సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

దూరదర్శన్, ఆకాశవాణిలో ఒలింపిక్స్ 2020

Posted On: 21 JUL 2021 12:25PM by PIB Hyderabad

   ఒలింపిక్ క్రీడోత్సవం-2020పై ప్రసార భారతి సంస్థ మెగా కవరేజీతో అందించే ప్రసారాలను వీక్షించండి. తన జంట ప్రసార వ్యవస్థలైన దూదరర్శన్ (డి.డి.), ఆకాశవాణి (ఎ.ఐ.ఆర్.), దూరదర్శన్ క్రీడా ఛానల్- డి.డి. స్పోర్ట్స్ ద్వారా ఈ ప్రసారాలను ఆస్వాదించవచ్చు.  

  దీనితో ఒలిపింక్ క్రీడలకు ముందు, తర్వాత జరిగే కార్యక్రమాలతో సహా మొత్తం ప్రసారాలు టెలివిజన్, రేడియోల ద్వారా, డిజిటల్ ప్రసార వేదికల ద్వారా దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటాయి.

వివిధ ప్రసార వేదికల ద్వారా అందుబాటులో ఉండే కార్యక్రమాల వివరాలు:

డి.డి. స్పోర్ట్స్

ఒలింపిక్స్.పై రోజువారీ కార్యక్రమాలు

కార్యక్రమం పేరు

సమయం

ఇండియా @ టోక్యో

రాత్రి 8:30

ఒలింపిక్స్ విశేషాలు

రాత్రి 9:00

ఒలింపిక్స్ స్టాట్ జోన్

రాత్రి 9:30

 

  ఒలిపింక్ క్రీడోత్సవంలో జరిగే పోటీలపై ప్రతిరోజూ డి.డి. స్పోర్ట్స్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయి. రోజూ ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఏడు వరకూ ఈ ప్రసారాలు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రసారాల వివరాలను ఏ రోజుకారోజు డి.డి. స్పోర్ట్స్ ద్వారా, ఎ.ఐ.ఆర్. స్పోర్స్ట్ ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా తెలుసుకోవచ్చు. డి.డి. ట్విట్టర్ హ్యాండిల్: (@ddsportschannel ఎ.ఐ.ఆర్. ట్విట్టర్ హ్యాండిల్: @akashvanisports

 

డి.డి. న్యూస్

ప్రత్యేక కార్యక్రమం – సోమవారం నుంచి శుక్రవారం – రాత్రి 7గం., శనివారం – సాయంత్రం 5గం.

బ్రేక్.ఫాస్ట్ న్యూస్ లో ప్రత్యేక కార్యక్రమాలు, మిడ్ డే ప్రైమ్, న్యూస్ నైట్

 

డి.డి. ఇండియా

ప్రతి రోజూ ప్రత్యేక కార్యక్రమం రాత్రి 8.30కి

బ్రేక్.ఫాస్ట్ న్యూస్.లో ప్రత్యేక కార్యక్రమాలు, మిడ్ డే ప్రైమ్, న్యూస్ నైట్

ఆకాశవాణి (ఆలిండియా రేడియో-ఎ.ఐ.ఆర్.)

క్రమ సంఖ్య

కార్యక్రమ వివరాలు

ప్రసారమయ్యే  తేదీ/సమయాలు

(భారత కాలమానం)

ప్రసార విధానం

1.

కర్టెన్ రెయిజర్

22.07.2021

 

రాత్రి 10-30 నుంచి..

అన్ని ఎ.ఐ.ఆర్. ప్రధాన కేంద్రాలు, ఎఫ్.ఎం. రెయిన్.బో నెట్వర్క్, డి.ఆర్.ఎం., ఆసక్తి కలిగిన ఇతర ఎ.ఐ.ఆర్. కేంద్రాలు. యూట్యూబ్ ఛానెల్ (www.youtube.com/user/doordarshansports) .లో కూడా ఈ కార్యక్రమం ప్రసారం., డి.టి.హెచ్., భారతదేశం పరిధిలోని న్యూస్ఆన్.ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా ప్రసారం.

2.

