ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 వాక్సినేష‌న్‌, అపోహ‌లు, వాస్త‌వాలు


కోవిడ్ వాక్సినేష‌న్ డోస్‌ల‌ను రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు ముంద‌స్తు కేటాయింపుల ప్ర‌కారం నెల‌మొత్తానికి వివిధ షెడ్యూళ్ల‌లో కేటాయింపు

జ‌న‌వ‌రి 2021 నుంచి 31 జూలై 31 వ‌ర‌కు 516 మిలియ‌న్‌డోస్‌లు స‌ర‌ఫ‌రా చేయ‌డం జ‌రుగుతుంది.

ఇండియా ఇప్ప‌టివ‌ర‌కు 440 మిలియ‌న్ డోస్‌ల వాక్సిన్‌ను వేసింది. ప్ర‌పంచంలో అత్య‌ధిక సంఖ్య‌లో వాక్సిన్ వేసిన ఘ‌న‌త‌ను సాధించింది.

Posted On: 27 JUL 2021 12:53PM by PIB Hyderabad

కోవిడ్ మ‌హ‌మ్మారిపై పోరాటంలో భార‌త ప్ర‌భుత్వం ముందుంది. కోవిడ్ పై పోరాటంలో భార‌త దేశం పెద్ద ఎత్తున ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం, వ్యాధి నిర్ధార‌ణ‌, కోవిడ్ వ్యాప్తి నిరోధ‌క ముంద‌స్తు జాగ్రత్త చ‌ర్య‌లతో పాటు  అనుస‌రిస్తున్న‌ ఐదు పాయింట్ల వ్యూహంలో వాక్సినేష‌న్ ముందు వ‌రుస‌లో ఉంది.
జూలై 2021 నాటికి అర బిలియ‌న్ డోస్‌ల‌ను వేయాల‌న్న ల‌క్ష్యాన్ని ఇండియా చేరుకోలేక‌పోవచ్చ‌ని ఇటీవ‌ల కొన్ని మీడియా క‌థ‌నాలు వ‌చ్చాయి. జూలై 2021 నాటికి 516 మిలియ‌న్ డోస్‌లు అందుబాటులో ఉంటాయ‌ని ప్ర‌భుత్వం చెప్పిన‌ట్టు కూడా అందులో పేర్కొన్నారు. ఈ స‌మాచారం స‌రైన‌ది కాదు. వాస్త‌వదూరమైన‌ది..

516 మిలియ‌న్ డోస్‌ల వాక్సిన్ కు సంబంధించిన స‌మాచారాన్ని వివిధ సోర్సుల ద్వారా తీసుకుని ఉంటారు.అది 2021 జ‌న‌వ‌రి నుంచి 2021 జులై వ‌ర‌కు అందుబాటులో ఉండ‌ద‌గ్గ  వాక్సిన్ డోస్‌ల‌కు  సంబంధించిన‌ది. వాస్త‌వం ఏమంటే 2021 జ‌న‌వ‌రి నుంచి 2021 జులై 31 వ‌ర‌కు మొత్తం 516 మిలియ‌న్ల‌కు పైగా వాక్సిన్ డోస్‌లు స‌ర‌ఫ‌రా చేయ‌డం జ‌రుగుతోంది.


ఇక్క‌డ చెప్పుకోద‌గిన ఇంకో ముఖ్య విష‌యం, రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు వాటి ముంద‌స్లు కేటాయింపుల ప్ర‌కారం ముందస్తు స‌మాచారం మేర‌కు వాటిని స‌ర‌ఫ‌రా చేయ‌డం జ‌రుగుతున్న‌ది. నెల పొడ‌వునా ఆయా షెడ్యూళ్ల ప్ర‌కారం వాటిని పంపిణీ చేయ‌డం జ‌రుగుతున్న‌ది. 516 మిలియ‌న్ డోస్‌లు నిర్దేశిత నెలాఖ‌రుకు అందుబాటు లో ఉంటాయ‌ని అంటే, ఆ నెల వ‌ర‌కు స‌ర‌ఫ‌రా చేసిన డోస్‌లు పూర్తిగా వాడిన‌ట్టు కాదు. కొన్ని స‌ర‌ఫ‌రాలు పంపిణీ వివిధ ద‌శ‌ల‌లో ఉండ‌వ‌చ్చు. అవి రాగ‌ల కొద్దిరోజుల‌పాటు వాడ‌కానికి ప‌నికి వ‌స్తాయి. అంటే ప్ర‌త్యేకించి ఆ రాష్ట్రం, జిల్లా, స‌బ్ జిల్లాలో వాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగ‌డానికి ఇది ప‌నికి వ‌స్తుంది.


ఇవాళ్టివ‌ర‌కు మొత్తం 457 మిలియన్ డోస్‌లు రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలకు 2021 జ‌న‌వ‌రి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు స‌ర‌ఫ‌రా చేయ‌డం జ‌రిగింది. అద‌నంగా 60.3 మిలియ‌న్ డోస్‌లు 31 జూలై నాటికి స‌ర‌ఫ‌రా చేయ‌డం జరుగుతుంది. దీనితో 2021 జ‌న‌వ‌రి నుంచి 2021 జూలై 31 వ‌ర‌కు మొత్తం 517 మిలియ‌న్ డోస్‌లు స‌ర‌ఫ‌రా  చేస్తున్న‌ట్టు అవుతుంది.
ఇండియా  440 మిలియ‌న్ల (44.19 కోట్ల ) డోసులు వేసిన ఘ‌న‌త సాధించింది. ప్ర‌పంచంలో ఇంత పెద్ద ఎత్తున వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం ఎక్క‌డా జ‌ర‌గ‌లేదు. అది కూడా ఎంతో వేగంగా జ‌రిగింది. ఇందులో 9.60 కోట్ల మంది రెండు డోస్‌లూ వేయించుకున్న వారు ఉన్నారు.


జూన్ 2021 లో మొత్తం 11.97 కోట్ల డోస్‌లు వేయ‌డం జ‌రిగింది. అలాగే 2021 జూలై లో అంటే 26 జూలై నాటికి మొత్తం 10.62 కోట్ల డోస్‌లు వేయ‌డం జ‌రిగింది.

దేశంలోని ప్ర‌తిఒక్క అర్హుడైన పౌరుడికి వీలైనంత త్వ‌ర‌గా కోవిడ్ వాక్సిన్‌ను అందుబాటులోకి  తెచ్చేందుకు  భార‌త ప్ర‌భుత్వం కృషి చేస్తున్న‌ది.

***

 



(Release ID: 1739432) Visitor Counter : 216