హోం మంత్రిత్వ శాఖ
కేంద్ర హోంమం త్రి అమిత్ షా మేఘాలయలో తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు చిరపుంజిలోని సోహ్రా వద్ద హరిత సోహ్రా అటవీ పెంపకం ప్రచారాన్ని ప్రారంభించారు
-ఈ పర్యటనలో భాగంగా గ్రేటర్ సోహ్రా మంచినీటి సరఫరా పథకాన్ని కూడా అమిత్ షా ప్రారంభించారు.
-ఈ సందర్భంగా అమిత్ షా, అడవుల పెంపకం,మొక్కలు నాటాల్సిన ప్రాధాన్యతను తెలియజేస్తూ ఎవర్‌గ్రీన్‌నార్త్ఈస్ట్ నినాదాన్ని ఇచ్చారు.
ఈ అడవులపెంపకం ప్రచారాన్ని మేఘాలయ ప్రభుత్వం అస్సాం రైఫిల్స్ సహకారంతో ముందుకు తీసుకువెళుతుంది. ఇది రాష్ట్రంలో పర్యావరణ పర్యాటకానికి మరింత ఊతం ఇవ్వనుంది.
-దేశ సరిహద్దుల రక్షణకు పెరా మిలటరీ బలగాలను నియమించినందువల్ల దేశం భద్రంగా ఉంది , గత రెండు సంవత్సరాలుగా వారు పర్యావరణాన్ని మెరుగుపరిచే బాధ్యత కూడా తీసుకున్నారు.
-ఇవాళ ప్రపంచం భూగోళం వేడెక్కడం, వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాడుతున్నది.\-దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వంట గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయడం ద్వారా కార్బన్ ఉద్గారాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పెద్ద ఎత్తున తగ్గించేలా చేశారు. ఇవాళ ఇండియా జల విద్యుత్ , సౌర విద్యుత్ రంగాలలో ముందువరుసలో ఉంది.
- పారిస్ ఒప్పందంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిపాదించిన కార్యాచరణ ప్రకారం, మ
Posted On:
25 JUL 2021 4:00PM by PIB Hyderabad
కేంద్ర హొంమంత్రి శ్రీ అమిత్ షా తన మేఘాలయ రెండో రోజు పర్యటనలో భాగంగా ఈరోజు చిరపుంజి , సోహ్రాలో అటవీపెంపకం, హరిత సోహ్రా కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీ అమిత్ షా గ్రేటర్ షోహ్రా మంచినీటి సరఫరా పథకాన్ని కూడా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి, సైన్స్, టెక్నాలజీ, అంతరిక్ష శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయమంత్రి శ్రీ బి.ఎల్.వర్మ, ,మేఘాలయ ముఖ్యంత్రి శ్రీ కోనార్డ్‌సంగ్మా ,కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు చెందిన సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అడవుల పెంపకం, మొక్కలు నాటడం ప్రాధాన్యతను తెలియజేస్తూ కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా ఎవర్‌గ్రీన్ నార్త్ ఈస్ట్ నినాదాన్ని ఇచ్చారు. గతంలో చిరపుంజిలో ఏడాదిపొడవునా వర్షాలు ఉండేవని ,అయితే అభివృద్ది పేరుతో విచక్షణా రహితంగా చెట్ల కొట్టివేతతో పరిస్థితి మారిందన్నారు. చిరపుంజిన హరితమయం చేసే కార్యక్రమం తిరిగి ప్రారంభమైందని ఆయన చెప్పారు. చిరపుంజి మొత్తం ప్రాంతాన్ని అస్సాం రైఫిల్స్ మొక్కలు నాటడానికి దత్తత తీసుకుంటుందని ఈ సందర్భంగా శ్రీ అమిత్ షా తెలిపారు.
చెట్లను వంట చెరకు కోసం, ఇతర అవసరాల కోసం కొట్టివేస్తున్నారని, అందువల్ల మొత్తం భూమిలో 80 శాతం మొక్కలను సంప్రదాయ, దీర్ఘకాలం ఉండే చెట్లను నాటడం జరుగుతుందని అన్నారు.మిగిలిన 20 శాతం లో జంతువులకు ఆహారంగా ఉపయోగపడేవి, నర్సరీ, అలంకరణ మొక్కలు పెంచడం జరుగుతుందన్నారు. దీనివల్ల దీర్ఘకాలం ఉండే చెట్టను కొట్టివేయకుండాచూడవచ్చన్నారు. దీనితో బహుళ అంచెల సాగు చేయవచ్చని, అటవీ ప్రాంతం 30 రెట్లు వేగంగా పెరుగుతుందని అన్నారు. మూడు సంవత్సరాల తర్వాత దీనికి నిర్వహణ ఖర్చులు కూడా ఏమీ ఉండవని చెప్పారు. పర్యావరణ పర్యాటకానికి దీనివల్ల బాగా ప్రయోజనం కలుగుతుందని ఆయన అన్నారు. అలాగే పర్యాటక రంగం వల్ల మేఘాలయ బాగా అభివృద్ధి చెందుతుందన్నారు.
