ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఆర్థిక పరిస్థితిలో పురోగతి
Posted On:
28 JUL 2021 1:22PM by PIB Hyderabad
జాతీయ గణాంకాల కార్యాలయం వద్ద ఉన్న తాజా సమాచారం ప్రకారం, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రస్తుత ధరల వద్ద (ప్రామాణిక సంవత్సరం 2011-12) తలసరి "నికర రాష్ట్ర దేశీయ ఉత్పత్తి" (ఎన్‌ఎస్‌డీపీ) గత ఐదేళ్లలో పెరిగింది. 2015-16 నుంచి 2019-20 వరకు, రాష్ట్రాల వారీగా ప్రస్తుత ధరల వద్ద ఎన్‌ఎస్‌డీపీ వివరాలు ఈ క్రింది పట్టికలో ఉన్నాయి:
పట్టిక: ప్రస్తుత ధరల వద్ద తలసరి నికర రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (ఎన్‌ఎస్‌డీపీ) (ప్రామాణిక సంవత్సరం 2011-12) (రూపాయల్లో)
రాష్ట్రం
|
2015-16
|
2016-17
|
2017-18
|
2018-19
|
2019-20
|
అరుణాచల్‌ప్రదేశ్
|
116985
|
123744
|
139029
|
149634
|
164615
|
అసోం
|
60817
|
66330
|
75151
|
82837
|
90758
|
మణిపూర్
|
55447
|
59345
|
71507
|
75229
|
84746
|
మేఘాలయ
|
68836
|
73753
|
77504
|
84725
|
92175
|
మిజోరం
|
114055
|
127107
|
155222
|
176620
|
204018
|
నాగాలాండ్
|
82466
|
91347
|
102003
|
117691
|
130230
|
సిక్కిం
|
245987
|
280729
|
349163
|
380926
|
425656
|
త్రిపుర
|
84267
|
91596
|
100444
|
112849
|
125191
|
సమాచారం: జాతీయ గణాంకాల కార్యాలయం, కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ
ఈశాన్య ప్రాంతంలో రైలు, రహదారి, వాయు మార్గాల అనుసంధానం, టెలీకమ్యూనికేషన్, విద్యుత్, అంతర్గత జలమార్గాల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు, ప్రాజెక్టులను అమలు చేసింది. నీటి సరఫరా, విద్యుత్, అనుసంధానం, ముఖ్యంగా విద్య, ఆరోగ్యం అంశాల్లో ప్రాథమిక, ద్వితీయ రంగాల్లో మౌలిక సదుపాయాలను సృష్టించే పర్యాటక, సామాజిక రంగాలకు సంబంధించి, భౌతిక మౌలిక సదుపాయాల్లో చాలా ప్రాజెక్టులను ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కూడా అమలు చేసింది.
కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి.కిషన్‌రెడ్డి ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా ఇవాళ లోక్‌సభకు సమర్పించారు.
*****
(Release ID: 1739942)
Visitor Counter : 173