రోజువారీ ముఖ్యాంశాలు

23.07.2021 నుంచి  08.08.2021 వరకూ,

ప్రతి రోజూ రాత్రి 10-30 నుంచి

అన్ని ఎ.ఐ.ఆర్. ప్రధాన కేంద్రాలు, ఎఫ్.ఎం. రెయిన్.బో నెట్వర్క్, డి.ఆర్.ఎం., ఆసక్తి కలిగిన ఇతర ఎ.ఐ.ఆర్. కేంద్రాలు. యూట్యూబ్ ఛానెల్ (www.youtube.com/user/doordarshansports) .లో కూడా ఈ కార్యక్రమం ప్రసారం., డి.టి.హెచ్., భారతదేశం పరిధిలోని న్యూస్ఆన్.ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా ప్రసారం.

3.

ఎప్పటికప్పుడు ఎఫ్.ఎం.  అప్.డేట్స్

24.07.2021నుంచి  07.08.2021వరకూ..

 

రోజూ ఉదయం 07 గంటల నుంచి రాత్రి 07 వరకూ,..

 

భారత్ పతకం గెలిచినప్పుడల్లా ఎఫ్.ఎం. చానెల్స్ లో బ్రేకింగ్ న్యూస్ కూడా ప్రసారం చేయవచ్చు.

 

ఎఫ్.ఎం. రెయిన్.బో నెట్వర్క్

4.

ఎంపిక చేసిన కొన్ని హాకీ పోటీలపై ఆఫ్-ట్యూబ్ కామెంట్రీ

 

అనుబంధం-Iలో సూచించిన ప్రకారం

అన్ని ఎ.ఐ.ఆర్. ప్రధాన కేంద్రాలు, ఎఫ్.ఎం. రెయిన్.బో నెట్వర్క్, డి.ఆర్.ఎం., ఆసక్తి కలిగిన ఇతర ఎ.ఐ.ఆర్. కేంద్రాలు. యూట్యూబ్ ఛానెల్ (www.youtube.com/user/doordarshansports) .లో కూడా ఈ కార్యక్రమం ప్రసారం., డి.టి.హెచ్., భారతదేశం పరిధిలోని న్యూస్ఆన్.ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా ప్రసారం.

5.

ఎంపిక చేసిన కొన్ని బ్యాడ్మింటన్ పోటీలపై ఆఫ్-ట్యూబ్ కామెంట్రీ

 

అనుబంధం-IIలో సూచించిన ప్రకారం

అన్ని ఎ.ఐ.ఆర్. ప్రధాన కేంద్రాలు, ఎఫ్.ఎం. రెయిన్.బో నెట్వర్క్, డి.ఆర్.ఎం., ఆసక్తి కలిగిన ఇతర ఎ.ఐ.ఆర్. కేంద్రాలు. యూట్యూబ్ ఛానెల్ (www.youtube.com/user/doordarshansports) .లో కూడా ఈ కార్యక్రమం ప్రసారం., డి.టి.హెచ్., భారతదేశం పరిధిలోని న్యూస్ఆన్.ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా ప్రసారం.

 

 

 

 

 

గమనిక: కర్టెన్ రెయిజర్, రోజువారీ ముఖ్యాంశాలపై ప్రాంతీయ భాషల్లో అనువాద కార్యక్రమాలను హిందీయేతర ఎ.ఐ.ఆర్. కేంద్రాలు మరుసటి రోజున వారికి సానుకూలమైన వేళల్లో ప్రసారం చేయవచ్చు. అయితే, ఉదయం ప్రసారాల సమయంలో ప్రసారం చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది.

అనుబంధం-I

తేదీ/ వారం

పోటీ (మ్యాచ్) వివరాలు

పోటీ జరిగే స్థలం

పోటీ జరిగే సమయం (భారత కాలమానం)

24.07.2021

(శనివారం)

ఇండియా- న్యూజిలాండ్ (పురుషులు)-పూల్ మ్యాచ్

ఒఐ హాకీ స్డేడియం, టోక్యో

ఉదయం 06.30 నుంచి

24.07.2021

(శనివారం)

ఇండియా- నెదర్లాండ్స్ (మహిళలు)-పూల్ మ్యాచ్

ఒఐ హాకీ స్డేడియం, టోక్యో

సాయంత్రం 05.15 నుంచి

25.07.2021

( ఆదివారం)

ఇండియా- ఆస్ట్రేలియా (పురుషులు) –పూల్ మ్యాచ్

ఒఐ హాకీ స్డేడియం, టోక్యో

సాయంత్రం 03.00 నుంచి

26.07.2021

(సోమవారం)