సరిహద్దుల రక్షణకు పెరామిలటరీ బలగాల నియామకం వల్ల దేశం భద్రంగా ఉందని శ్రీ అమిత్ షా అన్నారు. గత రెండు సంవత్సరాలుగా వారు పర్యావరణాన్ని మెరుగు పరిచే బాధ్యతను చేపట్టారని ఆయన అన్నారు.ఇప్పటివరకు వారు 1.48 కోట్ల మొక్కల నాటారని ఇందులో 1.36 కోట్ల మొక్కలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. ఈ సంవత్సరం కూడా దేశంలోని వివిధ ప్రాంతాలలో కోటి మొక్కలు నాటనున్నారని రాగల మూడు సంవత్సరాలలో వెయ్యి హెక్టార్లలో మిలియన్ చెట్లు నాటనున్నారని చెప్పారు.
ప్రస్తుతం ప్రపంచం మొత్తం భూగోళం వేడెక్కడానికి, వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాడుతున్నదని శ్రీ అమిత్ షా చెప్పారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వంటగ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయడం ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించగలిగారని అన్నారు. అలాగే భారతదేశం జల విద్యుత్, సౌర విద్యుత్ ఉత్పత్తి రంగాలలో ముందుందని ఆయన అన్నారు.
పారిస్ ఒప్పందంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రతిపాదించిన కార్యాచరణకు అనుగుణంగా మోత్తం ప్రపంచం ఇవాళ భూగోళం వేడెక్కడానికి , కార్బన్ ఉద్గారాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నదన్నారు. మనం సాగిస్తున్న పోరాటం, జిల్లా,పంచాయత్, తాలూకా పంచాయత్ ల స్థాయిలో సామాన్య ప్రజల సహకారం లేనిదే విజయవంతం కాదని అన్నారు. వివిధ స్థాయిలలో పెరా మిలటరీ బలగాలు చేపట్టిన 10 కోట్ల మొక్కలు నాటి వాటిని పెంచే కార్యక్రమానికి సహకరించాల్సిందిగా అన్ని పంచాయతీలకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలో కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా, ప్రధానమంత్రి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జల్ జీవన్ మిషన్ ,ఈశాన్య ప్రత్యేక మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకం కింద ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వశాఖ, మేఘాలయ ప్రభుత్వం, 25 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిఇఇన గ్రేటర్ సోహ్ర వాటర్ ప్రాజెక్టు ప్రతి ఇంటికి మంచినీటిని సరఫరా చేస్తుంది. తాగునీరు పరిశుభ్రంగా లేకుంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండరని శ్రీ అమిత్ షా అన్నారు. అందువల్ల మేఘాలయ లోని ప్రతి ఇంటికి పరిశుద్ధమైన తాగునీటిని 75 వసంతాల స్వాతంత్ర దినోత్సవం, 50 సంవత్సరాల మేఘాలయ ఉత్సవాలకు ముందే పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారని తెలిపారు. మేఘాలయలోని 2,80,000 కుటుంబాలకు మంచినీటిని అందించాలన్నది బృహత్తర లక్ష్యమని దీనిని 1874 చిన్న ప్రాజెక్టులుగా రూపొందించడం జరిగిందన్నారు. ఇలాంటి ప్రాజెక్టును మారుమూల ప్రాంతంలో అమలు చేయడం సవాలుతో కూడుకున్నదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఈ కార్యక్రమానికి 400 కోట్ల రూపాయలు కేటాయించిందని, పని పురోగతిని బట్టి మరిన్ని నిధులు విడుదల చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. గత 180 సంవత్సరాలలో అస్సాం రైఫిల్స్ తనకు అప్పగించిన పనిని సకాలంలో పూర్తి చేస్తూ వచ్చిందని ఆయన అన్నారు.
దేశంలోని అన్ని కేంద్ర సాయుధ బలగాలు (సిఎపిఎఫ్)లు కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్‌షా చోరవతో ఈరోజు దేశవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. ఈ రోజు 16 లక్షల 31 వేలకు పైగా మొక్కలను నాటడం జరుగుతోంది.
సోహ్రా లోని రామకృష్ణ మిషన్‌లో స్వామి వివేకానంద విగ్రహానికి శ్రీ అమిత్ షా పూలమాలవేసి ఆయనకు నమస్కరించారు. అక్కడ జరిగిన ప్రార్థన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన రామకృష్ణ మిషన్ కు చెందిన ముఖ్యులను కలుసుకున్నారు.
***
(Release ID: 1738987)
Visitor Counter : 203