మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఐటి ఆధారిత విద్యను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు

Posted On: 22 JUL 2021 2:48PM by PIB Hyderabad

ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్‌లో భాగంగా 2020 మే 17 న పిఎం ఈ-విద్య అనే విస్తృత కార్యక్రమం ప్రారంభించబడింది. విద్యకు మల్టీ మోడ్ యాక్సెస్‌ను అందించడానికి  డిజిటల్ / ఆన్‌లైన్ / ఆన్ ఎయిర్ విద్యకు సంబంధించిన అన్ని ప్రయత్నాలను ఏకీకృతం చేస్తుంది. కార్యక్రమంలో ఇవి ఉన్నాయి:

దేశంలోని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో పాఠశాల విద్య కోసం నాణ్యమైన ఈ-కంటెంట్‌ను అందించడానికి డిజిటల్ మౌలిక సదుపాయాల కోసం దీక్షా (ఒక దేశంఒక డిజిటల్ ప్లాట్‌ఫాం) రూపొందించబడింది. ఇందులో అన్ని గ్రేడ్‌లకు అవసరమైన క్యూఆర్‌ ఆధారిత పాఠ్య పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.

·        1 నుండి 12వ తరగతి వరకూ (ఒక తరగతిఒక ఛానెల్) ప్రతి తరగతికి ప్రత్యేకమైన ప్రభా టీవీ ఛానెల్.

·        రేడియోకమ్యూనిటీ రేడియో మరియు సిబిఎస్ఇ పాడ్‌కాస్ట్‌ యొక్క విస్తృతమైన ఉపయోగం కోసం- శిక్షా వాణి.

·        దృశ్యపరంగా మరియు వినికిడి లోపం ఉన్నవారికి ప్రత్యేక ఈ-కంటెంట్ డిజిటల్ సమాచార వ్యవస్థ డిజిటల్ యాక్సస్‌బుల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (డైసీ) మరియు ఎన్‌ఐఓఎస్‌ వెబ్‌సైట్ / యూట్యూబ్‌లో సంకేత భాషలో అభివృద్ధి చేయబడింది.

ఆన్‌లైన్ విద్యను ప్రోత్సహించడానికి అవసరమైన నియంత్రణను యుజిసి అందించింది. ఇది విశ్వవిద్యాలయాలకు పూర్తి స్థాయి ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌ను అందించడానికి వీలు కల్పిస్తుంది. దాంతో పాటు యుజిసి స్వీయ మరియు ఓడిఎల్ రెగ్యులేషన్స్ నిబంధనల ప్రకారం కోవిడ్ -19 సమయంలో జాతీయ ప్రయోజనాలనును పరిగణనలోకి తీసుకొని గరిష్టంగా 40 శాతం వరకు  అమలు చేయడానికి మరియు సమర్థవంతమైన వినియోగాన్ని నిర్ధారించడానికి  ఒక కార్యక్రమంలో 20 శాతం ఆన్‌లైన్ కోర్సులు ఉన్నాయి.

విద్యా మంత్రిత్వ శాఖ వివిధ డిజిటల్ కార్యక్రమాలను కూడా చేపడుతుంది. స్వయం ( స్టడీ వెబ్స్‌ ఆఫ్‌ యాక్టివ్‌ లెర్నింగ్‌ ఫర్ యంగ్ యాస్పరింగ్ మైండ్స్)స్వయం ప్రభానేషనల్ డిజిటల్ లైబ్రరీ (ఎన్‌డిఎల్‌)వర్చువల్ ల్యాబ్ఇ-యంత్రనీట్ (నేషనల్‌ ఎడ్యుకేషన్‌ అలియన్స్‌ ఫర్ టెక్నాలజీ)ఫోసీ (ఫ్రీ ఓపెన్‌ సోర్స్‌ సాఫ్ట్‌వేర్‌ ఫర్ ఎడ్యుకేషన్‌) మొదలైనవి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఏర్పాటు చేయబడ్డాయి.

 

గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి పాఠశాలలతో పాటు ప్రభుత్వ సంస్థలకు ఫైబర్ టు ది హోమ్ (ఎఫ్‌టిటిహెచ్) కనెక్టివిటీని అందించే పనిని ఎంఈఐటివైకు చెందిన సిఎస్‌సి  ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ (సిఎస్‌సి-ఎస్‌పివి) కు అప్పగించారు.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఈ) విద్యార్థులలో సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన డిజిటల్ అలవాట్లను పెంపొందించడానికి సైబర్ సెక్యూరిటీ హ్యాండ్‌బుక్‌ను ప్రారంభించింది. సైబర్ సెక్యూరిటీ హ్యాండ్‌బుక్ను ఈ లింక్‌ ద్వారా పొందవచ్చు:

http://cbseacademic.nic.in/web_material/Manuals/Cyber_Safety_Manual.pdf.

 

నిష్ఠా  అనే ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాం ప్రారంభించబడింది. ఇది "ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైనింగ్ ద్వారా పాఠశాల విద్యా నాణ్యతను మెరుగుపరచడం" కోసం సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమం. నిష్ఠాను ఈ క్రింది లింక్ నుండి పొందవచ్చు:

https: //itpd.ncert.gov.in//

 

ఈ సమాచారాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఇచ్చారు.

 

*****


(Release ID: 1737809) Visitor Counter : 200


Read this release in: English , Urdu , Bengali , Punjabi