ్చిమ బెంగాల్
|
న్యూ టౌన్ కోల్‌కతా
|
రెట్రోఫిట్టింగ్ + గ్రీన్‌ఫీల్డ్
|
|
మహారాష్ట్ర
|
నాసిక్
|
రెట్రోఫిట్టింగ్ + గ్రీన్‌ఫీల్డ్
|
|
ఛత్తీస్‌గఢ్
|
అటల్ నగర్
|
నగరం పునరుద్ధరణ (పునరాభివృద్ధి)+గ్రీన్‌ఫీల్డ్
|
ఈ సమాచారాన్ని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ కౌషల్ కిషోర్ ఈ రోజు రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
*****
(रिलीज़ आईडी: 1740034)
आगंतुक पटल : 254