వ్యవసాయ మంత్రిత్వ శాఖ
పిఎం-కిసాన్ స్కీమ్ లావాదేవీలు
Posted On:
27 JUL 2021 6:55PM by PIB Hyderabad
పిఎం-కిసాన్ స్కీమ్ కింద మూడు లేదా నాలుగు నెలల విరామాల్లో లబ్ధిదారులకు ప్రయోజనం బదిలీ చేస్తారు. ప్రతీ నాలుగు నెలలకు ఒక సారి అర్హులైన రైతులందరికీ రూ.2000/- బదిలీ చేస్తారు. అంటే వార్షికంగా రూ.6000/- ఒక్కో రైతుకు అందుతుంది.
పిఎం-కిసాన్ స్కీమ్ కిందీ ప్రయోజనం ప్రతీ నెల అందించవచ్చు. దానికి బదులుగా మూడు వాయిదాల్లో ఆ ప్రయోజనం అందిస్తున్నారు. 2021 జూన్ వరకు పిఎం-కిసాన్ స్కీమ్ కింద విఫలమైన లావాదేవీలు 40,16,867 కాగా పూర్తి చేసిన లావాదేవీల సంఖ్య 68,76,32,104. అంటే మొత్తం లావాదేవీల్లో విఫలమైన లావాదేవీలు 1% కన్నా తక్కువే ఉన్నాయి.
పిఎం-కిసాన్ స్కీమ్ కింద లావాదేవీలు విఫలం కావడానికి పలు కారణాలను కేంద్రప్రభుత్వం గుర్తించింది. అకౌంట్ క్లోజ్ చేయడం/ బదిలీ చేయడం, చెల్లుబాటు కాని ఎఎఫ్ఎస్ సి కోడ్, అకౌంట్ పని చేయకపోవడం, అకౌంట్ నిద్రాణంగా ఉండడం, అకౌంట్ లో క్రెడిట్/ డెబిట్ లావాదేవీల సంఖ్య నిర్దేశిత పరిమితిని మించిపోవడం, అకౌంట్ హోల్డర్ మరణించడం, అకౌంట్ బ్లాక్ చేయడం, చెల్లుబాటు కాని ఆధార్, నెట్ వర్క్ వైఫల్యం వంటి కారణాలు ఇందుకు దోహదకారి అవుతున్నాయి.
లావాదేవీల వైఫల్యం సమస్యను పరిష్కరించడం, రైతు కుటుంబాలకు పేమెంట్ ప్రాసెస్ అయ్యేలా చేయడం లక్ష్యంగా ప్రామాణిక నిర్వహణా విధానం (ఎస్ఓపి) ఒకటి రూపొందించి తగు చర్య కోసం రాష్ర్టాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు పంపారు. ఒక వేళ సంబంధిత రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం స్థాయిలో దిద్దుబాటు చర్య అవసరం అయితే పిఎం-కిసాన్ పోర్టల్ లోని “కరెక్షన్ మాడ్యూల్” టాబ్ కింద కరెక్షన్ చేయడానికి వీలుగా రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతానికి దాన్ని బదిలీ చేస్తారు.ఆ తర్వాత విఫలమైన లావాదేవీలన్నింటినీ తిరిగి ప్రాసెస్ చేసి పిఎం-కిసాన్ పథకం కింద ఆ వాయిదా చెల్లింపు జరిగేలా చూస్తారు.
పిఎం-కిసాన్ స్కీమ్ ప్రారంభం అయినప్పటి నుంచి జూన్ 20, 2021 వరకు మొత్తం లావాదేవీల సంఖ్య
రాష్ట్రం
|
లావాదేవీల సంఖ్య
|
అండమాన్, నికోబార్ దీవులు
|
124970
|
ఆంధ్రప్రదేశ్
|
36053705
|
అరుణాచల్ ప్రదేశ్
|
527335
|
అస్సాం
|
14263427
|
బిహార్
|
45903106
|
చండీగఢ్
|
3005
|
చత్తీస్ గఢ్
|
16587723
|
దాద్రా & నగర్ హవేలి
|
25043
|
డమన్ & డయ్యూ
|
8929
|
ఢిల్లీ
|
94246
|
గోవా
|
60981
|
గుజరాత్
|
39973146
|
హర్యానా
|
13077190
|
హిమాచల్ ప్రదేశ్
|
6749983
|
జమ్ము & కశ్మీర్
|
7667707
|
జార్ఖండ్
|
11857415
|
కర్ణాటక
|
35090495
|
కేరళ
|
24653147
|
లడఖ్
|
97640
|
లక్షద్వీప్
|
6211
|
మధ్యప్రదేశ్
|
49755906
|
మహారాష్ట్ర
|
69473946
|
మణిపూర్
|
1943834
|
మేఘాలయ
|
944302
|
మిజోరం
|
731182
|
నాగాలాండ్
|
1273941
|
ఒడిశా
|
20409732
|
పుదుచ్చేరి
|
76861
|
పంజాబ్
|
15152138
|
రాజస్థాన్
|
45503740
|
సిక్కిం
|
44835
|
తమిళనాడు
|
29549489
|
తెలంగాణ
|
27302026
|
దాద్రా & నగర్ హవేలి & డయ్యూ అండ్ డమన్
|
57705
|
త్రిపుర
|
1582321
|
ఉత్తరప్రదేశ్
|
163576770
|
ఉత్తరాఖండ్
|
6020012
|
పశ్చిమ బెంగాల్
|
1407960
|
మొత్తం
|
68,76,32,104
|
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ లోక్ సభకు సమర్పించిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ సమాచారం అందించారు.
***
(Release ID: 1739834)
Visitor Counter : 163