ఆయుష్
ఔషధ మొక్కల సంరక్షణ, అభివృద్ధి ప్రాంతాల స్థితి
Posted On:
27 JUL 2021 3:39PM by PIB Hyderabad
ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే జాతీయ ఔషధ మొక్కల బోర్డు (ఎన్‌ఎంపీబీ), "ఔషధ మొక్కల సంరక్షణ, అభివృద్ధి, సుస్థిర నిర్వహణపై కేంద్ర ప్రభుత్వ రంగ పథకాన్ని" 2014-15 నుంచి అమలు చేస్తోంది. ఈ పథకం కింద, 24 రకాల 'ఔషధ మొక్కల సంరక్షణ, అభివృద్ధి ప్రాంతాలను' (ఎంపీసీడీఏలు) ఏడు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రాజెక్టు ఆధారిత సాయాన్ని ఎన్‌ఎంపీబీ అందించింది. ఇందుకోసం 940 లక్షల రూపాయలను కేటాయించి, 635.99 లక్షల రూపాయలు విడుదల చేసింది.
సహజ ఆవాసాల్లో పెరిగే ఔషధ మొక్కలను సంరక్షించడమే 'ఔషధ మొక్కల సంరక్షణ, అభివృద్ధి ప్రాంతాల' విధి. స్థిర వినియోగం ద్వారా స్థానికులు/గిరిజన ప్రజలకు జీవనోపాధి కల్పించడం కూడా ఈ పథకం దీర్ఘకాలిక ఉద్దేశం.
ఆయుష్ శాఖ సహాయ మంత్రి శ్రీ మహేంద్రభాయ్ ముంజపర ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా ఇవాళ రాజ్యసభకు సమర్పించారు.
*****
(Release ID: 1739534)
Visitor Counter : 196