జౌళి మంత్రిత్వ శాఖ
జిఇఎం పోర్ట్ ల పరిధిలోకి 1.5లక్షల మంది చేనేత కార్మికులు
దృశ్య మాధ్యమం ద్వారా 2020-21 లో 12 చేనేత ప్రదర్శనలను నిర్వహించిన చేనేత ఎగుమతి ప్రోత్సాహక కౌన్సిల్
తమ ఉత్పత్తులను మార్కెటింగ్, అమ్మకాల కోసం దేశంలోని వివిధ ప్రాంతాలలో 53 దేశీయ మార్కెటంగ్ కార్యక్రమాల నిర్వహణ
Posted On:
22 JUL 2021 3:16PM by PIB Hyderabad
కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఎదురైన సవాళ్ళను చేనేత కార్మికులు అధిగమించేందుకు ప్రభుత్వం వారి సంక్షేమం కోసం దిగువన పేర్కొన్న చర్యలు తీసుకుందిః
కోవిడ్ -19 కారణంగా ఎగ్జిబిషన్లు, మేలాలు తదితర సంప్రదాయ మార్కెటింగ్ కార్యక్రమాలను నిర్వహించడం సాధ్యం కానందు, చేనేత ఎగుమతి ప్రోత్సాహక కౌన్సిల్ (హెచ్ఇపిసి) దృశ్య మాధ్యమం ద్వారా అంతర్జాతీయ ప్రదర్శనలను నిర్వహిస్తూ, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్‌కు, అమ్మకాలకు సౌలభ్యాన్ని కల్పిస్తోంది. దృశ్య మాధ్యమం ద్వారా 2020-2021 సంవత్సరంలో హెచ్ఇపిసి 12 ప్రదర్శనలను నిర్వహించింది. ఈ ప్రదర్శనలు లేదా సంతలు దేశీయ అంతర్జాతీయ వాణిజ్య సంస్థల దృష్టిని చెప్పుకోదగిన రీతిలో ఆకర్షిస్తున్నాయి. అంతేకాకుండా, చేనేత పనివారు తమ ఉత్పత్తులను మార్కెట్ చేసుకోవడానికి, అమ్మడానికి దేశంలోని వివిధ ప్రాంతాలలో 53 దేశీయ మార్కెటింగ్ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.
వివిధ చేనేత పథకాల కింద చేనేతి పనివారికి అందిస్తున్న ప్రయోజనాలను గురించి చెప్పేందుకు ఆగస్టు - అక్టోబర్ 2020లో వివిధ రాష్ట్రాలలో 534 గ్రామీణ కార్యక్రమాలను/ వేదికలను (చౌపాల్) నిర్వహించడం జరిగింది.
చేనేత, చేతివృత్తి రంగాలకు మద్దతునిచ్చి, చేనేత కార్మికులకు/ చేతిపనివారకు/ ఉత్పత్తిదారులకు విస్త్రత మార్కెట్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు అనేక చర్యలను తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ ఇ-మార్కెట్ (జిఇఎం)పై ఉన్న చేనేతపనివారు/ చేతివృత్తిపనివారిని వివిధ ప్రభుత్వ శాఖలకు, సంస్థలకు తమ ఉత్పత్తులను ప్రత్యక్షంగా అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తూ చర్కయలు తీసుకున్నారు. ఇప్పటివరకూ, జిఇఎం పోర్టల్ పైకి 1.5 లక్షల చేనేత పనివారలను తీసుకురావడం జరిగింది.
ఉత్పాదకతను పెంచడం, మార్కెటింగ్ సామర్ధ్యాలను పెంచి, మెరుగైన ఆదాయాలు హామీ ఇచ్చేందుకు 124 చేనేత ఉత్పాదక కంపెనీలను వివిధ రాష్ట్రాలలో ఏర్పాటు చేయడం జరిగింది.
చేనేత రంగంలో నమూనా (డిజైన్) ఆధారిత అద్భుతాలను సృష్టించేందుకు, చనేతి కార్మికులకు, ఎగుమతిదారులు, ఉత్పత్తిదారులు, సౌకర్యం కల్పించేందుకు, శాంపుల్ / ఉత్పత్తి మెరుగుదల అభివృద్ధి కోసం నమూనా కోశాగారాలను, డిజైనర్లను అందుబాటులోకి తేవడాన్ని సృష్టించేందుకు, నిర్మించాలన్న లక్ష్యంతో ఎన్ఐఎఫ్ టి ద్వారా ఢిల్లీ, ముంబై, వారణాసి, అహ్మదాబాద్, జైపూర్, భుబనేశ్వర్, గువాహతిలో వీవర్స్ సర్వీస్ సెంటర్లు (డబ్ల్యుఎస్ సి) లలో డిజైన్ రిసోర్స్ సెంటర్లను (డిఆర్‌సి)లను ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సమాచారాన్ని జౌళి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీమతి దర్శనా జర్దోష్ గురువారం రాజ్యసభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం ద్వారా వెల్లడించారు.
****
(Release ID: 1737816)