ఇండియా- జర్మనీ (మహిళలు)-పూల్ మ్యాచ్

ఒఐ హాకీ స్డేడియం, టోక్యో

సాయంత్రం

05.45 నుంచి

 

27.07.2021

(మంగళవారం)

ఇండియా- స్పెయిన్ (పురుషులు) –పూల్ మ్యాచ్

ఒఐ హాకీ స్డేడియం, టోక్యో

ఉదయం 06.30 నుంచి

28.07.2021

(బుధవారం)

ఇండియా- గ్రేట్ బ్రిటన్ (మహిళలు) –పూల్ మ్యాచ్

ఒఐ హాకీ స్డేడియం, టోక్యో

ఉదయం 06.30 నుంచి

29.07.2021

(గురువారం)

ఇండియా Vs. అర్జెంటీనా (పురుషులు) –పూల్ మ్యాచ్

ఒఐ హాకీ స్డేడియం, టోక్యో

ఉదయం 06.00 నుంచి

30.07.2021

(శుక్రవారం)

ఇండియా. ఐర్లండ్ (మహిళలు) –పూల్ మ్యాచ్

ఒఐ హాకీ స్డేడియం, టోక్యో

ఉదయం

08.15 నుంచి

30.07.2021

(శుక్రవారం)

ఇండియా- జపాన్

(పురుషులు) –పూల్ మ్యాచ్

ఒఐ హాకీ స్డేడియం, టోక్యో

సాయంత్రం 03.00 నుంచి

 

31.07.2021

(శనివారం)

ఇండియా- దక్షిణాఫ్రికా (మహిళలు) –పూల్ మ్యాచ్

ఒఐ హాకీ స్డేడియం, టోక్యో

ఉదయం 08.45 నుంచి

*01.08.2021

(ఆదివారం)

ఇండియా స్పెసిఫిక్ క్వార్టర్ ఫైనల్(పురుషులు)

ఒఐ హాకీ స్డేడియం, టోక్యో

ఇంకా నిర్ధారణ కావలసి ఉంది.

*02.08.2021

(సోమవారం)

ఇండియా స్పెసిఫిక్ క్వార్టర్ ఫైనల్(మహిళలు)

ఒఐ హాకీ స్డేడియం, టోక్యో

ఇంకా నిర్ధారణ కావలసి ఉంది.

03.08.2021

(మంగళవారం)

మొదటి సెమీఫైనల్ మ్యాచ్ (పురుషులు)

ఒఐ హాకీ స్డేడియం, టోక్యో

ఉదయం 07.00 నుంచి

 

03.08.2021

(మంగళవారం)

2వ సెమీఫైనల్ మ్యాచ్ (పురుషులు)

ఒఐ హాకీ స్డేడియం, టోక్యో

సాయంత్రం 03.30 నుంచి

 

04.08.2021

(బుధవారం)

మొదటి సెమీఫైనల్ మ్యాచ్ (మహిళలు)

ఒఐ హాకీ స్డేడియం, టోక్యో

ఉదయం 07.00 నుంచి

 

04.08.2021

(బుధవారం)

2వ సెమీఫైనల్ మ్యాచ్ (మహిళలు)

ఒఐ హాకీ స్డేడియం, టోక్యో

సాయంత్రం 03.30 నుంచి

 

*05.08.2021

(గురువారం)

కాంస్య పతకం కోసం మ్యాచ్ (పురుషులు)

స్వర్ణ పతకం కోసం మ్యాచ్ (పురుషులు)

ఒఐ హాకీ స్డేడియం, టోక్యో

ఉదయం 07.00 నుంచి

 

సాయంత్రం 03.30 నుంచి

*06.08.2021

(శుక్రవారం)

కాంస్య పతకం కోసం మ్యాచ్ (మహిళలు)

స్వర్ణ పతకం కోసం మ్యాచ్ (మహిళలు)

ఒఐ హాకీ స్డేడియం, టోక్యో

ఉదయం 07.00 నుంచి

 

సాయంత్రం 03.30 నుంచి

 

* క్వార్టర్ ఫైనల్ పోటీలు, కాంస్య పతకం కోసం జరిగే పోటీల్లో భారత జట్టు ఆడుతున్న పక్షంలో ఆ పోటీలపై ఆఫ్-ట్యూబ్ కామెంట్రీని ఎ.ఐ.ఆర్. ప్రసారం చేస్తుంది.

