ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ రోగులపై పోగాకు వినియోగం యొక్క ప్రభావాన్ని అంచనా వేయడానికి అధ్యయనం
Posted On:
27 JUL 2021 3:50PM by PIB Hyderabad
అందుబాటులో ఉన్న శాస్త్రీయ ఆధారాల ప్రకారం.. పొగాకు వినియోగంపై మే 11, 2020న ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన ప్రకటన (accessed at https://www.who.int/news/item/11–05-2020-who-statement-tobacco-use-and-covid-19), 28–07–2020 న కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ విడుదల చేసిన అడ్వైజరీ ‘కోవిడ్ 19 సంక్షోభం మరియ భారతదేశంలో పొగాకు వినియోగం’ ప్రకారం..
అడ్వైజరీ కాపీ https://www.mohfw.gov.in/pdf/COVID19PandemicandTobaccoUseinIndia.pdf. లింక్లో అందుబాటులో ఉంది.
అందుబాటులో ఉన్న ప్రపంచ, భారతీయ శాస్త్రీయ ఆధారాల ప్రకారం అకాల మరణాలకు పొగాకు వినియోగం ప్రధాన కారణం. అంతేకాకుండా అసంక్రమిత వ్యాధులైన క్యాన్సర్, గుండెపోటు, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులకు పొగాకు ప్రధాన కారణమిన పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా భారత దేశంలో40 శాతం క్షయ సంబంధిత కేసులకు ధూమపానమే ప్రధాన కారణమని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
పొగాకు వినియోగాన్ని నిరోధించడానికి ప్రభుత్వం అనేకరకాల చర్యలు చేపట్టింది. అందులో ప్రధానమైనవి ఈ విధంగా ఉన్నాయి..
సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నియంత్రించడానికి పొగాకు ఉత్పత్తుల వర్తకం, వాణిజ్యం, ఉత్పత్తి, సరఫరా, పంపిణీకి సంబంధించిన ప్రకటనలను నియంత్రించే సమగ్ర ‘కోప్టా 2003’ చట్టం 2003వ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది. కోప్టా 2003 చట్టం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించడమైంది. అంతేకాకుండా మైనర్లకు పొగాకు ఉత్పత్తుల అమ్మకాలను కూడా నిషేధించారు. విద్యాసంస్థలకు వంద గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తుల అమ్మకం, ఉత్పత్తులపైనా నిషేధం విధించారు. పొగాకు ఉత్పత్తుల ప్రత్యక్ష, పరోక్ష ప్రకటనలను నిషేధించడంతోపాటు ఉత్పత్తులపై ఆరోగ్య హెచ్చరికలను ప్రదర్శించడం తప్పనిసరి చేశారు.
పొగాకు వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో 2007–08 సంవత్సరంలో జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం(ఎన్టీసీపీ)ని ప్రారంభించారు.
కోప్టా 2003 చట్టంలోని నిబంధనలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పొగాకు నియంత్రణ మార్గదర్శకాలు సులభతరంగా అమలయ్యే చూడడం కోసం పొగాకు వ్యసనాన్ని విడిచిపెట్టడంలో ప్రజలకు సహాయం చేసే పొగాకు విరమణ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పొగాకు వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేలా సినిమాలు, టీవీ కార్యక్రమాలను క్రమబద్ధీకరించారు. పొగాకు వినియోగిస్తున్న దృశ్యాలు ప్రసారమవుతున్న సందర్భాల్లో చట్టపరమైన హెచ్చరికలు ప్రసారం అయ్యేలా నిబంధనలు అమలు చేస్తున్నారు. అంతేకాకుండా పొగాకు ఉత్పత్తుల ప్రధాన భాగంలో 85 శాతం ప్రాంతాన్ని ఆరోగ్య హెచ్చరికలు కనిపించేలా నిబంధనలు అమలు చేస్తున్నారు. కొత్తగా పేర్కొన్న ఆరోగ్య హెచ్చరికల్లో క్విట్లైన్ నంబర్1800112356ను కూడా చేర్చారు.
పొగాకు విరమణ సేవల్లో భాగంగా జాతీయ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ “mCessation” పేరుతో జాతీయ స్థాయిలో నేషనల్ టోబాకో క్విట్లైన్ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా పొగాకు వినియోగాన్ని వదిలిపెట్టాలనుకునే వారి వద్దకు చేరుకోవడానికి, రాతపూర్వక సందేశాలు, ఫోన్కాల్స్ చేయడం ద్వారా పొగాకు వినియోగాన్ని విరమించేలా సహకరిస్తుంది.
టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూన్స్కు కోప్టా చట్టం 2003, సెక్షన్ 6ను విజయవంతంగా అమలు చేయడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీచేయబడ్డాయి.
ఆహార పదార్థాల్లో పొగాకు, నికోటిన్ వినియోగిండాన్ని ఆహార భద్రతా ప్రమాణా సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏ) నిషేధించింది. ఆహార భద్రతా మరియ ప్రమాణాల చట్టం–2006 మేరకు ఈ మేరకు 2011లో మార్గదర్శకాలు జారీ చేసింది.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ రాజ్యసభకు మంగళవారం ఈ మేరకు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు.
***
(Release ID: 1739695)
Visitor Counter : 248