ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 వాక్సినేషన్ అప్‌డేట్
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 43.25 కోట్లకుపైగా వాక్సిన్ డోస్‌లను సరఫరా చేయడం జరిగింది.
2.88 కోట్లకుపైగా మిగులు, ఉపయోగించని వాక్సిన్ డోస్‌లు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రైవేటు ఆస్పత్రుల వద్ద
ఉపయోగానికి సిద్ధంగా ఉన్నాయి.
Posted On:
21 JUL 2021 10:14AM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కోవిడ్ -19 వాక్సిన్ కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు కట్టుబడి ఉంది. కోవిడ్ -19 సార్వత్రిక వాక్సినేషన్‌కు సంబంధించిన కొత్త దశ2021 జూన్ 21 నుంచి ప్రారంభమైంది. మరిన్ని వాక్సన్‌లు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వాక్సినేషన్‌ను వేగవంతం చేశారు. మరింత మెరుగైన ప్రణాళిక ద్వారా వాక్సిన్ అందుబాటుకు సంబంధించిన ముందస్తు సమాచారం అందించడంతోపాటు, వాక్సిన్ అందుబాటును రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పెంచడం జరిగింది.
దేశ వ్యాప్త వాక్సినేషన్ కార్యక్రమంలొ భాగంగా, భారత ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కోవిడ్ వాక్సిన్‌లను ఉచితంగా సరఫరా చేస్తున్నది. కోవిడ్ -19 వాక్సినేషన్ నూతన దశలో కేంద్ర ప్రభుత్వం , వాక్సిన్ ఉత్పత్తిదారులు ఉత్పత్తి చేసే వాక్సిన్‌లో 75 శాతం వాక్సిన్‌ను సేకరించి దానిని ఉచితంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సరఫరా చేస్తుంది.
వాక్సిన్ డోస్‌లు
|
(21 జులై 2021 నాటికి)
|
సరఫరా చేసినవి
|
43,25,17,330
|
పంపిణీ దశలో ఉన్నవి
|
53,38,210
|
వినియోగించినవి
|
40,36,44,231
|
మిగులు అందుబాటులో ఉ న్నవి
|
2,88,73,099
|
రాష్ట్రాలు ,కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు 43.25 కోట్ల (43,25,17,330) వాక్సిన్ డోస్‌లను వివిధ మార్గాల ద్వారా పంపిణీ చేయడం జరిగింది. మరో 53,38,210 డోస్‌లు పంపిణీ దశలో ఉన్నాయి.
ఈ మొత్తం లో వృధా అయిన డోస్‌లతో కలిపి 40,36,44,231 డోస్‌లు ( ఈరోజు ఉదయం 8 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం) ఉపయోగించడం జరిగింది.
2.88 కోట్లకు పైగా డోస్‌లు (2,88,73,099) మిగులు, ఉపయోగించని కోవిడ్‌వాక్సిన్ డోస్‌లు ఇంకా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాతాలు,ప్రైవేటు ఆస్పత్రుల వద్ద ఉన్నాయి.
***
(Release ID: 1737583)
Visitor Counter : 201