గమనిక: పైన పేర్కొన్న హాకీ పోటీలపై ప్రత్యక్ష ప్రసారాల లైవ్ ఫీడ్ లభ్యతను బట్టి ఆఫ్-ట్యూబ్ కామెంట్రీని ప్రసారం చేస్తారు.

అనుబంధం-II

తేదీ/ వారం

పోటీ (మ్యాచ్) వివరాలు

పోటీ జరిగే స్థలం

పోటీ జరిగే సమయం (భారత కాలమానం)

31.07.2021

(శనివారం)

పురుషుల డబుల్స్ సెమీఫైనల్స్

ముసాషినో ఫారెస్ట్ స్పోర్ట్స్ ప్లాజా బ్యాండ్మింటన్ కోర్ట్

ఉదయం

05.30 నుంచి

01.08.2021

(ఆదివారం)

మహిళల డబుల్స్ సెమీఫైనల్స్

ముసాషినో ఫారెస్ట్ స్పోర్ట్స్ ప్లాజా బ్యాండ్మింటన్ కోర్ట్

సాయంత్రం 05.00 నుంచి

 

*01.08.2021

(ఆదివారం)

పురుషుల డబుల్స్ కాంస్యపతకం  మ్యాచ్

ముసాషినో ఫారెస్ట్ స్పోర్ట్స్ ప్లాజా బ్యాండ్మింటన్ కోర్ట్

టి.బి.సి.

 

02.08.2021

(సోమవారం)

పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్స్

ముసాషినో ఫారెస్ట్ స్పోర్ట్స్ ప్లాజా బ్యాండ్మింటన్ కోర్ట్

ఉదయం 09.30 నుంచి

02.08.2021

(సోమవారం)

మహిళల సింగిల్స్ ఫైనల్

ముసాషినో ఫారెస్ట్ స్పోర్ట్స్ ప్లాజా బ్యాండ్మింటన్ కోర్ట్

పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్ అనంతరం

02.08.2021

(సోమవారం)

Men’s Double Final

ముసాషినో ఫారెస్ట్ స్పోర్ట్స్ ప్లాజా బ్యాండ్మింటన్ కోర్ట్

మహిళల సింగిల్స్ ఫైనల్ అనంతరం

02.08.2021

(సోమవారం)

Men’s Singles Final

ముసాషినో ఫారెస్ట్ స్పోర్ట్స్ ప్లాజా బ్యాండ్మింటన్ కోర్ట్

సాయంత్రం 04.30 నుంచి

 

*కాంస్యపతకం కోసం జరిగే పురుషుల డబుల్స్ పోటీలో భారతీయ జంట పాల్గొనే పక్షంలో ఆ పోటీపై ఎ.ఐ.ఆర్.  కూడా ఆఫ్ ట్యూబ్ కామెంట్రీని ప్రసారం చేస్తుంది.

గమనిక: పైన పేర్కొన్న బ్యాండ్మింటన్ పోటీలపై లైవ్ ఫీడ్ లభ్యతను బట్టి ఆఫ్ ట్యూబ్ కామెంట్రీని ప్రసారం చేస్తారు.

ఆకాశవాణి వార్తా సేవల విభాగం (ఎ.ఐ.ఆర్. న్యూస్ నెట్వర్క్)

