సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఎడారీకరణను నిరోధించి, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థకు మద్దతు నిచ్చేందుకు కెవిఐసి, బిఎస్ఎఫ్ చే జైసల్మేర్‌లో బోల్డ్ కార్యక్రమం ప్రారంభం.
Posted On:
28 JUL 2021 12:48PM by PIB Hyderabad
రాజస్థాన్‌లోని ఎడారి ప్రాంతాన్ని హరితమయం చేసేందుకు ఉద్దేశించిన ఈ తరహా మొట్టమొదటి కార్యక్రమాన్ని ఖాదీవిలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కెవిఐసి) సరిహద్దు భద్రతాదళం సహకారంతో మంగళవారం నాడు చేపట్టింది. ఇందులో భాగంగా జైసల్మేర్‌లోని టనోట్ గ్రామంలో వెయ్యి వెదురు మొక్కలు నాటారు.కెవిఐసి ఛైర్మన్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని బిఎస్ఎఫ్ స్పెషల్ డిజి (పశ్చిమ కమాండ్) శ్రీ సురేంద్ర పవార్ సమక్షంలో ప్రారంభించారు. ఈ వెదురు మొక్కలునాటే కార్యక్రమాన్ని కెవిఐసి ప్రాజెక్టు అయిన బోల్డ్ ( బ్యాంబూ ఒయాసిస్ ఆన్ ల్యాండ్స్ ఇన్ డ్రాట్)లో భాగంగా నాటారు. ఇది ఎడారీ కరణను నిరోధించడం, గ్రామీణ ప్రజలకు జీవనోపాధిని కల్పించడానికి మద్దతు నిచ్చే జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా దీనిని చేపట్టారు.
వెదురు మొక్కలను తనోత్ గ్రామ పంచాయతికి చెందిన 2.50 లక్షల చదరపు అడుగుల స్థలంలో నాటడం జరిగింది .ఇది భారత పాక్ సరిహద్దు ప్రాంతానికి దగ్గరలోని తనోత్ మాతా ఆలయానికి దగ్గరలొ ఉంది. జైసల్మేర్ సిటీకి ఇది 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. తనోత్ రాజస్థాన్ లో అత్యంత ఎక్కువమంది పర్యాటకులు దర్శించే స్థలం. కెవిఐసి తనోత్ వద్ద వెదురు ఆధారిత మొక్కలు నాటడం ద్వారా ఆ ప్రాంతాన్ని హరితమయం చేసి పర్యాటకులకు ఆకర్షణీయ ప్రాంతంగా తీర్చిదిద్దుతోంది. ఈ మొక్కలను నిర్వహించే బాధ్యత బిఎస్ఎఫ్ ది.
ప్రాజెక్ట్ బోల్డ్‌ను జూలై 4న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లా నిచ్‌ల మనడ్వా గిరిజన గ్రామం నుంచి ప్రారంభించింది. ఇక్కడ 25 బిఘాల భూమిలో 5వేల ప్రత్యేక వెదురు మొక్కలు నాటారు. భూసారాక్షీణతను నిరోధించడం, దేశంలో ఏడారీకరణను తగ్గించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కెవిఐసి వారి ఖాదీ బ్యాంబూ ఫెస్టివల్ లో భాగంగ అలాగే 75 సంవత్సరాల స్వాతంత్ర్యదినోత్సవాలైన ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా దీనిని చేపట్టడం జరిగింది.
జైసల్మేర్ ఎడారి ప్రాంతంలో వెదురు మొక్కలు నాటడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని కెవిఐసి ఛైర్మన్ తెలిపారు.అంటే ఎడారీకరణను నిరోధించడం, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి నమూనాను చేపట్టడం ఇందులో ఉన్నాయి. గ్రామీణ, వెదురు ఆధారిత పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా వాటికి మద్దతునిస్తొంది.
రాగల మూడు సంవత్సరాలలో, ఈ వెదురు మొక్కలు కోతకు వస్తాయి. ఇది స్థానిక గ్రామస్థులకు ఆదయ వనరుగా ఉంటుంది. కెవిఐసి పర్యాటక ప్రాంతాన్ని హరితమయం చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. ఎక్కువమంది పర్యాటకులు వచ్చే తనోత్‌మాతా ఆలయం,లోంగోవాలా పోస్ట్ వద్ద హరిత మయం చేసే కార్యక్రమాలు చేపడుతున్నట్టు శ్రీ సక్సేనా తెలిపారు. తక్కువ సమయంలోఈ ప్రాజెక్టును అమలు చేయడంలో బిఎస్ఎఫ్ అందిస్తున్నమద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
రాగల 3 సంవత్సరాలలో వెయ్యి వెదురు మొక్కలు,మరెన్నోరెట్లు పెరగి 4000 వెదురు మొక్కలుగా విస్తరించి సుమారు 100 మెట్రిక్‌టన్నుల వెదురు ను అందించనుంది. ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం వెదురు టన్నుకు 5000 రూపాయలు లభిస్తున్నది.
ఈ వెదురు ఉత్పత్తి వల్ల మూడు సంవత్సరాల తర్వాత 5 లక్షల రూపాయలు రాబడి లభించడంతోపాటు ఆతర్వాత ప్రతి సంవత్సరం రాబడి వస్తుంది.ఇది స్థానికులకు ఆదాయ వనరుగా ఉంటుంది.వెదురును అగర్‌బత్తీలలో వాడే పుల్లలకు, ఫర్నిచర్, కళారూపాలు, వాద్య పరికరాలు, పేపర్. పల్ప్‌ను వాడేందుకు వాడుతారు.అలాగే వెదురు వ్యర్థాలను చార్‌కోల్ తయారీ, ఇంధనంగా కూడా వాడుతారు. వెదురు నీటిని పొదుపుగా వాడుకుంటుంది. అందువల్ల కరువుపీడిత ప్రాంతాలలో,పొడి నేలల్లో నాటడానికి పనికివస్తుంది.
***
(Release ID: 1740027)
Visitor Counter : 295