రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
డిజిటల్ చెల్లింపుల ద్వారా ఫీజును వసూలు చేసేందుకు జాతీయ రహదారులపై అన్ని ఫీ ప్లాజా మార్గాలను ఫాస్టాగ్ లేన్ ఆఫ్ ది ఫీ ప్లాజాగా ప్రకటించిన ప్రభుత్వం
Posted On:
22 JUL 2021 12:46PM by PIB Hyderabad
జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలలో ఫాస్టాగ్ ద్వారా డిజిటల్ చెల్లింపులను వసూలు చేసేందుకు అన్ని ఫీ ప్లాజాలను ఫాస్టాగ్ లేన్ ఆఫ్ ది ఫీ ప్లాజాగా ప్రభుత్వం ప్రకటించింది. ఇది 15/16 ఫిబ్రవరి అర్థరాత్రి నుంచి అమలులోకి వచ్చింది. ప్రస్తుతం జాతీయ రహదారులపై ఉన్న అన్ని ఫీ ప్లాజాలలో పూర్తి స్థాయిలో ఫాస్టాగ్ వ్యవస్థతో అనుసంధానం చేశారు. అన్ని రహదారులను ఫాస్టాగ్ రహదారులుగా ప్రకటించిన తర్వాత, 14 ఫిబ్రవరి, 2021 నాటికి 80%గా ఉన్న ప్లాజాలలో ఫాస్టాగ్ వినియోగం దాదాపు 96% కి వచ్చింది. 14 జులై 2021 నాటికి 3.54 కోట్ల ఫాస్టాగ్‌లను జారీ చేయడం జరిగింది.
వినియోగ రుసుము వసూలు చేసే ప్రక్రియ/ సాంకేతికతను మెరుగుపరచడం అన్నది నిరంతర ప్రక్రియ. నూతన సాంకేతికతలను, ప్రక్రియలను అందిపుచ్చుకునేందుకు కృషి జరుగుతోంది.
కేంద్ర మోటార్ వాహనాల చట్టం నిబంధనలు, 1989 కింద డ్రైవర్ సీటు, పక్కన సీటుకు ముందు ఎయిర్ బ్యాగ్ ఉండటాన్ని తప్పనిసరి చేశారు.
ఈ సమాచారాన్ని కేంద్ర రోడ్డు రవానా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ గురువారం లోక్‌సభకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో వెల్లడించారు.
***
(Release ID: 1737728)
Visitor Counter : 156