  • ఒలింపిక్స్ క్విజ్-ఎ.ఐ.ఆర్. న్యూస్: స్పోర్ట్స్ స్కాన్ కార్యక్రమంలో 2021 జూలై ఒకటవ తేదీనుంచి ప్రతిరోజూ ప్రసారమవుతోంది. ఈ పోటీలో దేశవ్యాప్తంగా ఉన్న విజేతలకు టీమ్ ఇండియా జెర్సీ లభిస్తుంది. భారతీయ క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్.ఎ.ఐ.) అనుబంధంతో ఈ కార్యక్రమం చేపడుతున్నారు.
  • ఎ.ఐ.ఆర్. ఒలింపిక్స్ స్పెషల్ సిరీస్: భారత జట్టు క్రీడాకారుల జీవిత విశేషాలతో స్పోర్స్ట్ స్కాన్ కార్యక్రమంలో, ప్రైమ్ టైమ్ న్యూస్ బులిటెన్లలో రోజువారీ ప్రసారాలు. 
  • టోక్యో ఒలింపిక్ క్రీడోత్సవం,.. భారత్ పతకాలు గెలిచే అవకాశాలపై రోజువారీ స్పోర్ట్స్ స్కాన్.
  • బ్రాండింగ్ ఆఫ్ సుర్ఖియోం మేఁ.. రోజూ సాయంత్రం 7.40-7.50 మధ్య as India@Tokyo Olympics కార్యక్రమం
  • ప్రత్యేక వార్తా కథనాలు/వాయిస్ కాస్ట్స్: భారత్ పతకం గెలిచే అవకాశాలను ప్రధానంగా వివరిస్తూ, జట్టు సన్నాహాలు, ప్రభుత్వ మద్దతుపై కార్యక్రమం.
  • ప్రత్యేక ఇంటర్వ్యూలు, ప్రత్యేక చర్చలతో “సుర్ఖియోం మేఁ” శీర్షికన హిందీలో,  “స్పాట్ లైట్” శీర్షికన ఇంగ్లీషులో కార్యక్రమం. భారత్ సన్నాహాలు, అవకాశాలు, టోక్యో ఒలింపిక్ క్రీడల్లో భారత జట్టు ఆటతీరు తదితర అంశాలపై భారతీయ క్రీడా బృందం, క్రీడా ప్రముఖులు, కోచ్.ల భాగస్వామ్యంతో కార్యక్రమ నిర్వహణ.
  • ఛీర్ ఫర్ ఇండియా కార్యక్రమం: క్రీడా ప్రముఖులు, కోచ్.లు, భారత జట్టు సభ్యుల బంధువులు, సామాజిక ప్రభావ శీలుర సందేశాలను ఎ.ఐ.ఆర్. న్యూస్ ఛానల్తో పాటుగా, 46 ప్రాంతీయ భాషా కేంద్రాలు కూడా 77 భాషల్లో ప్రసారం చేస్తాయి. వారి వ్యాఖ్యలను, వీడియో సందేశాలను, సెల్ఫీలను ఎ.ఐ.ఆర్. సామాజిక మాధ్యమ వేదికల ద్వారా ప్రసారం చేస్తారు.
  • వాక్స్ పాప్ (ప్రజావాణి) పేరిట భారతీయ జట్టుకు శుభాంకాంక్షలు అందిస్తూ  పౌరుల, మాజీ క్రీడా ప్రముఖుల మాటలను, సామాజిక ప్రభావశీలుల వ్యాఖ్యలను ప్రసారం చేస్తారు.
  • ప్రాంతీయ ప్రచారం: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన భారతీయ క్రీడాకారులపై వార్తా కథనాలను వారి సొంత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రాంతీయ వార్తాప్రసార కేంద్రాలు సంబంధిత రాష్ట్రాల ప్రాంతీయ భాషల్లోనే ప్రసారం చేస్తూ వస్తున్నాయి.  
  • ఆకాశవాణికి అనుబంధంగా దేశవ్యాప్తంగా ఉన్న సామాజిక మాధ్యమ వేదికలు తమ కవరేజీని విస్తృతం చేస్తున్నాయి. సంబంధిత ఫొటోలను, వీడియోలను, వార్తా కథనాలను ట్వీట్లు, ఇన్ఫోగ్రాఫిక్స్ ద్వారా ఇంగ్లీషు, హిందీ, ఇతర ప్రాంతీయ భాషల్లో పోస్ట్ చేస్తున్నాయి.  

  ప్రసార భారతి డిజిటల్ విభాగమైన ప్రసార భారతి న్యూస్ సర్వీసెస్ (పి.బి.ఎన్.ఎస్.) కూడా తన సామాజిక మాధ్యమ వేదికల వ్యవస్థ ద్వారా దూరదర్శన్, ఆకాశవాణి ప్రసారాలను విస్తృతం చేయబోతోంది. న్యూస్ వెబ్ సైట్, న్యూస్.ఆన్ ఎయిర్ యాప్, పి.బి.ఎన్.ఎస్. టెలిగ్రామ్ ఛానల్ (https://t.me/pbns_india) ద్వారా ఈ ప్రసారాలను విస్తృతం చేయనున్నది.

 

 

****


(Release ID: 1737587) Visitor Counter : 300