వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ఈ-నామ్ వేదికను వినియోగించుకుంటున్న రైతులు
Posted On:
23 JUL 2021 6:06PM by PIB Hyderabad
రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికి జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ-నామ్) వేదికను విరివిగా ఉపయోగిస్తున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో, మొత్తం 37.73 లక్షల మంది రైతులు, 2021-22 ఆర్థిక సంవత్సరంలో (2021 జూన్ 30వ తేదీ వరకు) మొత్తం 8.78 లక్షల మంది రైతులు ఈ-నామ్ వేదికను వినియోగించుకున్నారు. రైతులు ఈ-నామ్ ప్లాట్‌ఫామ్‌లో వర్తకం చేసే ప్రధాన పంటలలో వరి, గోధుమ, పత్తి, మిరప, సోయాబీన్, మొక్కజొన్న, బంగాళాదుంప, శనగ, టమోటా, వేరుశనగ, ఆవాలు, గౌర్ విత్తనాలు, బజ్రా, ఉల్లిపాయ, పసుపు, కందులు (తుర్/రెడ్‌గ్రామ్), జొన్నలు, పెసలు (గ్రీన్ గ్రామ్), అముదం గింజలు, పప్పు ధాన్యాలు (మసూర్), బత్తాయి మొదలైనవి ఉన్నాయి. ఈ-నామ్ అనేది వివిధ రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు (యుటీ) భౌతిక హోల్‌సేల్ మండిస్ / మార్కెట్లను అనుసంధానించే ఒక వర్చువల్ ప్లాట్‌ఫాం. దేశంలో రైతులు తమ ఉత్పత్తులకు మంచి ధరలను పొందడానికి.. ఈ -పారదర్శక ధరల ఆవిష్కరణ పద్ధతి ద్వారా వ్యవసాయం మరియు ఉద్యాన వస్తువుల ఆన్‌లైన్‌లో వర్తకం చేయడాన్ని ఇది సులభతరం చేస్తుంది. ఇప్పటి వరకు, 18 రాష్ట్రాలు, 03 యుటీలలోని 1000 వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీలు (ఎపీఎంసీ) మార్కెట్లు విలీనం చేయబడ్డాయి. ఈ-నామ్ ప్లాట్‌ఫారమ్‌లో ఈ-నామ్ యేతర మండీలలోని ధరలను సంగ్రహించడానికి నిబంధన లేదు. వ్యవసాయ ఉత్పత్తుల ధర ప్రధానంగా సరఫరా, డిమాండ్, వాతావరణ పరిస్థితులు, ఉత్పత్తి ప్రాంతం నుండి మార్కెట్ యొక్క స్థానం, ఉత్పత్తుల నాణ్యత మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది. ఈ సమాచారాన్ని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖల మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఈ రోజు రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
****
(Release ID: 1738386)